ఆస్ట్రేలియన్ టీవీ విదేశ వార్తలలో మన దేశంలో బీహారులో మధ్యాహ్న భోజనాలలో పురుగులమందు కలవడం వలన చాలామంది బడి పిల్లలు మరణించిన వార్త ప్రసారం చేసారట. మన నాయకుల స్పందన విని మన తెలుగు వీక్షకులు ఒకరికి ఈ విషయం గురించి వారి సహోద్యోగులు ప్రశ్నిస్తే మన దేశపరిస్థితులను గురించి విదేశీయులకు ఎలా వివరించాలో తెలియటంలేదు అన్నారు.
నా వ్యాఖ్య
మన దేశంలో ఇప్పుడు అధర్మం, అవినీతి వీర విహారం చేస్తున్నాయి. ప్రభుత్వం పెట్టిన మధ్యాహ్న భోజనం తిని ఇంకా 99.9% పిల్లలు బ్రతికి ఉన్నారనేది, మనం ఎక్కువ తృప్తి పడవలసిన విషయం. మనదేశంలో నేర ప్రవృత్తి, అధర్మాచరణ ఇలా పెరగడానికి ముఖ్యమైన కారణం సమాజములో ఉన్నతవర్గం అవినీతి , అధర్మ వర్తన. నేరానికి శిక్షలేదు. న్యాయ స్థానాలు ఒక వ్యాజ్యం పరిష్కరించడానికి దశాబ్దాలు పడుతుంది. ఒక అవినీతి పరుడైన ముఖ్యమంత్రి మాటలను ప్రతిఘటించని ఇతర మంత్రులు, ఉన్నతోద్యోగులు, శిక్షకు ఎదురుచూస్తూ జైలులో ఉండడం చూస్తున్నాము. కాని వారి నేరాలు నిరూపించబడవు. తీర్పులు వెలువడవు. అంటే మనదేశంలో ప్రభుత్వములేదు. ప్రభుత్వంలో ఉన్నవారి వృత్తి ప్రజా ధనాన్ని స్వాహా చేయడమే. ఇంకా బ్రతుకున్నామంటే 90% ప్రజల మంచితనమే. మన దేశంకాదు వెనకబడినది. మన ప్రభుత్వాలు పనికిమాలినవి. వారిని ఎన్నుకోవడానికి కారణం మన అక్కరకు రాని పనికిమాలిన రాజ్యాంగం. Our government at centre and states are not fit to rule ఇదే మీ సహోద్యోగులకు చెప్పండి.
జాజి శర్మ మన దేశంకాదు వెనకబడినది. మన ప్రభుత్వాలు పనికిమాలినవి. This is perfecti description which our NRI friends should give to their friends in Australia.
No comments:
Post a Comment