https://www.facebook.com/vallury.sarma/posts/521449171225834
అగస్త్యుడు భార్య లోపాముద్రతో కలసి అనేక క్షేత్రాలు,తీర్థాలు దర్శించాడు. అనేక పుణ్యనదులలో స్నానాదికాలు చేసేవాడు. లోపాముద్ర ఆయనను అడిగింది."ఏమండీ, ఇన్ని క్షేత్రాలు సందర్శిస్తున్నాము. దీనివలన మనకు ముక్తి వస్తుందా?" దీనికి ఆయన "నా తపస్సువల్లే ముక్తి వస్తుంది. అదిఎప్పుడో పూర్తి అయింది. ఇది లోకులకు మార్గదర్శకం గా ఉండడానికే" అని చెప్పలేదు. "మనము మానవ దేహాలలో ఈభూమిమీద సంచరిస్తున్నాము. ఏ క్షణాన అయినా మనవలన పొరపాటు జరగవచ్చు.ముక్తి గురించి భయం మానవులకు ఎప్పుడూ ఉండాలి" ఇది ఆయన బోధ. బాహ్య తీర్థములు సేవిస్తే మానసతీర్థములు జ్ఞప్తిలోనికి వస్తాయి. "తీర్థములు మానసములు ముక్తి ప్రదములు| బాహ్య తీర్థావళులు ముక్తిఫలమునీవు||” సత్యము, దయ, దానము, సంతోషము, సమత్వము, సంయమనము వంటి సుగుణములనే మానస తీర్థములంటారు. తీర్థ దర్శనం, తరువాత ఆయనబోధ - మనందరికీ వర్తిస్తాయి.
రామాయణంలో ప్రథమ పాత్ర పోషించిన ఋషులు వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్యులు. రాముని వనవాస కాలంలో అగస్త్యుడు దండకారణ్యంలో ఒక ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నాడు. అప్పటికి అగస్త్యుడు వానప్రస్థాశ్రమంలో ఉన్నాడు. శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై అరణ్యవాస కాలంలో శరభంగుడు, మందకర్ణి, సుతీక్షణుడు మొదలైన మునుల ఆశ్రమాలను దర్శించాడు. ఈ అరణ్యవాస కాలమే రామాయణంలో రామునకు, భారతంలో పాండవులకు చాలా ఫలప్రదమైన కాలము. తపస్సు, ఋషి దర్శనం, దేవతా దర్శనం వంటివి వారికి ఎంతో మేలు చేశాయి. సుతీక్షణుడు రాముని అగస్త్యముని దర్శనం చేసుకోమనీ, ఆయన ఈయగల లాభం మరెవరూ ఈయలేరనీ చెబుతాడు. రాముడు, సీత, లక్ష్మణుడు అగస్త్యాశ్రమానికి వెడతారు. అగస్త్యుడు రామునికి అనేక అస్త్రశస్త్రాలను, వైష్ణవతేజంతో వెలుగొందే విల్లునూ, అక్షయతూణీరాన్ని, రెండు చేతులతో ఒకేసారి యుద్ధం చేయడానికి అనువైన ఖడ్గాలను ఇస్తాడు. గోదావరి ఒడ్డున పంచవటిలో కుటీరం నిర్మించుకొని వనవాస కాలం గడపమని ఆయనే రామునికి చెబుతాడు. రామ రావణ సంగ్రామములో రావణుని ఎలా ఎదుర్కోవాలని రాముడు చింతిస్తున్నప్పుడు అగస్త్యుడు అక్కడకు వస్తాడు.
రామ రామ మహాబాహో శ్రుణు గుహ్యం సనాతనం
ఏన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి
అదిత్యహృదయం పుణ్యం సర్వ శత్రు వినాశనం
జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం
అనిచెబుతూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని అందజేస్తాడు. ఇలాగే ఆయన ఆదిత్య కవచాన్ని , సూర్యస్తోత్రాన్ని ఇచ్చాడు. పురాణాలలో ఇవన్నీ కష్టకాలంలో మానవులను ఆయా దేవతలను స్తుతిస్తో పఠనమో, ఉపాసనయో, పారాయణయో చేసుకోమని చెప్పడమే. రావణునిపై విజయం సాధించి పుష్పక విమానముపై అయోధ్య తిరిగివెళ్ళేటప్పుడు రాముడు, సీత మొదలైన వారు అగస్త్యాశ్రమము వద్ద ఆగి ఆయనకు కృతజ్ఞతలు తెలిపి అయోధ్య వెడతారు. అగస్త్యుడు కొంతకాలము తరువాత లంకలో, విభీషణుని రాజ్యంలో నివసిస్తాడు. మనవాళ్ళు చేసుకునే ఋషి పంచమినోములో అగస్త్యుని స్తోత్రంలో లంకానివాస ప్రసక్తి వస్తుంది.
కాశపుష్ప ప్రతీకాశ వహ్ని మారుత సంభవ|
మిత్రావరుణయః పుత్ర కుంభయోనే నమోస్తుతే||
వింధ్యవృద్ధిక్షయకర మేఘతోయ విషాపహా|
రత్నవల్లభ దేవేశ లంకావాస నమోస్తుతే||
లోపాముద్రాదేవిని కూడా ఈ శ్లోకంతో సేవిస్తారు.
రాజపుత్రి మహాభాగే ఋషిపత్ని వరాననే|
లోపాముద్రే నమస్తుభ్యమ్అర్ఘ్యంమే ప్రతిగృహ్యతామ్||
ఇప్పుడు అర్ఘ్యం విడుస్తారు.
(సశేషం , ఆఖరి 6వ భాగం రేపు.)

No comments:
Post a Comment