Sunday, January 21, 2018

రుద్రమదేవి

https://www.facebook.com/vallury.sarma/posts/512968998740518

రుద్రమదేవి (రుద్రాంబ ) కాకతీయులలో ఒక ధ్రువతారగా వెలిగిన మహారాణి. వంశమునకు గొప్ప పేరు ప్రఖ్యాతులని తెచ్చిపెట్టిన వీరవనిత. ఈమె తండ్రి గణపతిదేవునికి పుత్ర సంతానం లేదు. అందువలన రుద్రాంబను తన కుమారునిలా పెంచుకొని రుద్రదేవుడని నామకరణం చేసాడు. రుద్రమదేవి భర్త నిరవద్యపుర (నిడదవోలు) ప్రాంతాన్ని పాలిస్తున్న తూర్పు చాళుక్యుడైన వీరభద్రుడు. రుద్రమదేవి పెద్దకుమార్తె ముమ్మడమ్మ. ఈమె పుత్రుడే ప్రతాప రుద్రుడు. రుద్రమాంబ ప్రతాపరుద్రుని దత్తత తీసుకొని యువరాజుగా పట్టాభిషేకం చేసింది. రుద్రమదేవి, తరువాత ప్రతాపరుద్రుడు పాలించారు. ఇద్దరూ సమర్ధులైన ప్రభువులు మరియు యుద్ధ కోవిదులు. కాని ఉప్పెనలా ముంచుకొచ్చిన ముస్లిం దండయాత్రల కారణంగా కాకతీయ సామ్రాజ్యం పతనాన్ని ఆపలేకపోయారు.
సా.శ 1300 ప్రాంతం - సాయణ మాధవులు
ఒక సనాతన ధర్మాచార్యుడు భారతచరిత్రలో ప్రత్యక్షంగా భాగం వహించడం, శ్రీ కృష్ణుని తరువాత ఇప్పుడే జరిగినది, అదిచేసినది శృంగేరి శంకరమఠానికి పన్నెండవ పీఠాధిపతి యైన విద్యారణ్యస్వామి. “సర్వతంత్ర స్వతంత్రాది రాజధానీ విద్యానగర మహారాజధానీ కర్ణాటక సింహాసన ప్రతిష్ఠాపనాచార్య శ్రీమద్రాజాధిరాజగురు భూమండలాచార్య ఋష్యశృంగపురాధీశ్వర తుంగభద్రా తీరవాసీ” అని ఈనాటికి కూడా శృంగేరీ పీఠాధిపతి పిలువబడతారు. ఆయన ఆంధ్రుడు. వరంగల్లు ప్రాంతం వారు. కాకతీయ సామ్రాజ్యం ఖిల్జీ, తుగ్లక్ వంశాల దండయాత్రలతో పతనమైనది. ఆంధ్రదేశం అనేక రాజుల పాలనలో చిన్నాభిన్నమైనది. వరంగల్లు, ఇతర ఆంధ్రప్రాంతాల నుండి బ్రాహ్మణులు కర్ణాటక దేశానికి వెళ్ళారు. అలా వెళ్ళినవారిలో విఖ్యాతులు మాయనగారి పిల్లలైన సాయణ, మాధవులనే వారు. సాయణాచార్యుడు వేదభాష్యాల (వేదార్థ ప్రకాశ} రచయితగా పేరుపొందారు.అయన రచనలలో కొన్ని సోదరుడు మాధవుని పేరు కలిపి సాయణ మాధవాచార్య కృతం అని ఉన్నాయి.ఆ మాధవుడే సన్యాసాశ్రమంలో శ్రీ విద్యారణ్య స్వామి. సాయణభాష్యంలో సూర్యునివేగాన్ని గురించిన ఒకవేద మంత్రం ఉదహరించబడినది. (Wikipedia)
"తథా చ స్మర్యతే యోజనానాం సహస్రే ద్వే ద్వే శతే ద్వే చ యోజనే ఏకేన నిమిషార్ధెన క్రమమాణ నమోస్తుతే"
तथा च स्मर्यते योजनानां सहस्त्रं द्वे द्वे शते द्वे च योजने एकेन निमिषार्धेन क्रममाण नमोऽस्तुते ॥ యోజనానికీ నిమేషానికీ సరియైన విలువలు తీసుకొంటే ఇది సెకండుకు 3లక్షల కిలోమీటర్లు అవుతుంది. ఇది కాంతివేగానికి సరిపోతుంది. దీనిని సంప్రదాయవాదులు వేద మంత్రాల ప్రతిభగా గుర్తింప వచ్చును. హేతువాదులు కాకతాళీయమనవచ్చును. కాని సూర్యరథం వేగాన్ని సంఖ్యలలో గుర్తించిన కపిలుని సాంఖ్యాన్ని ప్రాచీన భారతీయ విజ్ఞానానికి ఉదాహరణగా తీసుకోకుండా ఉండలేము. సాంఖ్యయోగులకు సృష్టి రహస్యాలు తెలుస్తాయని మనం అంగీకరించాలి.    

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...