Tuesday, January 23, 2018

ఆదిశంకరులు తిరుమల గిరిపై వెలసిన వెంకన్నగారి హుండీకి లక్ష్మీ యంత్రాన్ని ధనాకర్షణ, జనాకర్షణ యంత్రాన్ని ఎందుకు స్థాపించారు



Vinjamuri Venkata Apparao = నాకు ఒక్క విషయం అర్థం కాలేదు. పండితులను అడిగాను కాని దాటేశారు సరైన సమాధానం చెప్పలేదు. కొంచెం పెద్దలు నా సందేహాన్ని తీర్చగలరు. ఏమంటే ఆదిశంకరులు ఆశేతు హిమాచల పర్యంతం పర్యటించి అనేక మఠాలను నెలకొల్పి హైందవమతాన్ని జాగ్రుతం చేసారు. బాగుంది. చాలా బాగుంది. అయితే ఆయన కొండకోనలలో జనులు చొరరాని కీకారణ్యంగా వున్న తిరుమల గిరిపై వెలసిన వెంకన్నగారి హుండీకి లక్ష్మీ యంత్రాన్ని ధనాకర్షణ, జనాకర్షణ యంత్రాన్ని ఎందుకు స్థాపించారు తన శైవ మఠాలను వదిలేసి. ఎవరికైనా తన మఠాలపైనే దృష్టి వుంటుంది కదా. శంకర మఠాలను వదిలేసి వైష్ణవ క్షేత్రంలోనే ఎందుకు యంత్రాలను ప్రతిష్టించారు అని. శంకరులవారికి శివకేశవ బేధం లేదు అని చెప్పచ్చు. కేవలం వైష్ణవ క్షేత్రం అభివృద్ధిని కాంక్షించే చేసారంటారా....... పెద్దలెవరైన సరైన వివరణ ఇస్తే బాగుంటుంది. అక్కడ ఉన్న మూల విరాటు శివుడు అని కొందరి వాదన కూడా ఉంది... వైష్ణవ మత ఆచార్యులు లింగం ని మార్పిడి చేసారు అనే వారు మా తాతగారు....అందుకే వెంకట+ ఈశ్వరుడు అంటారు అనేవారు.నిజం పూజారులకే తెలుసు..
VVS = ఈ ప్రశ్నలోని విషయాలు సామాన్యంగా అందరికీవచ్చే సంశయాలే. మనందరి పరిజ్ఞానం - పెద్దలు చెప్పినా, ప్రవచనాలు విన్నా, ఇప్పుడు ఇంటర్నెట్లో ఉన్న సమాచారం వెదకినా వచ్చినదే. పురాణ వాఙ్మయము చదివి ప్రమాణములతో చెప్పగలవారు చాలా తక్కువ. మన మొదటి అపోహ శంకరాచార్యుడు శైవుడు, ఆయన వైష్ణవుడు కాడు అనేది. శంకరాచార్యుని చిత్రించే విధానం శైవునిలా విబూతిధారణతో కనుపిస్తుంది. ఈ శైవ, వైష్ణవభేదాలు శంకరుల తరువాత వచ్చినవి. రామానుజ పూర్ణప్రజ్ఞ (మధ్వ) దర్శనాలనే వైష్ణవదర్శనాలంటారు. మహాభారతంలో భీష్ముడు విష్ణుసహస్రం చెబితే, శ్రీకృష్ణుడు ధర్మజునికి శివ పూజా మాహాత్మ్యము, శివసహస్రము చెప్పాడు. శైవ దర్శనాలు చాలా ప్రాచీనమైనవి - నకులీశ పాశుపతము, ప్రత్యభిజ్ఞ దర్శనము మొదలైనవి. శంకరుల ఇలవేల్పు శ్రీకృష్ణుడు. ఆయన అందరు దేవతల పూజలు చేశారు. శంకరమఠాల అధిష్ఠానదేవత అమ్మవారు - శారద,కామాక్షి,... బదరీ విష్ణు క్షేత్రం. పురీక్షేత్రము జగన్నాథక్షేత్రము, ద్వారక శ్రీకృష్ణ క్షేత్రము. కాపాలికుల బారినుండి ఆయనను నరసింహుడు రక్షించాడు. పీఠాధిపతులందరూ నారాయణ నామస్మరణ చేస్తూ ప్రతిదినము శివలింగానికి అభిషేకంచేస్తారు. పంచాయతనంలో శివలింగం, సాలిగ్రామం రెండూ ఉంటాయి. రుద్రముతో పాటు, శ్రీసూక్తమూ చదువుతారు. సృష్టి అంతా మహావిష్ణువు నుండే వస్తుంది. అందుచేత ఈయన మూడవ బ్రహ్మ. ప్రథమ బ్రహ్మ నిర్గుణమైన సదాశివ తత్త్వము. రెండవది సృష్టి సంకల్పము వలన ఒకటిరెండైన కామేశ్వరీ-కామేశ్వర తత్త్వము. ఈ రెండిటిని పూర్తిగా ధరించిన క్షీరసాగరశయనుడైన మహావిష్ణువే జగన్నాటక సూత్రధారి. హిరణ్యగర్భనామంతో అనేక బ్రహ్మాండములను సృష్టించినది ఆయనే .