Thursday, January 25, 2018

On Cosmologies 5

https://www.facebook.com/vallury.sarma/posts/577586808945403
On Cosmologies – 5
మన పురాణాలు చెప్పే సృష్టి వర్ణనకు, ఆధునిక విశ్వదర్శనం అనే ఖగోళ భౌతిక శాస్త్రానికి ఒక ముఖ్యమైన తేడా గమనించాలి. భౌతిక శాస్త్రంలో ముఖ్యమనది టెలిస్కోపుల వంటి పరికరాలతో దర్శించిన విశ్వ చిత్రం. నక్షత్రాలు, నక్షత్రమండలాలు, మన భూమి, సమీప అంతరిక్షం, మన సూర్యమండలం. చంద్రశిలలలో, ఏఏ మూలకాలు ఉన్నాయి? ఏ గ్రహాల స్థితి భౌతికం గా ఘన, ద్రవ, వాయు, ప్లాస్మా స్థితులలో ఉంటుంది? ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి? కార్బన్ డై ఆక్సైద్, నత్రజని, ప్రాణవాయువు, మీథేన్, ఇలాంటివి పర్యావరణంలో ఏ శాతం ఉన్నాయి? వీటిచుట్టు మనకు భూమిపై తెలిసిన వాతావరణం, జీవరాశి ఉండే అవకాశం ఉంటుందా? మన పురాణాలు వర్ణించిన ఋషుల అన్వేషణ ఈ సమాచారం సేకరించడానికి కాదు. అక్కడ ప్రశ్న నేను ఎక్కడనుండి వచ్చాను? ఈ విశ్వంలో నాస్థానమేమిటి? నా గమ్య మేమిటి? ఈ విశ్వంలో ఒక తాత్కాలికమైన అణుమాత్రంగా ఉండే నేను ఎందుకు, ఎలా జీవించాలి? ఈ మానవ జన్మకు అర్థం, పరమార్థం ఉన్నాయా? ఈ ప్రశ్నల సమాధానానికై అన్వేషణ.
అందుచేత మన ముఖ్యమైన ప్రశ్న భూలోకంలో ఉండే 84 కోట్లు అనిచెప్పబడే జీవరాశుల స్థితి, గతులను గురించి? ఆయా రకాల, మానవ, జంతు, పక్షి, చేప, కీటకం వంటి దేహాలు ధరించిన ఈ జీవులన్నీ ఎక్కడ ఉంటాయి? మనం 14 లోకాలు అని వర్ణించుకునే లోకాలు ఎక్కడ ఉన్నాయి? జీవులు ఒకలోకం నుండి మరొకలోకానికి వెళ్ళే అవకాశం ఉన్నదా? ఏ లోకాలలో ఎలాంటి జీవులు ఉంటారు?
ఋషులు, దేవతలు, యక్షులు, గంధర్వులు, రాక్షసులు, దానవులు, నాగములు ఎక్కడ ఉంటాయి? ఒక పర్వతానికి, ఒక వృక్షానికి కూడా ఆత్మ ఉంటుందా? కాళిదాసు కుమార సంభవం ఆరంభ శ్లోకం "అస్త్యుత్తరస్య దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధి రాజా" ఉత్తర దీశలో దేవతాత్మ అయిన హిమాలయమనే నగాధిరాజము ఉన్నదట. కృష్ణావతారములో ఇద్దరు గంధర్వులు భూమిపై మద్దిచెట్ల రూపంలో బంధిపబడి ఉన్నారటా.అంటే దాని అర్థం దేవతాత్మలు ఆచెట్ల శరీరాలను ధరించి ఉన్నట్లే కదా? త్రేతాయుగంలో అహల్యా శాపవిమోచనంలో కూడా, ఆశిలలో తపస్విని అయిన అహల్య ఆత్మ ఉన్నట్లే కదా. శ్రీ రాముని పాద స్పర్శ, కృష్ణుని బాల్యక్రీడ వారిని అచేతన దేహాలానుండి విముక్తులను చేశాయి.
అసలు సృష్టిలో జీవకోటి ఎంత? జీవులను ఎవరు సృష్టించాడు. జీవులన్నీ శరీరధారులై ఉన్నాయా? శరీరములేని జీవులు ఎక్కడ ఉంటాయి? ఆలోచించండి. మాగురువు గారు ఒక వాక్యం వ్రాశారు అది "It is to be remembered that Jivas are not created by God, who merely created the worlds for the living and evolution of the Jivas. ఇది మనము సామాన్యంగా గమనించని సత్యం




