Monday, January 22, 2018

లోపాముద్ర - అగస్త్యుడు 4

https://www.facebook.com/vallury.sarma/posts/521088997928518

దేవతలు, మునులు వింధ్య పర్వతాలను ఇంక పెరగకుండా చేయమని అగస్త్యుని ప్రార్థిస్తారు. అగస్త్యుడు, లోపాముద్ర వింధ్య దాటి దక్షిణానికి ప్రయాణం కడతారు. వింధ్య పర్వతం ఆయనకు శిరసు వంచి నమస్కరిస్తుంది. "నేను మళ్ళీ తిరిగి వచ్చే వరకు పెరగవద్దు, ఇలాగే ఉండుము" అని వింధ్యను ఆదేశిస్తాడు. ఆయన దక్షిణదేశంలోనే ఉండిపోయాడు, వింధ్య పర్వతం పెరగడమూ ఆగిపోయింది. (పర్వతాలను, నదులను, వృక్షాలను దేవతాత్మలుగా పరిగణించడం మన సంస్కృతి లోభాగం. కాళిదాసు కుమార సంభవం ఈ శ్లోకంతో ప్రారంభమౌతుంది. "అస్త్యుత్తరస్య దిశి దేవతాత్మా హిమాలయోనామ నగాధిరాజా" నేటి భారతంలో వీటి విషయంలో ఎంత అధర్మం, అపచారం చేస్తున్నామో తెలిసినదే). కాశీ విశ్వనాథునికి దూరంగా నివసించడం అగస్త్యునికి బాధ కలిగించింది. దక్షిణదేశంలో ఆయన దక్షారామ భీమేశ్వరుని దర్శిస్తాడు. కాశీ విశ్వనాథుడు దర్శనమిచ్చి, "నీకోసం నేను ఇక్కడ కూడా ఉంటాను.ఈక్షేత్రం దక్షిణకాశీగా పేరుపొందుతుంది" అని అభయము ఇస్తాడు. తరువాత అగస్త్యుడు, లోపాముద్ర కోలాహలపురంలోని మహాలక్ష్మిని దర్శిస్తారు. (నేటి కొల్హాపూర్) . అగస్త్యుడు అక్కడ మహాలక్ష్మిని ఉద్దేశించి ఒక స్తోత్రం చదువుతాడు. అది వెబ్ లో వినవచ్చును. దాని మొదటి ఐదు శ్లోకాలు
ఓం శ్రీ విష్ణువక్షస్థలస్థితాయై నమః
అగస్త్య మహర్షి విరచిత శ్రీలక్ష్మీ స్తోత్రం
జయ పద్మపలాశాక్షి జయ త్వం శ్రీపతిప్రియే |
జయ మాతర్మహాలక్ష్మి సంసారార్ణవ తారిణి || 1
మహాలక్ష్మీ నమస్తుభ్యం నమస్తుభ్యం సురేశ్వరి |
హరిప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే || 2
పద్మాలయే నమస్తుభ్యం నమస్తుభ్యం చ సర్వదే |
సర్వభూత హితార్థాయ వసువృష్ఠిం సదా కురు || 3
జగన్మాతర్నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే |
దయావతి నమస్తుభ్యం విశ్వేశ్వరి నమోಽస్తుతే || 4
నమః క్షీరార్ణవసుతే నమస్త్రైలోక్యధారిణి |
వసువృష్టే నమస్తుభ్యం రక్ష మాం శరణాగతం || 5
మహాలక్ష్మి అగస్త్యునికి దర్శనమిస్తుంది. అనేక విషయాలు చెబుతుంది. "నీవు ద్వాపర యుగంలో వేద వ్యాసునిగా అవతరిస్తావు. అప్పుడు మళ్ళీ కాశీవెళ్ళే అవకాశం వస్తుంది. వేదాలను విభజించి నీశిష్యులద్వారా వ్యాప్తిచేస్తావు. మానవాళికి ఎంతో సాహిత్యాన్ని సృష్టిస్తావు. ఈ యుగంలో నీవలన కావలసిన పని దక్షిణ దేశంలోనే ఉంది.దక్షిణాన కావేరీతీరంలోని స్వామి మలై కు వెళ్ళు. అక్కడ కుమారస్వామి (సుబ్రహ్మణ్యేశ్వరుడు)ని గురువుగా స్వీకరించు. ఆయన ద్వారా నీ కర్తవ్యంతెలుస్తుంది." ఆమె లోపాముద్రకు కూడా వరాలు ఇస్తుంది."లోపాముద్రా సహిత అగస్త్యమహర్షిని తలచుకున్న వారికి సమస్త శుభాలు, కల్యాణము, జరుగ్తాయి. నా (శ్రీ మహాలక్ష్మి) అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది"

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...