Sunday, January 21, 2018

పంప పొన్నలను తెలుగు వాళ్ళు అని ఎందుకు చెప్పలేము?

పంప పొన్నలను తెలుగు వాళ్ళు అని ఎందుకు చెప్పలేము? కావాలంటే మనము కవులచరిత్రలో ఇతరభాషలలో వ్రాసిన తెలుగు కవులుగా వారిని వర్ణించుకోవచ్చును. కన్నడములో జ్ఞాన పీఠ బహుమతి వచ్చిన రచయితలందరి మాతృభాష కన్నడం కాదు. ద.రా. బేంద్రే మహారాష్ట్రుడు. మాస్తి వేంకటేశ అయ్యంగారు తమిళుడు. గిరీష్ కార్నాడ్ కొంకణీ సారస్వత బ్రాహ్మణుడు. వాళ్ళందరూ కన్నడ రచయితలు గానే గుర్తింపబడతారు. కృష్ణదేవరాయలు తెలుగులో వ్రాసిన తుళు భాషీయుడు కావచ్చును.

https://www.facebook.com/vallury.sarma/posts/507975469239871

వెలనాడు, వేగినాడు, ములికినాడు, తెలగాణ్యము, కాసలనాడు, పాకనాడు - ఈ పేర్లు ఇంకా తెలుగు బ్రాహ్మణకుటుంబాలలో మిగిలి ఉన్నాయి. ఇవి తెలుగుదేశములో ప్రాంతాల పేర్లు. వెలనాడు అంటే కృష్ణానదీతీర ప్రాంతాలు (చందవోలు, గుంటూరు జిల్లా). వేగినాడు అంటే కృష్ణా గోదావరీ మధ్య దేశంలోని తీర ప్రాంతాలు (ఏలూరు). ములికినాడు కడప, ప్రొద్దుటూరు నుండి మైసూరు వరకు గల రాయల సీమ ప్రాంతాలు, తెలగాణ్యం, తెలంగాణాలోని కొంత ప్రాంతము. కాసల నాడు కూడా తెలంగాణాలోని కరీంనగర ప్రాంతము. పాకనాడు - కృష్ణానది నుండి నెల్లూరువరకు గల తీరప్రాంతం. ఇప్పుడూ ఈ శాఖలు రాష్ట్రమంతా వ్యాపించి ఉండడం అప్పటి బ్రాహ్మణ సమాజం సంచారాలు చూపిస్తుంది. ఇప్పటి బ్రాహ్మణ సమాజం గమ్యం ధ్యేయం, నగరాలమీదుగా పాతాళలోకం (అమెరికా). (మనది భూగోళంలో ఊర్ధ్వలోకం అనుకుంటే వారిది అధోలోకమే కదా! పూర్వం వామనుడు బలిని మాయా (Maayan) నాగరికతను స్థాపించమని అమెరికా పంపేశాడు అనుకుందాం.!!!)
రాజ రాజ నరేంద్రుడి తరువాత బాదామి, జైన మతం ప్రాధాన్యం తగ్గిపోయినది. రాజరాజ నరేంద్రుని తండ్రి విమలాదిత్యుడు. తల్లి కుందవ, చోళరాజు రాజ రాజ చోళుని కుమార్తె. రాజ రాజ చోళుని కుమారుడు రాజేంద్రచోళుడు. అతనికుమార్తె అమ్మంగదేవి. రాజరాజ నరేంద్రుని భార్య. "ఆలి వంక వారు, ఆత్మ బంధువులైరి" అని వేమన్న చెప్పినట్లు, తూర్పు చాళుక్యులు, చాళుక్యచోళులైనారు. కన్నడం ప్రభావం తగ్గి తమిళ ప్రభావం పెరగడం మొదలైనది. రాజరాజ నరేంద్రుని కుమారుడు కులోత్తుంగచోళుడు అనేపేరుతో తంజావూరు కేంద్రంగా విశాల చోళసామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. ఆంధ్రదేశం కొన్నాళ్ళు అరాచకమై, చిన్న చిన్న రాజ్యాలుగా అయింది. భారత రచన పునః ప్రారంభానికి 200 సం. పట్టినది. ఈ మధ్యలో శైవమతం బౌద్ధాన్ని పూర్తిగా తుడిచిపెట్టివేసినది. దీనికి కారకుడు మల్లికార్జున పండితారాధ్యుడు. నన్నెచోడుడు, యథావాక్కుల అన్నమయ్య తరువాత పాల్కురికి సోమనాథుడు వీరందరినీ శివకవులు అంటారు. ఈ శివకవులని పోషించింది ఓరుగల్లు కాకతీయులు, వెలనాటి చోళులు. చందవోలు వెలనాటి చోళుల ఒక కేంద్రం.
తూర్పు చాళుక్యులు శైవాన్ని అవలంబించిన తరువాత కట్టించిన రెండు ప్రముఖ శివాలయాలను తలచుకుందాం. రెండుచోట్లా దేవుడు భీమేశ్వరుడే. ఒకరు దక్షారామ (ద్రాక్షారామ) భీమేశ్వరుడు. రెండవవారు భీమారామ (సామర్లకోట) భీమేశ్వరుడు. ఈ రెండూ పంచారామ క్షేత్రాలలోనివి. భీమ అంటే భయంకరుడని, హరి, హరుల కిద్దరికీ వర్తిసుంది. దక్షారామం, శ్రీశైల, కాళేశ్వరాలతోబాటుగా ఆంధ్రదేశానికి త్రిలిఙ్గ దేశమనే పేరు ఇచ్చిన ఆలయం. దక్షుడు యజ్ఞం చేసిన స్థలం. దక్షిణ కాశీ గా భావించి, అగస్త్యుడు దర్శించిన స్థలం. ఇప్పటి దేవాలయం కట్టించినది తూర్పు చాళుక్యరాజు చాళుక్యభీముడు-1 (10వ శతాబ్దం ). మల్లికార్జున పండితారాధ్యుని తల్లి గౌరాంబ, తండ్రి భీమన్న.ఈ ఆలయ ప్రధాన అర్చకుడు. చాళుక్యభీముడు సామర్లకోట ఆలయంకూడా నిర్మించాడు.
