https://www.facebook.com/vallury.sarma/posts/546500112054073
God does not exist. Who told you about this? What is there, some say God exists and some say God does not exist. One of them must be true. In the absence of any proof, both the propositions must be equally likely. Not really so. I am sure that those who say God exists are aware of Truth and they are certainly wiser than those who say God does not exist. In fact, the one who says God does not exist is ignorant. He is in darkness. He cannot perceive God and he presumes that God does not exist. Our ancients in Santana Dharma never got the doubt. Existence of God is not a matter of belief. A person should just be rational enough to realize the Existence of God. But before we say that the proposition ” God exists “ is TRUE, we should answer the question “Who is God?” Or rather … “What is God?” “Is God a He, She or IT?” This is what the ancient Indian darsanas (schools of philosophy) discuss. Nyaya (or logic) dealing with epistemology and Vaiseshika dealing with Ontology are the Two Indian schools which deal with this problem
గౌతముడు "ఆప్తోపదేశః శబ్దః" ఆప్తుని ఉపదేశము ప్రమాణమైన శబ్దము అని చెప్పాడు. ఇంతకుముందు కళ్ళకు కనపడినది ప్రత్యక్ష ప్రమాణమని చెప్పుకున్నాము. చెవులకు వినపడినదికూడా అటువంటిదేనా? వేద వాక్యము, ఆప్త వాక్యము, ఏవ్యక్తియైనా పలికిన వాక్యము - అన్నీ శబ్దాలే ఐనా వాటి ప్రమాణికత వేరుగా ఉంటుంది. శబ్దము, దృశ్యముకంటె ఎక్కువ సంశయాత్మకము. వినిన మాటను అర్థంచేసుకోవడం మీద మనకు లభించిన జ్ఞానము ఆధార పడుతుంది. అంతర్గతంగా అనుమానము ఉంటుంది. You have to infer the meaning after listening attentively to a sentence. శబ్దము విషయములో అనిత్యత, పరిణామము, శక్తి అనే అంశాలను గౌతముడు స్పృశిస్తాడు.
1. గౌతముని ప్రకారం - ప్రాగుచ్చారణాదనుపలబ్ధే - ఉచ్చరించకముందు శబ్ద మెక్కడిది? అందుచేత వాక్కు క్షణికం, అనిత్యం, ఆద్యంతాలు కలది. శబ్దము ఘటపటాదులవలే ప్రయత్నంతో వచ్చినది.
2. శబ్దము వర్ణము, అక్షరము, పదము, వాక్యము,.. ఈవిధంగా క్రమ పరిణామంచెందుతుంది. అశ్వత్థామ హతః అంటే ఒక అర్థము కొంచెం ఆగి మెల్లగా కుంజరః అంటే అర్థంవేరు. అంటే చెప్పినవాని ఉద్దేశ్యములో సత్యవాక్యము. వినినవారు అర్థంచేసుకోవడం రెండుపదాలతోనే పూర్తి అయింది. ఇది శబ్దము, అర్థము పరిణామం చెందే విధానము. ధర్మజుని ఆవాక్యం నరక దర్శనం చేయించింది.
3. శబ్దానికి శక్తి ఉంటుంది. శివుని ధ్యానించినప్పుడు "నమః శివాయ" అంటాము.ఇది పంచాక్షరీ మంత్రము. యజుర్వేదములోనిది. ప్రతి అక్షరమూ శివ స్వరూపమే. తస్మై న కారాయ నమః శివాయ.... శివునికి తెలుగు రాదా? శివునికై నమస్కారము. ఇది తెలుగు వాక్యము. శ్రుతికాదు.మంత్రము కాదు. శబ్ద శక్తి తక్కువ. కాని భగవంతుని స్మరించిన ఫలితం ఉంటుంది కదా. భగవాన్ రమణ మహర్షి అతికొద్దిమందికి మంత్రమిచ్చారు. ఒక కట్టెలు కొట్టువానిని చూచి "శివ, శివ" అనుకోచాలు అన్నారు. అది అతడికి ఉపదేశమే. మంత్రమే.

మనం ఇంతవరకు న్యాయము, వైశేషికము గురించి మాట్లాడుకున్నాము. మనదేశంలో ఇవి సత్యన్వేషణలో మార్గాలైన దర్శన సాహిత్యం లోనికి వస్తాయి. సామాన్యంగా షట్దర్శనాలు అని ఆరింటిని చెబుతాము. అవి న్యాయము, వైశేషికము, సాంఖ్యము, యోగము, (పూర్వ) మీమాంస, వేదాంతము (ఉత్తర మీమాంస).. వీటిని ఆస్తిక దర్శనాలు అంటారు. ఆస్తికులు అంటే దేవుడున్నాడనేవారు కాదు. ఆస్తిక శబ్దానికి అర్థం వేదాన్నిశబ్ద ప్రమాణంగా తీసుకునేవారన్న మాట. సాంఖ్యము, యోగము, వేదాంతము భగవద్గీతలో కూడా భగవంతునిచే వివరింపబడ్డాయి. ఈ ఆరు సూత్రగ్రంధాల కర్తలు వరుసగా గౌతముడు, కణాదుడు, కపిలుడు, పతంజలి, జైమిని, వ్యాసుడు. ఇవి కాక అనేక నాస్తిక దర్శనాలు, ఇతర దర్శనములు కూడ ఉన్నాయి. అవి చార్వాక, బౌద్ధ, అర్హత (జైన), శైవ, వైష్ణవ, పాణినీయ (వ్యాకరణ), రసేశ్వర, అద్వైత దర్శనాలు. సాయణ మాధవాచార్యులు తమ సర్వదర్శన సంగ్రహంలో పదహారు ప్రత్యేకదర్శనాలను గుర్తిస్తారు.
మనం స్వల్పంగా చవిచూచేది వ్యాకరణం. నా చిన్నప్పుడు తెలుగు, ఆంగ్ల వ్యాకరణాలు నాకు చాలా ఇష్టంగా ఉండేవి. కాని నామిత్రులకు ఇవి పడేవికావు. మా తెలుగు వ్యాకరణ పుస్తకముపేరు "ఆన్ధ్ర వ్యాకరణము". ఆంధ్ర వ్యాకరణం అని ఎందుకు వ్రాయలేదని మా అనుమానం. మొదటి సూత్రము వద్దకు వచ్చే సరికి మామిత్రులకు నీరసం వచ్చేది. అది "త్రిలిఙ్గ దేశ వ్యవహార సిద్ధంబైన భాష తెలుఁగు నాబడు." తెలుగు వ్యాకరణము అని ఎందుకు వ్రాయకూడదు? అనేది అర్థం అవడానికి కొంత సమయం పట్టింది. తెలుగు వ్యాకరణం అనే పదం పాలాభిషేకం వంటిదే. అర్థానుస్వారం (అరసున్న) ఒక క్రొత్త విషయం.

No comments:
Post a Comment