https://www.facebook.com/vallury.sarma/posts/576773605693390

1. Mvs Sivaprasad అంటే ఇప్పటి సృష్టి మొదలై 4.3 బిలియన్ సంవత్సరాలయినది IT IS WRONG MANADI 28VA MAHAYUGAMULO KALIYUGAMU DAADAPU 198 KOTLA SAMVATSARAALU DAATINADI
2. Mvs Sivaprasad న్యూటన్ తరువాత వచ్చిన భౌతిక శాస్త్ర పదార్థ విజ్ఞానం Physical Sciences WRONG BHARATA DESAM LO ANAADIGA BHOUTIKA SASTRAM UNNADI
3. ముక్కు మూసుకుని అడవిలో కూర్చుని ధ్యానిస్తే బ్రహ్మాండంగురించి ఎలా తెలిసినది ILANTIVI DAYACHESI RAAYAKANDI VETIVALLA MANALANU MANAME TAKKUVA CHESUKUNNA VAALLAMU AVUTAAMU
V V S Sarma
Third question first
1. Mvs Prasad - మీరు నేను వ్రాసినది సరిగా అర్థంచేసుకోలేదు. ఎలా తెలిసింది? అన్నది Rhetorical Question ముక్కుమూసుకొని అంటే ప్రాణాయామంచేసి ధ్యాన నిమగ్నుడైతే అని అర్థం. అది తపోమార్గానికి సూచన. ధ్యానంలో తపస్సులో విశ్వరహస్యాలు తెలుస్తాయనే నా ఉద్దేశ్యం. మీరు నేను వ్రాసిన నాలుగు భాగాలు చదవండి.
First Question now
2. మీరు మహాయుగాలు 28 గడిచాయన్నారు. మహాయుగాలు ఎన్ని గడిచాయి? అనికాదు. ఎన్ని బ్రహ్మకల్పములు గడిచాయని అడగాలి. శ్వేతవరాహ కల్పములోనే ఆరు మన్వంతరాలు పూర్తియై ఏడవది ఐన వైవస్వత మన్వంతరము నడుస్తున్నది. నేను బిలియనులలో చెప్పడానికి కారణం బిగ్ బాంగ్ కాల నిర్ణయం ఆ లెక్కలలో జరిగినది కాబట్టి. కాలమాన ప్రమాణాలు పోల్చదగినవిగా ఉన్నాయని చూపించడం నా ముఖ్య ఉద్దేశ్యం. .
Second question
3. మనకు శాస్త్రాలు లేవని ఎవరన్నారు? మన శాస్త్ర విజ్ఞానం మనకు లభించిన తీరువేరు. ఆధునిక సైన్స్ విజ్ఞానం బాటవేరు. సైన్సు, శాస్త్రము అనేవి సమానార్థకాలు కావు. మీరు వాడుతున్న Lap-Top చిత్రగుప్తుడు వాడేవాడనడం హాస్యాస్పదం.


Cheruku Ramamohanrao విమర్శించే పాఠక జనులకు విజ్ఞప్తి.
సుమతి శతకములో ఒక పద్యమున్నది :
వినదగు నెవ్వరు చెప్పిన

వినిననంతనే వేగుపడక వివరింపదగున్
కనికల్ల నిజాము తెలిసిన
మనుజుడెపో నీతి పరుడు మహిలో సుమతీ
శర్మ గారు వ్రాసిన " ముక్కుమూసుకొని అంటే ప్రాణాయామంచేసి ధ్యాన నిమగ్నుడైతే అని అర్థం. అది తపోమార్గానికి సూచన. ధ్యానంలో తపస్సులో విశ్వరహస్యాలు తెలుస్తాయనే నా ఉద్దేశ్యం." ఆ మాటలోని అర్థమేమిటంటే భగవంతుడు మనకు ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతాడు అని వ్రాసి పంపుటలేదు కానీ ఇన్నిప్రాణములు అని వ్రాస్తాడన్నది ,అవి వేలు కావచ్చు లక్షలు కావచ్చు, కోట్లు కావచ్చు" శాస్త్ర వాక్యము. ఒక ప్రాణము అంటే ఒకసారి ఊపిరి పీల్చి వదలిన కాలము . ఇది ఒక ఆరోగ్యవంతునికి ఇంచుమించు 4 సెకనులు పడుతుంది. ఈ ఊపిరిని బంధించితే ఆ వ్యక్తీ యొక్క ఆయుర్దాయము పెరుగుతుంది. ఎంత అంటే అది వారి వారి శక్తి .

తరువాత కృత యుగపు వ్యక్తీ ఆయుర్ధాయమునకు మిగిలిన మూడు యుగాములలోని మానవ ఆయుర్ధాయమునకు చాలా తేడా వుంటుంది . పూర్వ కాలములోని ఋషులు విశ్వ శ్రేయస్సుకే పాటు పడినారుకానీ,పాశ్చాత్యులవలె పేరు కొరకు కాదు.

శర్మగారు వారి వయసుకు ఇంట కష్టపడి ఇన్ని మంచి విషయములు తెలుప తాపత్రయ పడుట తప్పకుండా లైకులు కామెంట్ల కోసం మాత్రం కాదు . కేవలము మన పూర్వీకుల గొప్ప తనాన్ని తనకు తెలిసినంత భావి తరానికి తెలుపడానికే.
విమర్శ అంటే ఎదుటి వారికి బాధ కలిగించుట కాదు. ఒకమాట ఎట్లుండాలంటే
సుమతి శతకకారుని మాటే కొలబద్ద :
ఎప్పటికెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి అన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ
అని అన్నాడు.
మనకు తెలియనివి తప్పులుకావు అన్న తెనాలి రామకృష్ణు ని మాటతో ముగించుతూ నన్ను తప్పుగా తలవ వద్దని తెలుపుకొను చున్నాను .

దయవుంచి శర్మ గారిచేత ఇంకా ఇంకా తెలుసుకొండి. వారి శ్రమకు జేజేలు పలకండి.

Jithender Prasad గురు గారు ఎనిమదవ బ్రహ్మ ఎవరు వారి గురించి చెప్పగలరా బ్రహ్మ ఆయుర్దాయం అయిపోయిన తర్వాత అతను ఎలాంటి విధులు నిర్వర్తిస్తాడు ? చెప్పగలరు

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...