Friday, January 19, 2018

రాధా కృష్ణుల కథ

https://www.facebook.com/vallury.sarma/posts/493919877312097

రాధా కృష్ణుల కథ ద్వాపరయుగంలో కృష్ణావతార కథ కాదు. సృష్ట్యాది కథ.ఇది విపులంగా బ్రహ్మ వైవర్త పురాణాములోనూ, దేవీభాగవతములోనూ ఉన్నది. వైకుంఠం పైన గోలోకమని ఉన్నది. అక్కడ పరమ పురుషుడు శ్రీకృష్ణుడు, ఆతని శక్తి రాధాదేవి.శ్రీకృష్ణుని తత్త్వము పరిపూర్ణమహావిష్ణుతత్త్వమే.పంచబ్రహ్మ తత్త్వము అని ఉంది. మొదటిది సదాశివ లేదా పరబ్రహ్మ. రెండవది కామేశ్వర-కామేశ్వరీ తత్త్వము, మూడవది మహావిష్ణు తత్త్వము. ఆ తత్త్వము నుండే అనేక బ్రహ్మాండములు ఉద్భవించినవి. దాని పాదాంశమునుండి మనమున్న బ్రహ్మాండము ఉద్భవించినది. ఇక్కడ త్రిమూర్తులు విష్ణు, బ్రహ్మ, మహేశ్వరులు. శ్రీకృష్ణునికి ముందే అతడి విష్ణుమాయ లేదా యోగమాయ అవతరించినది. ఆమెపనియే దేవకీగర్భములోనున్న అనంతుణ్ణి, రోహిణి గర్భంలో ప్రవేశ పెట్టుట. అందుకే బలరామునికి సంకర్షణుడు అనేపేరు వచ్చింది. దేవకీ గర్భంలోనికి కృష్ణుడు వచ్చినప్పుడు ఆమె యశోద గర్భంలో ప్రవేశించినది. కంసుణ్ణి హెచ్చరించినది ఆమెయే. తరువాత ఆమె కృష్ణుని మేనత్తను ఆవహించి కృష్ణుని కార్యకలాపాలలో, లీలలలో పాలు పంచుకున్నది. ఈ మేనత్త కృష్ణుని కంటె పది, పదిహేను సంవత్సరాలు పెద్దది. అష్టపదులలోని గోపికా క్రీడల సమయంలో కృష్ణునికి పది సం. వయసు ఉంటే ఆవిడ వయస్సు 20-25 సంవత్సరాలు. కృష్ణుని మొదటి వేణువు అతడు పాకే సమయములో ఆమేయే ఇచ్చినది. అది పట్టుకు నిలబడ్డాడు బాలకృష్ణుడు. వాళ్ళకి పెళ్ళి ప్రశ్నయేలేదు.ఆమెది శుద్ధ సాత్త్విక ప్రేమ , ఆమె మనస్సులో కృష్ణుడు ఎప్పుడూ ఉంటాడు. విరహం కేవలం కవి వర్ణన. రాధ యే రామ కృష్ణ సోదరి దుర్గ. ఆమెయే గంగ. ఆమెయే సుభద్ర. ఆమెయే ద్రౌపది. వారందరూ పరాశక్తి అంశలే. ఇలా చెప్పే ధ్వనులు ఆయా పురాణాలలో ఉన్నాయి.జగన్నాథ పురిలో బలరామ కృష్ణ సుభద్రలను పూజిస్తారు.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...