Thursday, January 18, 2018

విష్ణు సహస్రం 2


నాలుగవ నామం భూతభవ్యభవత్ ప్రభవే నమః, ఒకప్రశ్న ముందు వస్తుంది? విశ్వము, విష్ణువు, వషట్కారము, భూతభవ్య భవత్ప్రభువు ఈ నామాలకు పరస్పరసంబంధం ఏమైనాఉన్నదా? ఉంది. ఇదిసృష్టికి సంబంధించిన కథ. సృష్టింపబడినది, జీవులమైన మన చేత మొదట గుర్తింపబడేది విశ్వము. సృష్టించినది విష్ణువు. దానికి కావలసిన సమస్తమైనవి, జ్ఞానము, కర్తృత్వము,సిరి, ఐశ్వర్యము, అధికారమును సూచించేది వషట్కారము. అనంతకాలములో నిరంతరం జరిగేది సృష్టి. భూత కాలము, భవిష్యత్తు, వర్తమానము అని కాలమును విభజించవచ్చు. నేనేకాలాన్ని (అహం కాలోస్మి) అన్నది భగవంతుడే. ఆయనవిభూతులు సృష్టి, స్థితి, విలయాలు. ఆపాతాళ, నభస్థలాంత భువన బ్రహ్మాండాన్ని దాటి వ్యాపించిన జ్యోతిర్లింగ రూపుడైన శివునిగా గాని, సృష్టిసంకల్పాన్ని కలిగి విశ్వవ్యాపియైన మహావిష్ణువుగా గాని దానికి ప్రభువు అతడే. సృష్టి క్రమములొ అనేక పర్యాయాలు సృష్టించి, తిరిగి తనలో విలీనమూ చేసుకొన్నవాడతడే. అప్పుడూ ఆయనే, ఇప్పుడూ ఆయనే, భవిష్యత్తులోనూ ఆయనే.ఆయనే మూడుకాలాలకూ ప్రభువు. ఆయనకు నమస్సులు.



విష్ణు సహస్రము - పదాల ముచ్చట్లు
భూత, (భూతము), భూతి - ఇవి విష్ణు సహస్రములోను, భగవద్గీతలోను తరచుగావచ్చే పదాలు. 5. ఓం భూతభవ్యభవత్ ప్రభవేనమః 6. ఓం భూతకృతే నమః 7. ఓం భూత భ్రుతే నమః 8.ఓం భూతాత్మనే నమః 29. ఓం భూతాదయేనమః 499. ఓం శరీరభూతభ్రుతే నమః 630 ఓం భూతయేనమః 702 ఓం సద్భూతయేనమః 708 ఓం భూతా వాసాయనమః 805 ఓం మహాభూతాయనమః
భూత, భూతము – 1. పృథివ్యాది; (ఇవి అయిదు- పృథివి, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశము.) 2. దేవయోనివిశేషము (భూత, ప్రేత, పిశాచాదులు) 3. ప్రాణి, జీవుడు, being 4. కడచినది (past) 5. తగినది; 6. (ఉత్తర పదమైనచో) సమానమైనది, 7. Past tense, ఇంకా ఉపసర్గలతో చేరి సంభూత, అనుభూత వంటి పదాలు వస్తాయి. అనుభూత అంటే అనుభవించినది, ఆనందించినది. సంభూత అంటే కలసి వచ్చినవి, కలసి ఉన్నవి, జన్మించినవి (ఉదా: దైవాంశ సంభూతుడు)
భూతి అంటే ఉనికి, మానవాతీత శక్తి. దీనినుండి ఉపసర్గలతో వచ్చినవి సంభూతి, అనుభూతి, విభూతి. ఇది అర్థం ఐతే పై నామాలన్నీ అర్థ మౌతాయి. భూతకృత్ అంటే భూతములను సృష్టించిన వాడు. అన్ని అర్థాలూ సరిపోతాయి


No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...