Thursday, January 25, 2018

పునరుజ్జీవనం - ఐరోపా, బెంగాల్, ఆంధ్ర.


Renaissance - Europe, Bengal and Andhra
https://www.facebook.com/vallury.sarma/posts/570086636362087


ఆధునిక భారత చరిత్రలో బెంగాల్ కు ఒక విశిష్ట స్థానం ఉంది. మధ్యయుగాలు ఆధునికతవైపు పయనించడమే పునరుజ్జీవనం. Renaissance అనే ఆంగ్లపదం ఆ పరిణామానికి సరిగా సరిపోతుంది. దానికి సరియైన తెలుగుపదం ఏమిటి? పునర్జాగరణ, నవయుగారంభం వంటి పదాలకంటె పునరుజ్జీవనం అన్న పదంబాగుంటుందనిపించింది. ఇది ఐరోపా చరిత్రలో 14వ శతాబ్దంనుండి 17వ శతాబ్దం వరకు ఉన్న కాలము. సంస్కృతిలో, విజ్ఞానంలో, కళారంగంలో, సాహిత్యంలో అనేక పరిణామాలు ఈ సమయంలో జరిగాయి. ఇది ఇటలీలో ప్రారంభమై ఐరోపా అంతా వ్యాపించింది. విఖ్యాతులైన లియొనార్డో డా విన్సీ , మైకేల్ యాంజెలో ఈకాలంవారే. 15వ శతాబ్దంలో బైజాంటిన్ సామ్రాజ్యం ముగిసి ఆటోమాన్ తురకలకు (Turks)కు కాన్ స్టాంటి నోపిల్ వశమైనది. అక్కడినుండి గ్రీకు పండితులు ఇటలీవలస రావడంతో గ్రీకుల ప్రాచీన విజ్ఞానానికి పునర్జన్మ వచ్చింది. సాహిత్యం, వ్యాకరణం,తత్త్వ శాస్త్రం, నీతిశాస్త్రం, తర్కం, మొదలైనవన్నీ మానవీయ కళలు (arts and humanities) గా అప్పటి కాలానికి తగినట్లు అధ్యయనంచేయబడ్డాయి. చర్చికూడా ఈ పునరుజ్జీవనాన్ని ఉపయోగించుకుని క్రైస్తవమతాన్ని విశ్వవ్యాప్తంచేయడానికి వ్యూహాలను సిద్దంచేసుకున్నది. ఈకాలంలోనే భారతదేశంలో క్రైస్తవమతాన్ని వ్యాప్తి చేసే ఉద్దేశ్యంతో స్పెయిన్ దేశపు కొలంబస్, పోర్చుగల్ నుండి వాస్కోడగామా భారతదేశానికి సముద్రమార్గాల అన్వేషణలో బయలుదేరారు. దీనికి కారణం భూమార్గం తురకల వశమైనది.  

ఇంగ్లండులో ఈ ఎలిజబెత్ I రాణి కాలం (1558)లో ప్రారంభమైనది. 1600 సమయానికి షేక్ స్పియర్ తన నాటకాల వలన ప్రసిద్ధుడైయ్యాడు. 1600 లోనే భారతదేశంలో వ్యాపారానికి ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడినది. తరువాత తరం విఖ్యాత కవి జాన్ మిల్టన్ . ఎలిజబత్ కాలంలోనే రోములోని కాథొలిక్ చర్చి ఆమెను వెలివేసింది. పోర్చుగీసు పాలనతో క్రైస్తవమతం, ఈస్ట్ ఇండియా కంపనీ తో ఇంగ్లీషు మనదేశంలో రంగప్రవేశం చేశాయి. (క్రైస్తవమతం ఒకటో శతాబ్దంలోనే కేరళలో పరిమిత స్థానంలో కాలుమోపింది.) ఈ సమయానికి భారతదేశంలో అత్యధిక భాగం మహామ్మదీయుల పాలనలో ఉన్నది. ఇదేకాలంలో ఆంధ్రదేశం విజయనగర సామ్రాజ్యంలో అంతర్భాగం. హంపిలో శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనా కాలం 1509-1529. 1565లో తళ్ళికోట యుద్ధంలో ఈ సామ్రాజ్య పతనం ఆరంభమైంది. కొన్ని దశాబ్దాలలో గోల్కొండ నవాబుల పాలనలోనికి వచ్చినది. 1525 నాటికి భారతదేశం ఐరోపాకంటి చాలా ఉచ్చస్థితిలో ఉన్నది. అప్పటినుండి కనీసం 1800 వరకు పతనమార్గమే. మనము పునరుజ్జీవనము అనుకున్నది అప్పుడు ప్రారంభమైంది.


