ఉగ్రవాదాన్ని మన పక్కదేశానికో, ఒక మతానికో, ఒక వర్గానికో అంటగట్టి Case Solved అని ఫైల్ మూసేస్తునాము. ఇద్దరు, ముగ్గురిని అరెస్ట్ చేసి,ఇరవై ఏళ్ళూ కేసునడిపి, వారినేరం వారే మరచిపోయాక, శిక్షవేస్తే వేస్తాము. పొరపాటున ఉరిశిక్ష వేస్తే మానవహక్కుల సంఘాలు ఇది అమానవీయమని ఊరేగుతాయి. మళ్ళీ ఒక సంఘటన జరుగుతుంది. మళ్ళీ అవే అభిప్రాయాలు. అవే అమలుజరపని నిర్ణయాలు. కొందరు కాలం చెల్లియో, చెల్లకో అపమృత్యువు పాలౌతారు. వారి ఆత్మలకు శాంతి(అంటే ఏమిటో నాకు తెలియదు) కలగాలని ఎవరో సరిగాతెలియని ఒకదేవుణ్ణి వేడుకొని మన మామూలు ధోరణిలో పడిపోతాము. (ఆ సంఘటన దురదృష్టవశాత్తు మన ఆత్మీయులను బలి తీసుకుంటే తప్ప).ఈనేరాలకి బాధ్యత ఎవరిది? వీటిని అదుపుచేయడం సాధ్యమా? ఒక రైలూ లేదా నిత్యమూజరిగే అనేక రోడ్డు ప్రమాదాలలోనూ అందరే చనిపోతున్నారు. అప్పుడు ఎవరూ బాధ్యులు కాదా? నాకు మనం సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదనిపిస్తుంది.వీటన్నిటికీ ముఖ్య కారణం, దోషం మనసమాజంలోనే ఉంది.ఇల్లా అన్నందుకు నన్ను క్షమించండి "మనం అనాగరికులం." సింధు నాగరికత తరువాత మన దేశంలో చెప్పుకోదగ్గ నాగరికత లేదేమో? నాగరికత అనే పదం నగరం లోంచి వచ్చింది. city, civilization, civic sense, citizenship వీటన్నిటికీ మూలం ఒకటే. మన నగరాలను చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. మనం ఈదృశ్యాలకు అలవాటు పడిపోయాం. పాశ్చాత్యులు నిస్సందేహంగా మనకంటే ఎంతో నాగరికులు. మన విద్యావిధానంలో పిల్లలు నాగరికత, సంస్కృతి, క్రమశిక్షణ దేశభక్తి నేర్చుకోరు. జీవితంలో ఏవిధముగానూ ఉపయోగపడని విషయ పరిజ్ఞానం సంపాదిస్తారు. ఈ రోజు ఎవరో facebook లో "బస్సుడ్రైవరుకు కనీస విద్యార్హత కావాలి, దేశాన్ని నడిపే రాజకీయనాయకునికి అక్కరలేదా?" అని ప్రశ్నించారు.నిజానికి అక్కరలేదు. ఆ డిగ్రీ సర్టిఫికెట్ దేనికీ గారంటీ ఇవ్వదు.మన పాలు కల్తీ, మన డిగ్రీ సర్టిఫికేట్లు నకిలీవి, మన డ్రైవింగ్ లైసెన్స్ కొనుక్కున్నది,మన పాస్ పోర్ట్ లో విషయాలు కూడా అబద్ధమే, పేవ్ మెంట్ మీద వ్యాపారం కూడా లైసెన్స్ లేనిదే, మన ఇంటి ప్లాన్ లో కూడా అనేక violations మన వ్యాపారస్తులు సేల్స్ టాక్స్ ఇన్ కంటాక్స్ సరిగా కట్టరు. మన నగరాలలో garbage disposal కూడా మనకు చేతకాదు. బాంబులు పేలిన మరునాడే అనుమానితులు ఎలా దొరుకుతారు? వారి సంగతి పోలీసులకు ముందే తెలుసునా? హై ఎలర్ట్ అంటే ఏమిచేస్తున్నారు? ఈ మొత్తం వ్యవహారంలో పౌరులపాత్రయేమిటి? ఇది మనకు చెప్పేవారెవరు? మన నగరాలలో జన సాంద్రత ఎలా తగ్గింఛాలి? You cannot see our societies’ problems in isolation. The way we are going things can only get worse.
Subscribe to:
Post Comments (Atom)
The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2
https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...
-
https://www.facebook.com/vallury.sarma/posts/615414371829313 Dr K. Sivananda Murty About the Book The Universe is perceived as the to...
-
https://www.facebook.com/vallury.sarma/posts/540571089313642 https://www.facebook.com/vallury.sarma/posts/540946075942810 https://www.f...
-
https://www.facebook.com/vallury.sarma/posts/530391606998257 సతీ అనసూయ, సతీ సావిత్రీ, సతీ సుమతీ వీళ్ళందరూ మొగుళ్ళు చేసిన అడ్డమైన పనులకి వ...
No comments:
Post a Comment