https://www.facebook.com/vallury.sarma/posts/581987461838671
Milky Way, Triangulum, Andromeda and Brahmanda
విశ్వ పరిమాణాలు
మనం సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు,గెలాక్సీలు, అంతరిక్షం, విశ్వం గురించి మాట్లాడు కుంటున్నాము.రాత్రివేళ మినుకు, మినుకు మనే ఈ తారలు మనకు ఎంతదూరాలలో ఉన్నాయి? భూమిమీద దూరాలు మనం కిలోమీటర్లలో కొలుస్తాం. అంతరిక్షంలో మనకు అత్యంత ముఖ్యమైన నక్షత్రం సూర్యుడు. ఇది మనకు అత్యంత సమీపంలో ఉన్న నక్షత్రం కూడా. సూర్యకాంతి భూమికి చేరడానికి 8 నిమిషాలు పడుతుంది. ఈ దూరాన్ని 8 కాంతి-నిమిషాలు అనవచ్చును. కాంతివేగం సెకండుకి 3 లక్షల కిలోమీటర్లు. భూమినుండి సూర్యుని దూరాన్ని ఒక ఖగోళ మానకం (Astronomical unit, AU) అంటారు. అంటే సుమారు 15 కోట్ల కిలోమీటర్లు. ఇతర నక్షత్రాలు మనకు కాంతి సంవత్సరాల దూరంలో ఉంటాయి. కాంతి సంవత్సరం అంటే సుమారు 946 కోట్ల కిలోమీటర్లు. గెలాక్సీల పరిమాణాములు కొలవడానికి ఇది కూడా చాలదు. పార్ సెక్ అనే మానకాన్ని వాడుతారు. ఇది 30.85 ట్రిలియనులు అంటే 3085 కోట్ల కిలోమీటర్ల దూరానికి సమానం. భూమినుండి మిల్కీ వే గలాక్సీ కేంద్రబిందువుకు దూరం సుమారు 8500 పార్ సెక్. దీనినే 8.5 kpc దూరం అంటారు. ఇది సుమారు 27000 కాంతి సంవత్సరాలు.
మనకు తెలిసిన ఇంకో గెలాక్సీ, ఆండ్రొమెడా, 4,50,000 పార్ సెక్ (450kpc) ల దూరములో ఉన్నదని అనుమానం (అంచనా). 850kpc దూరంలో ఉన్న మరో గెలాక్సీ ట్రయాంగులం.
మనకు తెలిసిన ఇంకో గెలాక్సీ, ఆండ్రొమెడా, 4,50,000 పార్ సెక్ (450kpc) ల దూరములో ఉన్నదని అనుమానం (అంచనా). 850kpc దూరంలో ఉన్న మరో గెలాక్సీ ట్రయాంగులం.
ఎన్నో బిలియనుల డాలర్ల ఖర్చుతో, అనేక మంది ఖగోళ, కణ భౌతిక శాస్త్రజ్ఞుల కృషితో, అంతరిక్ష ప్రయోగాలతో, ఈ అపూర్వమైన సృష్టి విజ్ఞానం మానవ జాతికి తెలుస్తున్నది. మానవమేధస్సుకు అపరిమితమైన శక్తి ఉన్నదని కూడా తెలుస్తున్నది. ఇది ఒకకోణమైతే, ఈ పరిశోధనల ప్రభావం మానవ జీవితం పై ఏమైనా ఉంటుందా? అన్నది ప్రశ్న. మనకు ఈ నక్షత్రాల, నక్షత్ర మండలాల, నక్షత్ర మేఘాల దూరాలు, పరిభ్రమణ వేగాలు, టెలిస్కోపుల వివరాలు తెలియడం మన విజ్ఞానాన్ని పెంచుతుంది. కాని జీవన విధానాన్ని మారుస్తుందా? జీవిత పరమార్ధాన్ని తెలుపుతుందా?
అదే బ్రహ్మాండాన్ని గురించిన విజ్ఞానాన్ని చూద్దాం. అపారమైన అంతరిక్షంలో ఒక పరిమిత ప్రపంచం. మన నివాస స్థానం అందులో అణుమాత్రమే. కాని కొన్ని నక్షత్రాలు మన జీవితంపై ప్రభావం చూపిస్తాయని తెలిపేది జ్యోతిషం. ఒక హిందువు జీవనయానం కేవలం భూలోకానికే కాక అంతరిక్షానికి, ఊర్ధ్వలోకాలతో ముడిపడిఉన్నది. ఈ విజ్ఞానం వైదిక సాహిత్యం ద్వారాలభిస్తుంది.
No comments:
Post a Comment