పునరుజ్జీవనం - ఐరోపా, బెంగాల్, ఆంధ్ర.
మరి 1453 లో కాన్ స్టాంటినోపుల్ జయించిన ఆటొమాన్ సామ్రాజ్యం ఐరోపా పునరుజ్జీవన కాలంలో ఏమైనది? ఆ విజయం తరువాత రెండున్నర శతాబ్దాలలో అది మహా సామ్రాజ్యమయింది. ఆగ్నేయ ఐరోపా, పశ్చిమ ఆసియా, ఉత్తర ఆఫ్రికా లలోని అనేకదేశాలకు విస్తరించిన సామ్రాజ్యం అది. దానికి కేంద్రం టర్కీ దేశం. ప్రధమ ప్రపంచ యుద్ధంవరకు అది ప్రాచ్య పాశ్చాత్యదేశాల వారధి. 20వ శతాబ్దం ప్రారంభంలో అది అంకారా రాజధానిగా ఐరోపాలోని ముస్లిం దేశంగా మిగిలినది. 15,16 శతాబ్దాలలో ఐరోపా ఆసియా వ్యాపార మార్గాలన్నీ టర్కీ అధీనంలో ఉండేవి. మత ప్రాముఖ్యంగల మక్కా, మదీనా, జెరూసలెం, నాజరెత్ కూడా వీరి పాలనలోనివే. సులేమాన్ 1 పరిపాలనా కాలంలో (1520-1566) ఆటొమాన్ సామ్రాజ్యం ఉచ్చదశకు చేరుకుంది. అట్లాంటిక్ తీరంలో స్పెయిన్ నుండి బెంగాల్ వరకు మహమ్మదీయ సామ్రాజ్యాలు విస్తరించాయి.
ఇక్కడ మహమ్మద్ ప్రవక్త నుగురించి ఒక మాట చెప్పుకోవాలి. వికిపీడియా ప్రకారం
Muhammad (CE 570-632) was a religious, political, and military leader from Mecca who unified Arabia into a single religious-polity under Islam. He is believed by Muslims to be a messenger and prophet of God and is considered to be the last prophet sent by God for mankind.
మహమ్మదు అనంతరం 30-40 సంవత్సరాలలోనే సింధురాష్ట్రం పై అరబ్ దండయాత్రలు జరిగాయి. వేయి సంవత్సరాల ఖలీఫాల పాలనలో, ఉచ్చస్థితిలో, వారి సామ్రాజ్యం అట్లాంటిక్ తీరంలోని స్పెయిన్ నుండి ఉత్తర ఆఫ్రికా, మధ్యధరా ప్రాంతాలు, పశ్చిమ మధ్య ఆసియా, పర్షియా, ఆఫ్ ఘనిస్తాన్, ఉత్తర భారతం, బెంగాల్ దాటి తూర్పు ఆసియా వరకు వ్యాపించింది. ప్రముఖ చరిత్రకారుడు విల్ డ్యూరాంట్ మాటలలో:
The Mohammedan Conquest of India is probably the bloodiest story in history. It is a discouraging tale, for its evident moral is that civilization is a precarious thing, whose delicate complex of order and liberty, culture and peace may at any time be overthrown by barbarians invading from without or multiplying within. (Will and Ariel Durant, History of Civilization, Chapter VI, Vol. 1, The Muslim Conquest of India).
