మనం ఆలోచన గురించి ఆలోచిస్తున్నాం. నా ఆలోచనను మీతో పంచుకోవాలంటే భాష యొక్క పరిమితులు ఇక్కడే వస్తాయి. నాఇంగ్లీషు వ్యాసానికి Thoughts on Thinking అనే శీర్షిక పెట్టాను. అదే Thinking about Thoughts అంటే అర్థం తేడా వస్తుందా? అవును - Computer Science కి information technologyకి ఉన్నంత తేడా ఉంది. ఈ ప్రశ్న నేను ఇంటర్ వ్యూలలో ఆ సబ్జెక్టులతో బి. ఇ. చేసినవారిని అడిగేవాణ్ణి. ఒక్కరు చెబితే ఒట్టు.తెలుగులో నా వ్యాసాలకు మంచి శీర్షికలు తెలుగు మిత్రులు ఆలోచింపగలరా? .
జాజి శర్మ ఆలోచనావలోకనం
Vvs Sarma I wanted for two different titles. I would translate your title in English as as Thinking in Retrospect. The shades of meaning of words are many. As tough as finding matching blouse pieces for silk saris.
Thoughts on Thinking ను యథా తథంగా తెలుగులో శీర్షికగా అనువదిస్తే బాగుండదు. దాని అర్థం "ఆలోచించడం గురించిన ఆలోచనలు". పోనీ అచ్చ తెలుగులో పెడదామంటే "తలచుటపై తలపులు".ఉహూ. Thinking అనేది నామవాచకము, విశేషణము, క్రియ కూడా. చలం కూడా musings అన్నాడు. నాకు తెలుగులోనే పెట్టాలని ఉంది. thinking మనోభవం. thoughts మనోభావాలు. నేను అనుకుంటున్న శీర్షిక "మనోవృత్తి-ఆలోచన". పతంజలి యోగసూత్రాలలో యోగః చిత్తవృత్తినిరోధః అన్నాడు కదా. మనోవృత్తి-అంటే ఆలోచించడం.
Padmini Bhavarajuమనం ఆలోచించే సాధనం మస్తిష్కం (మెదడు), ఇది తలలో ముఖ్యభాగం. తలలు ఎక్కువైతే ఆలోచనలు పెరుగుతాయా? బ్రహ్మకు నాలుగు తలలు ఉంటే ఆలోచనలూ, జ్ఞాన, విజ్ఞానాలు మనకంటె ఎక్కువా? ఐతే పదితలల రావణాసురుని ఆలోచనలు ఎలా ఉంటాయి? పదిచేతులుంటే బాగుండును అని ఒక వాణిజ్య ప్రకటనలో ఒక ఇల్లాలు ఆలోచిస్తుంది. (సోదరి పద్మిని పది చేతులు, పదితలలూ ఉంటే నయం అనుకుం టుందేమో? ఒకదానితో వ్యంగ్య రచన, ఒక దానితో వేదాంతం, ఒకదానితో భక్తి, ఒకదానితో కవిత్వం ఇలా). ఈ ఆలోచన ఇప్పుడు శాస్త్రవేత్తలకు వచ్చింది. భౌతికంగా కనపడకపోయినా, వేర్వేరు రంగు టోపీలు ధరింఛవచ్చు కదా). ఎడ్వర్డ్ డిబోనో అనే ఆయన Six Hat Thinking అనే ఆలోచనా విధానాన్ని రూపొందించాడు. తెలుపు, ఎరుపు, నలుపు,పసుపు, ఆకుపచ్చ, నీలం టోపీలు ధరించి ఆలోచించడమన్న మాట. ఒకోటోపీతో ఒకోరకం ఆలోచనలు చేస్తాడు. ఒక సమస్యను పరిష్కరించడానికి ఈ విధానం ఉపయోగిస్తుంది. రేపు ఎన్నికల్లో ఎవరి పార్టీలో చేరాలి అంటే పచ్చ టోపీ, ఆకుపచ్చ టోపీ, ఎరుపు టోపి, కాషాయ టొపీ, నీలం టొపీ, గులాబీ టొపీ పెట్టుకుని లాభనష్టాలు అంచనా వేసుకోవచ్చు. ఒక క్రమ పద్ధతిలో ఆలోచించడానికి ఇలాంటి పద్ధతులు ఉపయోగిస్తాయి.
