Thursday, January 18, 2018

క్షకార కుక్షి

క్షకార కుక్షి
చకార కుక్షి కథ తెలిసే ఉంటుంది. సంస్కృతంలో "చ" అంటే and. తెలుగులో మరియు అన్నది ఎక్కువ వాడము. కృత్రిమంగా ఉంటుంది. వేదంలో కూడా దీని వాడకం ఎక్కువే. " నమో భవాయచ రుద్రాయచ నమః శర్వాయచ పశుపతయేచ నమో నీలగ్రీవాయచ శితికంఠాయచ .." భారతంలో వ్యాసుడు చెబూతూంటే గణపతి వ్రాయాలి. ఎక్కడా ఆశువుగా చెప్పేరచనలో ఆగరాదు. అది గణపతి పెట్టిన నిబంధన అందుచేత వ్యాసుడు తరువాత పదం ఆలోచించడానికి తీసుకునే సమయంలో చ అనేది ఒక పదంగా చెప్పేవాడని ఆయన ను చకార కుక్షి అన్నారు. అవన్నీ తిన్న (విన్న) గణపతిని కాళిదాసు చకార కుక్షి అన్నాడని మరొక కథ ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే మన పద్మినికి క్షకార కుక్షి అనే బిరుదు ఇద్దామని. "అక్షరాణాం అకారోస్మి" అన్నాడు కృష్ణుడు. పద్మిని నేను తక్కువా "అక్షరాణాం క్షకారోస్మి అంటుందేమో.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...