Thursday, January 25, 2018

On Cosmologies – 3

https://www.facebook.com/vallury.sarma/posts/576281679075916

సృష్టిలో మొదట అవ్యక్తముగా ఉన్న బ్రహ్మము లేదా సదాశివ తత్త్వము ఒక్కటే. అదిరెండుగా మారడమో, కనుపించడమో అయింది. ఇది పురుషుడు, ప్రకృతి అనిరెండు తత్త్వాలు. పురుషుడు లేదా పురుషులా? మొదటిదైతే అది పరమపురుషుడు. - పరమేశ్వర, పరమేశ్వరి (కామేశ్వర, కామేశ్వరి) తత్త్వాలు. ప్రకృతినే మాయ, శక్తి అని కూడా అంటారు. ఇప్పుడు స్థితి వ్యక్తావ్యక్తముగా ఉన్నది. ఆకారములేదు. కేవలము లింగము (గుర్తు, sign) గా గుర్తించదగినది. వ్యక్తావ్యక్త స్థితి. (అనేక పురుషులు అంటే అది సాంఖ్యమనే నిరీశ్వర వాదమౌతుంది). మనకు కనుపించే సృష్టిని అర్థంచేసుకోవడానికి నామ రూపాలుగల సృష్టికర్త అవసరమౌతాడు. పరబ్రహ్మ,అర్థనారీశ్వర తత్త్వాలను పూర్తిగా ప్రతిబింబించే వ్యక్తీకరణ ఇప్పుడు రూపు దిద్దుకుంది. అదే పాలకడలిలో శేషతల్పమున పవళించిన మహావిష్ణు తత్త్వము. ఆయనే వ్యక్తమైన సృష్టికర్త. పంచబ్రహ్మ సిద్ధాంతంలో మూడవ బ్రహ్మ.
ఇక్కడ పరిణామ వివర్త వాదాలను గురించి చెప్పుకోవాలి. పరిణామమంటే మార్పు. విత్తనానికి, వృక్షానికి కార్య కారణ సంబంధం ఉన్నది. "ఎవ్వని చే జనించు జగము? (జగము) ఎవ్వనిలోపల నుండు? ఎవ్వనియందు డిందు? పరమేశ్వరుడెవ్వడు? మూలకారణంబెవ్వడు? అనాది మధ్యలయుడెవ్వడు? అన్న భావాలకు వ్యక్తీకరణ యే ఈ మహావిష్ణువు. కార్య కారణ సంబంధం అంటే అనేక రకాల కారణాలు ఉంటాయి. కుమ్మరి సారెపై ఒక కుండ చేశాడనుకోండి. కుండ కార్యం. మట్టి ఒక కారణం. ఉపాదాన కారణము. Material cause, సారె ఒక కారణం. కుమ్మరి ఒక కారణం. నిమిత్త కారణాలు. Instrumental causes. సృష్టికి మహావిష్ణువు లేడా ఈశ్వరుడు నిమిత్త కారణమా, ఉపాదాన కారణమా? అన్నది ప్రశ్న. భక్తి మార్గంలో ఈ వేదాంత చర్చలు అనవసరం.
బ్రహ్మము మహా విష్ణువుగా మారినది. అంటే పరిణామ వాదం. మహావిష్ణువుగా సగుణ రూపంలో కనపడింది. ఇది వివర్తవాదం. ఈ మహావిష్ణువు సృష్టి కర్త. ఈయన యే విశ్వంగా పరిణామంచెందాడు. లేదా విశ్వంగా కనుపించాడు. విష్ణు సహస్రంలో మొదటినామం విశ్వమే. మనం ప్రస్తుతం శ్వేత వరాహ కల్పంలో, వైవస్వత మన్వంతరంలో ఉన్నాము. BIG BANG నుండి 3 బ్రహ్మకల్పాలు అయ్యాయంటే లెక్క సరిపోతుంది. ఇప్పుడు మనను సృష్టించిన బ్రహ్మగారు ఈ ప్రతిసృష్టి చేసినవాడు. దీనినే పురాణాలలో ప్రతిసర్గ అంటారు. విష్ణువు ప్రళయం తరువాత సృష్టి సంకల్పంచేస్తే ఆయనా నాభినుండి బ్రహ్మ పుడతాడు. ఎందుకు. ఈ తత్త్వాలన్నీ ప్రళయ సమయంలో ఆయనలో లీనమయ్యాయి కాబట్టి. బ్రహ్మ ఆవిర్భావానికి ముందే బంగారు వన్నెగల ఒక పెద్ద అండం సృష్టికి మొదలుగా సముద్రంనుండి ఆవిర్భవించినది. అదే బ్రహాండం. అందుకే విష్ణువుకు హిరణ్యగర్భుడు అనే పేరు వచ్చింది.
To be continued

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...