పదాల ముచ్చట్లు
మన vocabulary శబ్దనిధి లేదా శబ్దకోశం సమృద్ధిగా ఉంటేనే మనం సందర్భోచితమైన పదం వాడగలము. Thoughta, Thinking అనే పదాలకు మనం - అంటే మిత్రులు, నేను కూడా వైవిధ్యభరితమైన తెలుగు లేదా, తత్సమ పదాలను గుర్తుచేసుకోలేకపోయాము.అందుచేత ఆలోచనలను గురించిన పదాలు ఇంకా తెలుసుకోవాలి. (సంస్కృతపదాలు) ఆలోచన, యోచన, చింత, వితర్కము, ధ్యానము (ధ్యాస),స్మరణ,విచారము, విమర్శ, అవలోకన,సమీక్ష,భావము, .. ఇన్నిపదాలు ఆలోచనను గురించినవి ఉన్నాయి. వీటికి క్రియారూపాలు ఆలోచించుట, చింతించుట, విచారించుట, తర్కించుట,యోచించుట విమర్శించుట, భావించుట ..ఇలా అనేకం)
(తెలుగు పదాలు) తలపు,ఎన్నిక(తలపోయుట, తలంచుట,ఎంచుట, అనుకొనుట,ఎన్నుకొనుట) పదాల వాడుకలో తేడాలు అర్థాలలో అనేకఛాయలు (shades of meaning). సరియైనపదాని వాడటం కంచిపట్టు చీరకు 2x2, matching blouse piece కు ఎన్నుకోవడమంత కష్టము,కొట్టులో చూడాలి, బయటి వెలుగులో చూడాలి, Tubelight వెలుగులో చూడకూడదు. ఇలా.
తెలుగుకు సంస్కృతం ఎంత అవసరమో గమనించండి.

Padmini BhavarajuPadmini. Thoughts have taken you into the world of Rats. నేను six Hat Thinking ఇంగ్లీషువాళ్ళ ఇప్పటి ఆలోచనగా వ్రాశాను. మన భారతీయ గృహిణులకు అంతకంటే ఎక్కువ విజ్ఞానం ఉంది. టోపీలు ఏంకర్మ? వాళ్ళు రోజులో ఆరు అవతారాలే ఎత్తుతారు.
కార్యేషు మంత్రీ , కరణేషు దాసీ ;భోజ్యేషు మాతా, క్షమయా ధరిత్రీ; రూపేషు లక్ష్మీ; శయనేషు రంభా;షట్కర్మయుక్తా, ఖలు ధర్మ ఫత్నీ; వాళ్ళు డిబోనో కి పాఠాలు నేర్పగలరు. కాని ఎలుకల దగ్గర ఈ ఆలోచనా విధానం అపజయం పాలైంది. ఎందుకో తెలుసా? మనకు ఎలుకల భాష,ఎలుకల ఆలోచనా విధానం అర్థం కాలేదు.పరిశొధనల ఆవశ్యకత ఉంది. తెల్లటోపీ రాజకీయనాయకులది.వాటికి కావలసినది పూజతో పాటు ఆహారం, లంచం.. దానిని భోక్తగా పిలవాలి. We are already in the rat race. Let us who will win.

