ఇం
గ్లీషులో సైన్స్, సంస్కృతములో శాస్త్రము అన్నపదాలు సమానార్థకాలు కావు. హొమియోపతీ, అస్ట్రోలజీ వంటివి శాస్త్రాలా సైన్సులా? అర్థ శాస్త్రము (ఎకనామిక్స్) రాజకీయ శాస్త్రము (పొలిటికల్ సైన్స్) మానేజ్ మెంట్ సైన్స్, సోషల్ సైన్సెస్, సైకాలజీ (మనస్తత్వ శాస్త్రము ) మళ్ళీ మాట్లాడితే గణిత శాస్త్రమును సైన్స్ అనవచ్చునా? హిస్టరీ ఆఫ్ సైన్స్ కూడా సైన్స్ అనిపించుకుంటుందా? లేకపోతే INSA, Indian National Science Academy హిస్టరీ ఆఫ్ సైన్స్ అనే జర్నల్ ఎందుకు ప్రచురిస్తుంది? ఇంజనీరింగ్ కూడా సైన్సేనా? సైన్స్ అన్నపదము సైంటియా అనే లాటిన్ మూలము నుండి వచ్చినది. అర్థము జ్ఞానము, జ్ఞాన సముపార్జన,.
శాస్త్రము అనే పదము శాసతి ఇతి త్రాయతి - అంటే శాసిస్తుంది, రక్షిస్తుంది. ధర్మ శాస్త్రము, నీతిశాస్త్రము, మొదలైనవికూడా శాస్త్రములు. దర్శనములు, వేదాంగములు శాస్త్రములు. వ్యకరణము శాస్త్రము. లాజిక్, న్యాయ శాస్త్రము ఒక శాస్త్రము. దేవుణ్ణీ, జాతకాలని, న్యూమరాలజీని, శకునములను శాస్త్రాలు అంటే అదివ్యక్తిగత నిర్ణయం.మనిషికి తనవైన విశ్వాసాలు ఉంటాయి. మూఢ నమ్మకాలు అనేమాట అర్థరహితం. జ్ఞానము సత్యమవాలని సూత్రమేమీ కూడా లేదు.తనకు తెలిసిన విషయాన్ని ప్రతిమనిషి సత్యమా సత్యదూరమా అని పరిక్షించుకోవాలి.
No comments:
Post a Comment