ప్రతిబ్రహ్మాండములోను త్రిమూర్తులు విష్ణు, బ్రహ్మ, రుద్రులు కార్యబ్రహ్మలుగా ఉంటారు. అనేక విష్ణువులు, రుద్రులు, ఆదిత్యులు ఉంటారు. నామ రూప సహితమైన ఈశ్వర ప్రతిష్ఠ గల ప్రతి దేవాలయములోని దేవతాతత్త్వము భిన్నముగా ఉంటుంది. శంకరమఠం శైవ మఠంకాదు. వారు అద్వైతులు. (స్మార్తులు) వేదాలలో ఇద్దరుదేవతలూ ఉన్నారు.అద్వైతములో నిర్గుణబ్రహ్మమే పరమ సత్యము. శివకేశవులకు అభేదము. ఇక తిరుమలలోని శ్రీవేఙ్కటేశ్వరుని వద్దకు వస్తే శ్రీరామానుజులకాలములోనే వైష్ణవాచారాలు ప్రముఖ్యం వహించాయని అంటారు. కాని శ్రీరంగంలో వలె ఇక్కడ సేవలు పాంచరాత్ర ఆగమంపై ఆధార పడిఉండవు. ఇక్కడ ఇంకా ప్రాచీన వైష్ణవాగమమైన వైఖానసాన్ని అనుసరిస్తారు. అన్నమాచార్య వైష్ణవులైనా ఈ ప్రాచీన సాంప్రదాయాల స్మరణ ఆయన కీర్తనలలో స్పష్టంగా కనపడతుంది. "కొలుతురు మిము వైష్ణవులు కూరిమితొ విష్ణుడని పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మాం బనుచు తలతురు మిము శైవులు తగిన భక్తులును శివుడనుచు అలరి పొగడుదురు కాపాలికులు ఆది భైరవుడనుచు" బాలాజీ అన్నపేరు బాల అన్న లలితానామమునుండి వచ్చినదంటారు. పూర్వము మూల విరాట్టు స్కందుని విగ్రహమన్న ఐతిహ్యంకూడా ఉన్నది. ఏపేరుతో తలచినా భారతీయులందరికీ ఆరాధ్యదైవము వారివారి ఇష్టదైవముగానే గోచరిస్తాడు అనుకుంటే మనకు మంచిది.

Buddhavarapu Venkateswara Rao It may be due to the clash for authority between the saiva's and vaishnavait's . After successfully arresting spread of Buddhism all over India veera saivas concentrated on to dethrone vaishnavam. may be a historian be able to explain this.

Vvs Sarma Our Indian historians are often far from truth. Their contribution is often his story or her story. Washing sins is an alien concept. After committing a sin if there is genuine repentance and a promise to God that he will not repeat it there may be some benefit like getting a quick punishment. For example if Gali has given a gold crown to Sri Venkatesvara, God's blessing has come in the form of his going to jail. Buddhism failed in India because of its own weakness developed over years. Sankara only reestablished Sanatana dharma in the vaccuum left by Jainism and Buddhism.. Both these philosophies are narrower than the outlook of Sanatana dharma.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...