https://www.facebook.com/vallury.sarma/posts/844103258960422
https://www.facebook.com/vallury.sarma/posts/844103258960422]]
పాశ్చాత్యుల అలోచనా విధానం వేరు, మన అలోచనా విధానం వేరు. ముఖ్యంగా క్రైస్తవమతంపై అధార పడిన వాళ్ళ అభిప్రాయాలు, నమ్మకాలు వేరు. ఆంగ్లేయ విద్య ప్రవేశపెట్టిన 200 సంవత్సరాలలో మన ఆలోచనా విధానం చాలావరకు మారింది. దానితోపాటు క్రైస్తవ మతం స్వీకరించిన వారికీ, మార్క్సిజము వంటి విదేశీ ఆలోచనా విధానాలను, నాస్తిక, వైజ్ఞానిక (blind belief in science) (ఉదహరణకు నెహ్రూ) ఆలోచనా విధానం సహజంగా, వాస్తవికంగా అనిపించింది.ఇంకా అవగాహన లేకున్నా హిందూమతంలో వ్రేలాడుతున్న వారికి ఒక సందిగ్ధ స్థితి వచ్చింది. అక్కడే అనేక ప్రశ్నలు వస్తాయి. Gopala Krishna Rao Pantula వంటివారి “ అన్నిటికీ ఆంగ్లేయులను ఆడిపోసుకోనక్కర లేదు. ఆత్మవిషయంలో మనవాళ్ళకి రక రకాల అభిప్రాయాలు .పిల్లలు పిండాలు పెట్టక పోతే తల్లిదండ్రుల ఆత్మలు క్షోభిస్తాయనడం పున్నామ నరకాలూ -ఇవన్నీ ఏమిటి?ఆత్మ శాంతించడం ఉండక పోతే క్షోభించడం కాని నరకం అనుభవించడం కాని ఎలా ఉంటాయి?” ...వంటి ప్రశ్నలు RIP వంటి క్రైస్తవ దీవెనల సమర్థన వస్తాయి.
ఆత్మ వస్తువు ఒకటే. అదే పర బ్రహ్మము, సృష్టిలో అదే పరమాత్మగా విశ్వవ్యాపి అయింది. ఇక మనిషిలో జీవుడు, సహజంగా పరమాత్మ వస్తువు, దేహాత్మ భావన అనేఅజ్ఞానంలో ఉంటాడు. దానివలన దేహసంబధమైన వాసనలు మరణానంతరము జివుని అచ్చాదించి ఉంటాయి. మరణ బాధ అనుభవించిన జీవుడు దహన జనిత తాపముతో, ఆర్తితో పితృలోకం వైపు ప్రయణంచేస్తుంది. దానికి మరణానంతరం జరిపే కర్మ కాండలు. కాలంలో ఈ బంధం నశించిపోతుంది.పునర్జన్మ కర్మ ఫలంగా వస్తుంది. గరుడ పురాణము వంటి గ్రంథాలలో ఈ లోకాల వర్ణనలు ఉంటాయి. RIP వేరు. అకడ ఈ వ్యధలతో కూడిన జీవుడు సమాధిలో శవపేటికలో judgment dayవరకు బంధింపబడిఉంటాడు. తరువాత శాశ్వత నరకమో స్వర్గమో లభిస్తుంది. మన స్వర్గ నరకాలు జీవుని ప్రయాణంలో transit halts. మన జీవుల ప్రయాణం వేరు, అబ్రహామిక్ మతాలవారి అభిప్రాయాలు వేరు. RIP సమాధి చెరసాలలో బంధింపబడిన జీవులకు దీవెన. శ్రాద్ధ కర్మలు గతిలోని జీవులకు సద్గతి కలిగిస్తాయి.

No comments:
Post a Comment