భారతదేశం దిగజారుతున్న ఈ కాలంలో ఇటలీ, తరువాత మిగిలిన ఐరోపాలో పునరుజ్జీవనం (Renaissance, నవజాగృతి యుగం), విజ్ఞానయుగం (Age of Enlightenment) ఐరోపాను శక్తివంతముగా చేసి ప్రపంచాన్ని శాసించగల స్థితికి తీసుకువెళ్ళాయి. ఆ నాటి గ్రీక్ అలెగ్జాండర్ నుండి, మధ్యయుగంలో మహమ్మదీయ దండయాత్రలనుండి, తరువాత ఐరోపా సామ్రాజ్యవాదం నుండి, రష్యా, చైనా కమ్యూనిస్ట్ పాలననుండి, రెండవ ప్రపంచ యుద్ధకాలంనుండి అమెరికా వరకు బలమైన రాజ్యాలన్నిటికీ ఒకటే ఆకాంక్ష ప్రపంచాన్ని తమ అదుపులో ఉంచుకోవడం. సా. శ. 1600 తరువాత ఇటలీలో గలిలియో (Galileo) “సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయనే దృగ్విషయానికి (phenomenon) దాఖలా చూపించేడు. చూపించి చర్చి ఆగ్రహానికి గురి అయ్యాడు. గురుత్వాకర్షణ అనే ఊహనం (concept) ఆ రోజుల్లో లేకపోయినా ఈ ఆకర్షణ లక్షణాలని ఆయన ప్రయోగాత్మకంగా అధ్యయనం చేసి అరిస్టాటిల్ రోజుల నుండీ పాతుకుపోయిన ఒక నమ్మకాన్ని వమ్ము చేసేడు. బరువైన వస్తువులు జోరుగాను, తేలిక వస్తువులు నెమ్మదిగాను పైనుండి కిందికి పడతాయనే అరిస్టాటిల్ నమ్మకానికి ఆ రోజుల్లో తిరుగు ఉండేది కాదు.” (ఆచార్య వేమూరి వెంకటేశ్వరరావు) పోప్ గలీలియోకి (రోమన్ ఇంక్విజిషన్ ద్వారా) గృహ కారాగారవాసం శిక్ష విధించి. ఇంకా అనేక అసౌకర్యాలు కలిగించాడు. 1992లో పోప్ జాన్ పాల్ II కాతోలిక్ చర్చి చేసిన ఆ నాటి తప్పిదానికి క్షమాపణ చెప్పుకున్నాడు. కాని అనేక భారతీయులకు తెలియని విషయం ఒకటి ఉన్నది. అది గోవా ఇంక్విజిషన్ (1560-1812). ఈకాలంలో హిందువులను, ఒత్తిడి వలన క్రైస్తవులు గా మారిన హిందువులను, ముస్లిములనుకూడా న్యాయ విచారణ పేరుతో రోమన్ కాతోలిక్ చర్చి హింసించింది. పోప్ ను క్షమాపణకోరాలన్న విషయంకూడా భారతీయులకు తట్టలేదు. దీనికి కారణం చరిత్ర అవగాహన లేకపోవడమే.


Renaissance - Europe, Bengal and Andhra
పునరుజ్జీవనం - ఐరోపా, బెంగాల్, ఆంధ్ర.
