Sunday, January 21, 2018

కాకతీయులు

https://www.facebook.com/vallury.sarma/posts/510023842368367


తూర్పు చాళుక్యులు, చాళుక్యచోళులయ్యారు. రాజమండ్రీ తరువాత చందవోలు కొన్నిరోజులు వెలనాటిచోళుల ముఖ్య నగరంగా ప్రాధాన్యత పొందినది. తరువాత వెలనాటి చోళులు కాకతీయులచేత ఓడింపబడ్డారు. కాకతీయుల వైభవానికి కేంద్రం వరంగల్లు (ఓరుగల్లు, ఏక శిలానగరం).వీరశైవం పోషింపబడినది. వీళ్ళు మొదట కల్యాణి చాళుక్యుల సామంతులు. పశ్చిమ చాళుక్య రాజధాని కల్యాణికి (నేటి బసవకల్యాణ్, బీదర్ జిల్లా) మారింది. కర్ణాటకలో రాష్ట్రకూటులు, చాళుక్యులు, హొయసళ రాజులు,కలచూరి వంశస్థులు ఇలా ఇందరి చిన్న చిన్నరాజ్యాలుగా కర్ణాటక దేశం పాలింపబడినది.ఈ కలహాలలో కాకతీయులు స్వాతంత్ర్యము ప్రకటించుకున్నారు.
ఈ కలచూరి వంశం కూడా కల్యాణినే రాజధానిగా చేసుకున్నది. కొలది సంవత్సరాలే పాలించినా వీరి పాలనలో ఒక నూతన మతం, బసవేశ్వరుని వీరశైవం (లింగాయతమతం) కర్ణాటక సమాజములొ పెద్ద మార్పులు తీసికొని వచ్చింది. కలచూరి వంశ పాలకుడు బిజ్జలునికి, బసవన్న ప్రధాన మంత్రి. ఆంధ్ర ప్రదేశములొ రెడ్డి, కమ్మ కులాల వారి ప్రాబల్యం ఎలాగో, కర్ణాటకలో లింగాయత, వొక్కళిగ కులాల ప్రాబల్యం ఎక్కువ. (యెడ్డియూరప్ప లింగాయత్, దేవెగౌడ వొక్కళిగ.) (వర్ణ వ్యవస్థను నమ్మని లింగాయత మతం, సమాజములో ఒక కులంగా భావింపబడుతూంది. )
ఈ వీరశైవమతం అనే పేరు రెండు మార్గాల ప్రజలకు వాడుతారు. ఆంధ్రదేశంలో శివాద్వైతులుగా, శివ విశిష్టాద్వైతులుగా పిలువబడి వేదముల ప్రామాణ్యతను స్వీకరించేవారు, మల్లికార్జున పండితారాధ్యుని వంటి వారిది ఒక మార్గం. 12 వ శతాబ్దములో బిజ్జలుని ప్రధాన మంత్రిగా పనిచేసిన సంస్కర్త, రాజనీతిజ్ఞుడు ఐన బసవేశ్వరుని అనుయాయులది రెండవ మార్గం. వారిద్దరూ కలసి వీరశైవాన్ని ఏక త్రాటిపై నడిపించడం - వారు సంకల్పించినా - శివ సంకల్పము వేరుగా ఉండుటవలన జరగలేదు.
మొదటి వీరశైవం రామానుజ, పూర్ణప్రజ్ఞ దర్శనములవలెనే సనాతన ధర్మములో దర్శనమనీ, లింగాయత మతము, బౌద్ధ, జైన సిఖ్ఖు మతములవలెనే ప్రత్యేక మతమని కొందరి నమ్మకం. ఈ ప్రత్యేక మతమనే భావము క్రైస్తవ, మహమ్మదీయ మతాలనుండి దిగుమతిచేసుకున్న అభిప్రాయం. ఒకే పుస్తకం, ఒకే ప్రవక్త, అదే అంతిమ మరియు శాశ్వత సత్యమనే భావమే ఈ మతాలను అనుసరించేవారి దృఢ విశ్వాసాలకి కారణం. బుద్ధుడు, మహావీరుడు, బసవేశ్వరుడు, గురునానక్ కూడా నూతన సత్యాలను ఆవిష్కరించలేదు. వారు నమ్మే (లేక నమ్మని) ఒకే దేవుడు వారికి సందేశాన్ని ఈయలేదు. వారుబోధకులు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా వారు బోధించారు. Is a scripture a rule book or a memorandum of association? వారి తరువాత జరిగిన విషయాలకు వారిని బాధ్యులనుచేయడం ఎంతవరకు సమంజసం? కాంగ్రెస్ అనే మతానికి గాంధీ (మహాత్ముడు) ప్రవక్త అన్నట్లు ఉంటుంది.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...