Tuesday, January 23, 2018

వ్రతం - పూజ

https://www.facebook.com/vallury.sarma/posts/564705683566849

ఈ పదాల అర్థంతెలిస్తే వీటిలో చాందసభావాలు ఏమీలేవని తెలుస్తుంది.
వ్రతమంటే మనం మనపై విధించుకున్న ఒక నియమం. సత్య వ్రతం. మౌన వ్రతం, ఉపవాస వ్రతం. మన మనస్సుపై ఒకరోజైనా నియంత్రణ సాధించడంకొరకు కొంచెంనియమబద్ధంగా ఆరోజైనా ఉంటామని నిర్ణయంచుకోవడం. ఇందులో ఇతరుల మెప్పుకై చేసేదిఏమీలేదు. వరలక్ష్మీవ్రతం ఐనా అట్టిదే. మహాలక్ష్మి ఆరాధనకు శ్రావణమాసం నిర్ణయింపబడినది. వరలక్ష్మి వ్రత దినం నాడు అర్చిస్తే ఆమె వరములిచ్చే దేవతగా అనుగ్రహిస్తుందని భావం. సంప్రదాయమంటే పరంపరగావచ్చే ఆచారం. సంస్కృతిలో అంతర్భాగం. చాదస్తం అనేమాట ఛాందసము నుండి వచ్చినది. చాందసము చందస్సు నుండి వచ్చినది. వాడుకలో శాస్త్ర పరిజ్ఞానమేకాని, లౌకిక జ్ఞానం లేనివారిని ఛాందసులు గా వ్యవహరించడం అలవాటయినది. దానినుండి వచ్చిన నిందాత్మక పదమే చాదస్తం. ఒకరి పద్ధతి మరి ఒకరికి చాదస్తంగా కనబడవచ్చును. అత్తగారి పద్ధతి కోడలుకు చాదస్తం. తరాల అంతరం అంతే. ఇక పూజ కోరికతో చేసేదే. క్షేమము, స్థైర్యము, విజయము, అభయము, ఆరోగ్యము, ఐశ్వర్యము ఇవి భగవంతుని, అమ్మవారిని పూజించి కోరుకొంటాం. షోడశోపచార పూజైనా, పంచోపచార పూజైన సంప్రదాయమే. ఇది ధార్మిక జీవనం.మోక్షము అనేది ఒకవ్యక్తిగల తీవ్రమైన ఇచ్ఛ. దీనికి కావలసినది, యోగసాధన, తపస్సు. బాహ్య పూజలు కేవలం మనస్సును సిద్ధపరచడానికి మాత్రమే.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...