Thursday, January 25, 2018

ప్రత్యేక తెలంగాణా - సమైక్యాంధ్ర - విశాల తెలంగాణా

https://www.facebook.com/vallury.sarma/posts/564762450227839

https://www.facebook.com/vallury.sarma/posts/564347423602675

నాకు మొదటి రెండు పదాలూ బోధపడవు. ఆంధ్రపదము ప్రాచీనమైనది భౌగోళికనామము వేదకాలమునుండి, పురాణాల కాలం నుండి ఉన్నది. శాతవాహనుల కాలానికి ఆంధ్రదేశం ఉన్నది కాని తెలుగు శైశవంలోనే ఉన్నది. భాషా పరంగా ఆలోచిస్తే ఇప్పుడు ఉన్నది విశాల తెలంగాణా మాత్రమే. చరిత్రలో ఈవిశాల తెలంగాణా నాలుగు సమయాలలో ఉన్నది. కాకతీయుల పాలనలో, గోల్కొండ కుతుబ్ షాహీల పాలనలో, నైజాం నవాబులపాలనలో, స్వతంత్రభారతంలో 1956 నుండి నేటి వరకు. ఆంధ్రప్రదేశ్ అన్నపేరు ఉత్తర, మధ్య ప్రదేశ్ లకు మాచింగ్ గా వచ్చినది. విశాలాంధ్ర అన్నపేరు అప్పుడు కమ్మూనిష్టుల స్వంతం. ఆనాడు నిజాం నవాబు ఉత్తర సర్కారులను ఫ్రెంచ్ వారికి, దత్త మండలాన్ని (సీడెడ్) బ్రిటిష్ వారికి తాకట్టు పెట్టారు. అప్పటినుండి ఈ ప్రాంతాల చరిత్ర మారింది. బ్రిటిష్ వారితో మద్రాసు సంబంధం యేర్పడినది. ఈ విదేశీ పాలన వలన మ్లేచ్చసంపర్కంతో ఈ ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తి వచ్చింది. తమిళులు తెలుగు వారికి అన్యాయంచేస్తున్నారనే ఊహతో, తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలనిపించి ఉద్యమాలు మొదలుపెట్టారు. ఆనాడు చెన్నపురి తెలుగు సంస్కృతికి కేంద్రం. హైదరాబాదు ఆస్థాయికి ఏనాడూ చేరలేదు. పైగా రాష్ట్రంలోనే తెలుగు భాష పతనానికి కారణమయింది. మక్కా, మదీనాలతో బాటు, బెతెల్ హాం కూడా తెలుగువారికి మన ప్రభుత్వగుర్తింపుపొందిన పుణ్యస్థలమయినది. ఏడుకొండలని కూడా విభజించే యత్నాలు జరిగాయి. మన పరిధి మూడు రాష్ట్రాలుగా మారి ప్రపంచీకరణలో విశ్వవ్యాప్తమౌతూంది. మన పిల్లలు కొలిచేది ఆంగ్ల సరస్వతి. (పోనీ అపొలో పాలనలోని గ్రీక్ విద్యా దేవత). మన పిల్లలను భావి అమెరికా పౌరులుగా ఊహించుకునే తెలుగు వారు కోకొల్లలు. మనం ఉదారులం.ఐనా విభజన మన తత్త్వం. Two nation theory is obsolete, this is the age of multinationals ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం.

జాజి శర్మ కిం కర్తవ్యం?
Vvs Sarma మనలో అధిక సంఖ్యాకులు చరిత్రకు సాక్షులు మాత్రమే. కాని మనచరిత్ర గాంధీగారి సత్యాగ్రహం కంటె సుహ్రవర్దీ డైరెక్ట్ యాక్షన్ (ప్రత్యక్ష చర్య) త్వరగా పనిచేసిందని చూపిస్తుందిKrishna Mohan Mocherla మన పిల్లలను భావి అమెరికా పౌరులుగా ఊహించుకునే తెలుగు వారు కోకొల్లలు. It is the reality !
వార్త
హైదరాబాద్, ఆగస్టు 29 : "భాషా వికాసాన్ని పెంపొందించడం కుటుంబం నుంచే ప్రారంభం కావాలి. ఇంట్లో అందరికీ తెలుగు భాషను అలవాటు చేయాలి. ఇంటిల్లిపాదికీ భాషపై మమకారాన్ని పెంచాలి. అందరం కలిసి తెలుగు భాషా వికాసాన్ని పెంపొందించాలి'' అని సీఎం కిరణ్కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.
వ్యాఖ్య
అద్భుతం కిరణ్ రెడ్డీ, నీ రాజనీతిజ్ఞతను తక్కువగా అంచనా వేశాం. తెలుగును రక్షించాలంటే ఇంట్లో తెలుగులోనే తప్పక మాట్లాడుకోండి. అంటే ప్రభుత్వంలో తెలుగుకు ప్రోత్సాహమిచ్చే పరిస్థితి లేదు. ఇంగ్లీషు ముఖ్య భాష. బైట బోర్డులు పెట్టడం వరకు తెలుగు, ఉర్దూ, హిందీ లది సమాన స్థాయి. ఇది తెలుగు ఆఫ్ ది వెస్ట్ మాత నిర్ణయం. ఇంటిలో వాడుకోడానికి ప్రభుత్వ అభ్యంతరం ఏమీ ఉండదు. మీ పిల్లలు ఇష్టపడకపోతే అది మీ బాధ్యత. అమెరికాకు ప్రోగ్రామర్ కూలీలుగా వెళ్ళడానికి ఇంగ్లీషు ఉచ్చారణ కూడా మార్చుకోవాలి. టీవీ 9 లో తెలుగును గురించి ప్రవచించిన ప్రబుద్ధుడు, తన కార్యక్రమానికి జర్నలిస్ట్ డైరీ అనిపేరు పెట్టుకున్నాడు.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...