వెలనాడు - చందవోలు – Chandolu – India – Then and Now
వేయి సంవత్సరాల చరిత్ర కలిగి, రాజమండ్రి తరువాత చారిత్రక ప్రాధాన్యంకలిగిన వెలనాటి సీమలోని చందవోలు గురించి వ్రాద్దామనుకున్నాను. వెలనాడు అన్న పేరుపై ఒక కథనం. మొదట ఇది ఆరువేలనాడు. ఇక్కడి ఆరువేల బ్రాహ్మణకుటుంబాలలోని వ్యక్తులను ఆరువేల గ్రామాల కరణాలుగా నియోగించారట. ఆరువేల నాడు వెలనాడయింది. పాలకులు, ప్రజలు వెలనాటి వారయ్యారు. ఈసీమకు కేంద్రం చందవోలు. పూర్వపు పేరు ధనదవోలు, లేక సనదవోలు. ధనద (ధనమును ఇచ్చేది) సనద (ఫలాన్ని ఇచ్చేది.) సనద వాడుకలో చనద అయింది. (ఇది తెలుగులో సామాన్యం.) అదే చందవోలు, నేటి చందోలు.
ఇది ఒక చిన్నగ్రామం. గుంటూరుజిల్లా. పొన్నూరుకు సమీపం. పిట్టలవాని పాలెం మండల్. ప్రస్తుతం ముస్లిములు అధికంగా కల గ్రామం. ఐదు మసీదులు, నాలుగు దేవాలయాలు ఉన్నాయట. ఒక మదర్సా, ఒక వేదవిద్యాలయం, ఒక కాలేజీ, బియ్యపు మరలు, ఎండుచేపల విపణి కూడా. (చర్చిల సంఖ్య చెప్పలేదు. కాని క్రైస్తవ సమాధుల స్థలం పటములో గుర్తింప బడినది.) ఈగ్రామానికి 400 సం. చరిత్ర ఉన్నది. అది కృష్ణరాయల కాలంలో ఒక రహదారుల కూడలి. వ్యాపార కేంద్రం. వేయి సంవత్సరాలనాటి శివాలయం, చిన్నకేశవ స్వామి ఆలయం ఉన్నాయట. (400 యేళ్ళ చరిత్ర, 1000 యేళ్ళనాటి గుడులు!) ఈ ఊరిలో అనేకులు భారత సైన్యంలోనూ, యువకులు అనేకులు Software Engineers గాను పనిచేస్తున్నారు. (ఇంగ్లీషు వికిపీడియా)
వెలనాడుగా పిలువబడ్డ కృష్ణా తీరం నుండి, విక్రమసింహపురి (నెల్లూరు) వరకు గల దేశాన్ని వెలనాటి చోళులు పాలించేవారు. వీరు చోళ ప్రభువులకు సామంతులు. క్రీ.శ. 1228 నాటికి కాకతి గణపతిదేవ చక్రవర్తి వెలనాటిని పూర్తిగా జయించి, ధనదపురం లోని సంపదను ఏకశిలా నగరానికి తరలించాడు. ఇక్కడి రాజైన రెండవ గొంకని పుత్రిక మైలమాదేవిని (మైలాంబ) హైహయ వంశీయుడైన అనుగురాజు పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళికి కట్నంగా పొందిన పలనాటి సీమను, అనుగురాజు గురజాల రాజధానిగా పాలించేవాడు. అనుగురాజు వారసుల మధ్య తలెత్తిన కలహాలే పల్నాటి వీర చరిత్రగా ప్రసిద్ధమయ్యాయి. ఈ పల్నాటి యుద్ధంలో చందోలు ప్రభువులు నలగామరాజు పక్షం వహించారు. పల్నాటి వీర చరిత్రకు మహాభారతానికి పోలికలున్నాయి. దాయాదుల మధ్య పోరు, వ్యసనాలు, అజ్ఞాతవాసాలు, అభిమన్యుడు బాలచంద్రుల సామ్యం వంటివి సమానమే.అందుకే పల్నాటి వీర చరిత్రను ‘పల్నాటి భారతం’ అంటారు. ఈ ద్విపద కావ్యంతో ప్రౌఢకవి, పండిత కవి అయిన శ్రీనాధుడు ప్రజాకవి అయ్యాడు. బాలచంద్రుడు అంటాడు: (ద్వా.నా.శా, ఆంధ్రభూమి)
బ్రహ్మాండములబట్టి బంతులాడుదును
మృత్యుదేవతనైన మెదిపి వేసెదను
బాలుడనని నన్ను భావింపవలదు
చిన్న మిరియమునందు చెడునె కారంబు?’’
మంచన కవి రచించిన కేయూర బాహు చరిత్రములో ధనదవోలు ప్రస్తావన ఉంది. ఆ గ్రంథంలో ఈ పట్టణ వర్ణన ఇలా ఉంది.
పుష్పక నివహంబు భూమిపై నిలిచిన | యట్లందమైన దేవాలయములు
రూపొయాచలము బహురూపముల నటించు | రమణ శోభిల్లు స్సౌధముల పెల్లు
అలకాధిపతి నిధులన్నియు వెలివీట | విడిసేన క్రియ బణ్యవీధికలును
ధాత మేదిని మిన్నుదఱిగివైచినమాడ్కి| గనుపట్టు బహు తటాకముల సొంపు
నుపవనంబులు సరసులు నొప్పుచేయు | చెఱకుదోటలు బ్రాసంగుచేలు మెఱయ
నఖిల విభవంబులకు నెలవగుచు వెలయు | ధనదుపురమున కెనయన ధనదుపురము
(తెలుగు వికిపీడియా)
850 సంవత్సరాలక్రితం చందవొలులో జరిగిన ఒక సంఘటన నేటికీ మతరాజకీయాలలో ప్రస్తావించబడుతూంది. వివరాలు రేపు.
జాజి శర్మ కానీ, రాయలవారు, తనను తెలుగువాడిగానే అభివర్ణించుకుని, "దేశభాషలందు తెలుగు లెస్స" అన్నారు.
Vvs Sarma తెలుఁగ దేల యెన్న దేశంబు దెలుఁగేను
తెలుఁగు వల్లభుండఁ తెలుఁగొకండ
యెల్ల నృపులు గొలువ నెరుఁగవే బాసాడి

