Sunday, January 21, 2018

శైవమతం ఎట్లా సింథు ప్రజల/ మూలవాసుల వారసత్వం అయింది..!!!

https://www.facebook.com/vallury.sarma/posts/511255965578488

ప్రియ భగవత్ బందు శ్రీ శర్మ గారు,
జై శ్రీమన్నారాయణ,
మిత్రులు బహుజనబందు ఈ విధంగా వ్రాసారు.
"శైవమతం ఎట్లా సింథు ప్రజల/ మూలవాసుల వారసత్వం అయింది..!!!
మానవ సమాజాలు ఆహార సేకరణ దశ నుండి ఆహార ఉత్పత్తి దశకు పరిణామం చెందిన తరువాత నదీ పరివాహక ప్రాంతాలలో స్థిర నివాసాలు ఏర్పరచుకుని వ్యవసాయ నాగరిక వ్యవస్థలు నిర్మించుకున్నారు. నైలు, చిలీ, తిగ్రీస్, సింధూ నదుల పరివాహక ప్రాంతాలలో ఏర్పడిన తొలి నాగరికతలలో సింధు నాగరికత ఒకటి. అప్పటికి ఇంకా ఆహార ఉత్పత్తి దశకు ఎదగని మానవ సమూహాలు స్థిర నాగరిక సమాజాల మీద ...దాడులు చేస్తూ వారి ఉత్పత్తులను, సంపదను దోచుకుంటూ అటవిక సంచార జీవనం సాగిస్తూ ఉన్నారు.
సింధూ ప్రజలు ఆహారాన్ని వ్యవసాయం ద్వారా ఉత్పత్తి చేస్తున్నారంటేనే, ఉత్పత్తి క్రమాన్ని, మానవ పునరుత్పత్తిని పూర్తిగా అర్ధం చేసుకున్నారని అర్ధం. వారు ఉత్పత్తికి ఉపయోగపడే భౌతిక వస్తువులైన భూమి, నాగలి, ఇతర పనిముట్లు ఆరాధించారు.
మానవ జాతి మనుగడకు మానవ పునరుత్పత్తి ప్రధానం కనుక పునరుత్పత్తికి కారణమౌతున్న, 'స్త్రీ-పురుష' పునరుత్పత్తి అవయవాల కలయికను గౌరవిస్తూ, సృష్టి కార్యంగా భావిస్తూ. దాన్నే దైవంగా ఆరాధిస్తూ తమ దైవాన్ని లింగ రూపంలో దర్శించుకుంటూ ఒక సంస్కృతిని, ఒక జీవన విధానాన్ని ఏర్పరచుకున్నారు. వారి జీవన విధానమే శైవమతం. శివలింగానికి కూడా మానవాకారం లేదు. ఈ రోజు మనం శివాలయాలలో చూస్తున్న లింగం వాస్తవానికి ఒక్క లింగం కాదు. రెండు లింగాల కలయిక. కింద స్త్రీ లింగం అంటే పానపట్టంభగ, దాని మధ్యలో పురుష లింగం అంటే ప్రతీకాత్మక ద్విలింగైక్యం.ఇది సృష్టికి సంబంధించి ప్రకృతికి సహజత్వానికి చాలా దగ్గరలో ఉండే తాత్విక భావన. అందుకే శైవమతం సింథు ప్రజల/ మూలవాసుల వారసత్వం అయింది..@ బహుజన బంధు."
పై లఘు వ్యాసము లోని శివలింగ, పానపట్టము విషయాలు వదిలి, మిగిలిన చారిత్రాత్మక విషయాల వాస్తవికత తెలుపవలసినది.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...