జిడ్డు కృష్ణమూర్తి గారు Thinker, Thinking, Thought ఈ మూడింటినీ గురించి ఒకేసారి ఆలోచించాలి అంటారు. ఇది ఇంగ్లీషులో చెప్పినా అసలు సిసలైన భారతీయభావన. అద్వైతంలో దృగ్దృశ్య వివేకము అని ఒక తత్త్వము ఉంది. ఇక్కడ మూడవది ద్రష్ట, మిగిలినవి (దృష్టి), దృశ్యము. నీకు కనపడేది నీ సంస్కారానిబట్టి, నీజ్ఞానాన్ని బట్టి ఉంటుంది. ఆలోచనలు అంతే. మొదట thinker కి తెలుగు చూదాం. జె.కె. గొప్ప ఆలోచనా పరుడు అంటే సరిపోదు ఆయనకు. అది కేవలము అలోచించే ప్రతి వాడినీ సూచిస్తుంది. కిం కర్తవ్యం? సంస్కృతం. చింతకః, చింతకుడు అనే పదం ఉన్నది.కాని సూరి, ముని, తత్త్వవేత్త పదాలుకూడా thinker కి సమానార్థకాలు. "దయ్యాలు ఉన్నాయా?" ఇది మన సామాన్య సంశయాత్మకమైన ఒక ఆలోచన. దయ్యాలు ఉన్నదా? ఉన్నది. ఇది సందేహంలేని ఆలోచన.ఎందుకు? దయ్యాలు అనే బహువచన పదం ఉన్నది ఒక దానిలో పదం యొక్క ఉనికి, మరియొక ఆలోచనలో పదార్థం యొక్క ఉనికి గురించి ఆలోచిస్తున్నాము కాబట్టి. ఉన్నాయి కూడా సంశయాత్మకం కాదు. స్మశానంలో చింతచెట్టుమీద ఉన్నాయి. నా ఆలోచనలో దయ్యాలు ఉన్నాయి. నా ఆలోచనలోనే చింతచెట్టు మీద కూడా ఉన్నాయి. నా స్వప్నావస్థలో ఉన్నాయి. దేవుడు వలెనే. నాకు ఉన్నాడు. నీకు లేడు.నీ ప్రపంచంలోఉన్నాయి. అతని ప్రపంచం లో లేవు. ఎవరి ప్రపంచం వారిదే. "విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం" (దక్షిణా మూర్తి స్తోత్రం).
Nandiraju Radhakrishna ప్రేమ మనసుకు సంబంధించినది కాదు.ఆలోచన అనే గూడులో లేదు.దాన్ని వేదకలెం.అభ్యసించలేము. పోషించలేము. మనసు మౌనంగా, హృదయం ఖాళీగా ఉన్నప్పుడు ప్రేమ పుడుతుంది- జిడ్డు కృష్ణమూర్తి
ఇది చదివితే చాలా మంది తెలుగు కవులు తట్టుకోలేరు. వాళ్ళు మనసులు పారేసుకుంటారు. మనసులను దొంగిలిస్తారు. వాళ్ళమనసుని ఎవరో దోచుకుపోటారు. మనసులు విరిగిపోతాయి. ముక్కలౌతాయి. ఏ ఫెవికాలూ అతకలేదు. హృదయం అంటే రక్తప్రసరణ చేసే అవయవమనుకుని అరకు చుక్కతో చూపిస్తారు. దానిలో ముల్లు (మన్మధ బాణం) గుచ్చుతారు. హృదయం అంటే వస్తువు కాదు ఆకాశం అని వారికి తెలియదు. సంకుచితమైతే అది ఒక గూడు. కాని నిజమే, ఆప్రియుడు ఎవరోకాదు. విశ్వవ్యాపి ఐన పరమ పురుషుడే. కవి కూడా ఆయనకు ప్రేయసియే. ఇక మిగిలిన పురుషులు లేరు. అంతా స్త్రీలే. ఇక ఈసునసూయలు, రాగద్వేషాలు లేవు. అదే కృష్ణుడు చేసిన రాసక్రీడ.
అంగనామంగనామంతరే మాధవం, మాధవాం మాధవంచాంతరేణంగనా.
కృష్ణమూర్తిగారు కృష్ణుడే ,బుద్ధుడే, రాధాకృష్ణగారు బోధకులే.

No comments:
Post a Comment