3
విజ్ఞాన యుగాన్నే (Age of enlightenment, Age of reason) అన్నారు. ఇది 17, 18 శతాబ్దాలలో ఐరోపాలో మొదలై, తరువాత ఉత్తర అమెరికాలోకూడా జరిగిన సాంస్కృతిక విప్లవం అనవచ్చును. ఆధునిక విజ్ఞానాన్ని, హేతువాదాన్నీ ఉపయోగించి సంఘంలో పాతుకుపోయిన అంధ విశ్వాసాలని నిర్మూలింఛడం ఈ విప్లవ ఉద్దేశ్యం. ఆసమయంలో వారు తమ దృష్టిని కేంద్రీకరించిన వ్యవస్థ రోమన్ కాథొలిక్ చర్చి, బైబిలును యథా తథంగా విశ్వసించడం, ఈ కాలంలోనే అనేక ఐరోపావాసులు వదలివేశారు. స్పైనోజా, వోల్టైర్, లాక్, ఐసాక్ న్యూటన్ వంటి వారు ఈ తరానికి ప్రతినిథులు. వైజ్ఞానిక పారిశ్రామిక విప్లవాలుకూడా ఈకాలానివే.
వైజ్ఞానిక విప్లవం
మానవ జీవన విధానంలో విప్లవాత్మక మైన మార్పులు తెచ్చినది వైజ్ఞానిక విప్లవం. ఇక్కడ విప్లవమంటే రష్యా విప్లవాల వలే స్వల్పకాలంలో ప్రభుత్వాలు మారడంకాదు. ఇది రెండు, మూడు శతాబ్దాల సమయంలో జరిగినకథ. దీనికి నికరమైన తేదీలుండవు. కాని కోపెర్నికస్, గలిలియోలతో ఆరంభమైనదని చెప్పవచ్చు. ఖగోళశాస్త్రము, గణితం, జీవశాస్త్రం, వైద్య శాస్త్రము,చికిత్సా విధానాలు, భౌతిక శాస్త్రం, రసాయనశాస్త్రము అన్నీ కూడా వేగంగా పరిణామాలు చెందాయి. ఒకవిధమైన శాస్త్రీయ దృక్పథం, హేతువాదం, చర్చి ఆధిపత్యం పై విమర్శలు, విశ్వాసాలస్థానంలో విశ్లేషణ మొదలైనవి సమాజంలో చోటుచేసుకున్నాయి. సమాజం, జనజీవనం, ప్రకృతి, పర్యావరణం మొదలైనవానిపై విజ్ఞాన శాస్త్ర పరిశోధనల ప్రభావం అర్థంచేసుకోవడం ఆలస్యంగా మొదలైనది.
ఈ కాలపు పరిణామాలలో కొన్ని:.
1. అరిస్టాటిల్ పదార్థ విజ్ఞానం ప్రకారం సృష్టి నిప్పు,నీరు, గాలి, నేల అనే మూలవస్తువులతో (4 elements) నిర్మాణం జరిగినదన్న ఊహలకు కాలంచెల్లి, అనేక అణువులు, పరమాణువులు, వాని నిర్మాణ క్రమం ప్రకారం ఒక యాంత్రిక పద్దతిలో జరిగింది అనే మూలసూత్రం ఆధారమైనది.
2. భౌతిక శాస్త్రం, న్యాయశాస్త్రం, లోని సిద్ధాంతాలన్నీ బీజగణితంతో నిర్మాణమైన ప్రతీకల (mathematical models) ఆధారంగా అర్థంచేసుకోవచ్చు అన్నది చాలా ముఖ్యమైన పరిణామం. ఈ గణితశాస్త్ర ప్రతీకలే న్యూటన్ చలన సూత్రాలు.
3. మానవ శరీర శాస్త్రంలో రక్తప్రసరణ వ్యవస్థ మొదలైనవి ఈ కాలంలోనే పూర్తిగా అర్థంచేసుకోగలిగారు.
గ్రీకుల ఆలోచనా విధానం పై వృద్ధిచెందిన ఐరోపా సంస్కృతి మొదటిసారిగా చర్చి విశ్వాసాలనుండి బయటపడి మానవాతీత శక్తుల ప్రసక్తి లేకుండా ఒక హేతుబద్ధమైన,ఆలోచనా విధానాన్ని అభివృద్ధిచేసుకోవచ్చుననే సత్యాన్ని గుర్తించింది.
