Sunday, January 21, 2018

అక్కడ ఢిల్లీ సుల్తానులు - ఇక్కడ కాకతీయులు



ఇక్కడ కాకతీయుల పాలన సమయం లోనే, అక్కడ డిల్లీలో తురుష్క సుల్తానుల పరిపాలన. ఉత్తర భారతంలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలన్నిటిలోని అత్యంత ప్రధానమైన దేవాలయాలన్నీ ధ్వంసంచేయబడ్డాయి. వారి మతవ్యాప్తి కూడా “నీ ప్రాణమా? నీ మతమా?” అనే తీరులో సాగుతున్నదన్న వార్తలు దక్షిణానికి కూడా చేరాయి. ముఖ్యంగా బౌద్ధమతం ఎక్కువ వ్యాప్తిలో ఉన్న ప్రాంతాలన్నిటిలో ఇస్లాం బాగా వ్యాపించింది. మెల్లగా తురుష్కుల దృష్టి దక్షిణభారత దేశంవైపు పడుతున్నది. ముస్లిములపాలనలో ఇంత విధ్వంసం ఎందుకు జరిగినది? రాజ్యాలమధ్య యుద్ధాలు, సామ్రాజ్యాలు విస్తరించడమూ పూర్వమునుండీ ఉన్నవీ. వీళ్ళతో ప్రత్యేక సమస్య ఏమిటి? ఈ మతస్థులు విదేశీయులుగా వచ్చారు. చాలాకాలం విదేశీయులుగానే ఉన్నారు. వారితోపాటు వారి ప్రజలు, వారి మతము, వారి ప్రత్యేక వేష భాషలు (ముఖ్యంగా అరబిక్, పారశీక భాషలు), వారి గ్రంధము అరబిక్ భాషలోని ఖురాన్ - అన్నీ వచ్చాయి. వారి మత సిద్ధాంతాల దృష్టికోణంలో భారతీయులు అనాగరికులు, విగ్రహారాధకులు, సంస్కరింపబడ వలసిన వారు. వారిని తమ మార్గంలోనికి మార్చడానికి రాజకీయ బలం ఉంది. భారతీయులు మతం మారని వారు దాస్యవృత్తిలోనే ఉండాలి. ఇక్కడి ఐశ్వర్యం, ధనం, సంపద, స్త్రీలు,వారికి భోగ వస్తువులే. మతం మార్చుకున్నవారు వారి పాత పద్ధతులను వదిలి పూర్తిగా వారి నూతన పద్ధతులను అనుసరించ వలసినదే. ఒకటి రెండు తరాలలో వారి పూర్వ చరిత్రను మరచిపోవలసినదే. కాఫిర్, రిద్ధా, ఉమ్మా, జిహాద్, ధిమ్మి, దార్ - ఉల్ -ఇస్లాం, దార్-ఉల్-హర్బ్, జిజియా, ఫట్వా - ఇలాంటి పదాలన్నీ అన్య మతస్తులకు ఇస్లాం అంటే ఒకరకమైన భయాన్ని కల్పిస్తాయి. ఆ పదాలకు అనేక రకములైన అర్థములుండవచ్చును. కాని చూడగానే ఈ మతము సనాతన ధర్మమునకు పూర్తిగా వ్యతిరేకమని అనిపించడానికి ఆస్కారమున్నది. వేయి సంవత్సరాల సహజీవనం తరువాత కూడా 20 వ శతాబ్దములో వారు Two Nation Theory ప్రతిపాదించి దేశవిభజన సాధించారంటే సగటు మనుషులు ఏమనుకోవాలి? Integration is probably unthinkable, peaceful coexistence may only be the achievable goal. The pluralistic American society is a melting-pot model while India with its variety can only follow a mosaic model.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...