https://www.facebook.com/vallury.sarma/posts/536785773025507
పంచతంత్రం లో విష్ణుశర్మ రాజపుత్రులకు చెప్పేది వారికి అవసరమైన విద్య. కౌటిల్యుడు అర్థ శాస్త్రంలో రాజులకు అవసరమైన విద్యలు నాలుగు అని చెప్పాడు. అవి త్రయీ, వార్తా, దండనీతి, అన్వీక్షకీ అనేవి. త్రయి అంటే వేదాలు, ఇవి ధర్మ పాలనకు అవసరం. వార్త అంటే తన చుట్టూ జరుగుతున్నవి, అంటే ఈ సమాచారం సేకరించే యంత్రాంగం ఉండాలి.(intelligence gathering). దండనీతి అంటే శత్రువులను, నేరస్థులను శిక్షించ గల బలం. అన్వీక్షకి అంటే logic. సమాచారంనుండి కర్తవ్యం దాకా మార్గదర్శనం చేసే శాస్త్రం. దీని వలన మనకు లభించేవి తంత్ర, యుక్తులు. తంత్రం అంటే strategy, యుక్తి అంటే tactic. ఒకటి దూరాలోచన, ఒకటి తక్షణ కర్తవ్యం. అందుకు పంచతంత్రంలో కథలరూపంలో ఐదు ముఖ్యమైన తంత్రాలను గురించి చెబుతాడు. మొదటిది మిత్రభేదం - ఎప్పుడూ మిత్రుల కన్నా శత్రువుల విషయం ముఖ్యం. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారిని గమనిస్తూ ఉండాలి. వారి స్నేహ సంబంధాలు భగ్నం చేయాలి. ఇది priority item. ఇది offence.రెండవది మిత్ర లాభం, లేదా మిత్ర సంప్రాప్తి,ఇది defence .. శత్రువును ఎదుర్కోడానికి మిత్రకూటమిని ఎప్పటికప్పుడు బలోపేతం చేసుకోవాలి. మూడవది కాకోలూకీయం. కాకులు, గుడ్లగూబలు (ఉలూకం) అని మనుష్యులు రెండు రకాలు. మనుష్యుల తత్త్వాలను అర్థంచేసుకునే ప్రయత్నం. నాలుగవది లబ్ధ ప్రణాశం. అంటే ఉన్నది నాశనం కాకుండా చూసుకోవడం, అంటే క్షేమం ఉండాలి. ఐదవది అసమీక్ష (అపరీక్ష) కారికం. పరిస్థితిని సమాచారాన్ని సమీక్షించకుండా నిర్ణయాలు, చర్యలు తీసుకోవడం. ఇవి ప్రమాదాలను తెచ్చిపెడతాయి ఇవి ఐదు తంత్రాలుగా కథలతో చెప్పాడు.
No comments:
Post a Comment