విశ్వం మనం చూసి అర్థంచేసుకోవడానికి ప్రత్యక్షంగా మన ఎదుటనే ఉంది. కేవలం భాష మూలకంగా చేసిన హేతువాదం దానిని అర్థంచేసుకోవడానికి సరిపోదు. విశ్వరచన జరిగిన భాష మనం నేచుకోవాలి. ఆభాష గణితశాస్త్రమే దానికి కావలసిన తర్కవితర్కాలకు కూడా గణితమే సాధనము. క్లుప్తంగా ఇది ఆధునిక విజ్ఞాన శాస్త్రము, తంత్రవిజ్ఞానాల పునాది రాయి. విమాన మైనా, ఉపగ్రహ కక్ష్య నియంత్రణమైనా గణిత సమీకరణాలపైనే ఆధార పడిఉంటాయి. ఉదాహరణకు (f = ma, e = mc**2)
(అరిస్టాటిల్ చెప్పిన నాలుగు మూలకాలు మన పంచభూతాలలో ఆకాశం మినహా మిగిలిన నాలుగే అనుకోవడం పొరపాటు. మన సృష్టి వాదంలో విశ్వం 4 లేదా 5 మూలకాలతో నిర్మించబడలేదు. సాంఖ్యం చెప్పినది 25 ( పంచ వింశతి )తత్త్వాలు. ఆ స్థాయికి ఆధునిక విజ్ఞానం ఇంకా చేరలేదు).


Renaissance - Europe, Bengal and Andhra
పునరుజ్జీవనం - ఐరోపా, బెంగాల్, ఆంధ్ర.
4
బెంగాల్ జాగృతి
బెంగాల్ జాగృతి అనేది మన సామాజిక వేత్తలు సామాన్యంగా వాడే పదం. ఇది బెంగాల్ లోప్రారంభమైన సాంస్కృతిక, సామాజిక, సాహిత్య విప్లవం అని చెబుతారు. ఇది రాజారామ మోహన రాయి (1775-1833)తో ప్రారంభమై రవీంద్రనాథ్ టాగూర్ మరణం (1941)తో పూర్తి అయిందని చెప్పవచ్చును. దీని రాజకీయ నేపథ్యం గమనించినవారు తక్కువే. అప్పటిబెంగాల్ అవిభాజ్య రాష్ట్రం. సుమారు సగంమంది మహమ్మదీయులు. ఈ జాగృతిలో ముస్లిముల పాత్రలేదు. కాని 1905లో లార్డ్ కర్జన్ తమ "విభజించి పాలించు" సిద్ధాంతంలో భాగంగా బెంగాల్ ను తూర్పుబెంగాల్, పశ్చిమ బెంగాల్ గా విభజించాడు. నిజానికి అది ముస్లిం బెంగాల్, హిందూ బెంగాల్ గా విభజన. ఒకేభాష మాట్లాడేవారిని విభజించారని పెద్ద ఉద్యమం బయలుదేరినది. 1911లో తిరిగి బెంగాల్ ను ఒకే రాష్ట్రం చేశారు. విభాజితమయిన రెండు ప్రాంతాలలో కొందరికి సంతృప్తి, కొందరికి అసంతృప్తి కలిగింది. అది 35 సంవత్సరాలలో దేశవిభజనకు దారి తీసింది. ముస్లిం బెంగాలీల వంగ భాషాభిమానం తిరిగి 1971లో పాకిస్తాన్ విభజనకు కూడా దారితీసిన ముఖ్య కారణాలలో ఒకటి. బెంగాల్ జాగృతిని ఐరోపా లోని అంతకుముందు 400 సంవత్సరాల పునరుజ్జీవనం,విజ్ఞాన, పారిశ్రామిక విప్లవాలతో పోల్చడం వలన దీనికి బెంగాల్ జాగృతి (Bengal Renaissance) అన్న పేరు స్థిరపడినది. కాని ఈ రెండిటిలో చాలా ముఖ్యమైన భేదాలు ఉన్నాయి.
1. ఐరోపాలో కాతోలిక్ చర్చి ప్రాముఖ్యం, అధికారం తగ్గాయి. ఇక్కడ ఈ జాగృతి బెంగాల్ లో క్రైస్తవ చర్చిల, మతప్రచారకుల రంగ ప్రవేశం, మెకాలే విధానంతో ముడిపడిఉన్నది.
2. అక్కడ ఐరోపావాసులు గ్రీక్ రోమన్ నాగరికతలలో తమ మూలాలు వెతుక్కుంటే, ఇక్కడ సనాతన ధర్మంపై ఆధారపడిన విద్యావిధానం, వ్యవస్థ ధ్వంసంచేయ బడ్డాయి.
3. సమాజ దురాచారాలన్నీ - బాల్య వివాహాలు, అంధవిశ్వాసాలు, సతి, కన్యాశుల్కం, వరకట్నం, మొదలైన వన్నిటికీ హిందూమతమే మూలకారణమనే ప్రచారం వెనుక బ్రిటిష్ హస్తం, చర్చి హస్తం కనబడుతాయి.
4. సుమారు 400 సంవత్సరాలుగా బెంగాల్ లో నడిచిన ముస్లిం పాలన, మతమార్పిడులు ప్లాసీయుద్ధంతో పూర్తి అయ్యాయని హిందువులు విశ్వసించారు. నాగరికులైన బ్రిటిష్ వారి పాలన, విద్యా వ్యవస్థలో మార్పుల వలన ఆంగ్లవిద్యను అభ్యసించిన బెంగాలీలు ఐరోపావాసుల ఆధునికతను అనుసరించాలని బెంగాలీ భద్రలోక్ (ఉన్నత వర్గాలు) నిర్ణయించుకోవడమే బెంగాల్ జాగృతి.
5. 1757 లోని ప్లాసీ యుద్దం, 1857లోని సిపాయిల తిరుగుబాటు (ప్రథమ స్వాతంత్ర్య యుద్ధం) మధ్యకాలంలో మహమ్మదీయుల ఆలోచనా విధానాన్ని తారిక్ ఆలీ గారి ఈక్రింది మాటలలో గుర్తింపవచ్చు.
"ముస్లిములు హిందుస్తాన్ కి విజేతలుగా వచ్చారు. వారిదృష్టిలో తమ మహమ్మదీయ మతం ఇక్కడ
విగ్రహాలను పూజించే హిందూ, బౌద్ధమతస్తుల మతాలకంటే ఎంతో ఉన్నతమైనది. 500 సంవత్సరాలు మన స్థానం ఉన్నతమైనది. మనం పాలకులం అన్య మతస్థులు పాలితులు. ఆంగ్లేయుల రాజ్యంలో పరిస్థితి తారుమారయింది. మనం హిందువులూ పాలితులమే ఐనా వారు అధిక సంఖ్యాకులు, మనం కేవలం ఒక అల్పసంఖ్యాక వర్గం. అందుచేత మన తక్షణ కర్తవ్యం జిహాద్ అన్నే ధర్మ యుద్ధం. మనం కాఫిర్లకి, వారి కార్యక్రమాలకు, ఏ పరిస్థితిలోనూ మద్దతు ఈయకూడదు. ఈ ఆలోచన బలపడడమే రెండుదేశాల సిద్ధాంతం (Two Nation Theory). కొద్దిమంది ముస్లిం నాయకులు మాత్రం స్వయంనిర్ణయంతో చేసుకున్న ఈ మానసిక విభజనను ఖండించారు." భారత చరిత్ర అంటే ఢిల్లీ చరిత్ర అనేభావాన్ని మన చరిత్ర పుస్తకాలు కల్పింఛాయి. దేశాన్ని విభజించడంలో ప్రముఖ పాత్ర వహించిన 1500-1947 లో బెంగాల్ చరిత్రను మనం పరిశీలించాలి.


No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...