దేశభాషలందుఁ తెలుఁగు లెస్స In this poem he might be implying that he is one of Telugus as their ruler and not an outsider - not referring to what his mother talked in his childhood. His choice language is Telugu.

జాజి శర్మ ఇది బహుదశాబ్దాల నాటి పాత చర్చ. ఎంతకాలం గడిచినా ఈ చర్చ తెగడంలేదు కూడా.

శ్రీ కృష్ణదేవరాయలు ఆనాటి విజయనగరమనే ఒక పెద్ద కాస్మోపాలిటన్ రాజధానిలో బహుభాషా వాతావరణంలో పుట్టిపెఱిగిన వ్యక్తి. ఆయన తెలుగువాడని గానీ, కన్నడిగుడని గానీ ఢంకా బజాయించి చెప్పలేం. ఆయన తం
డ్రి కన్నడిగుడనీ, తల్లి తెలుగుస్త్రీ అనీ చెబుతారు. ఆయన యొక్క పెద్దభార్య/ సామ్రాజ్యపట్టమహిషి అయిన రాణీ చిన్నాదేవిగారు (శ్రీమతి కృష్ణరాయలు) నిస్సందేహంగా తెలుగుస్త్రీ. ఎందుకంటే ఆయన ఉదయగిరి (నెల్లూరు) రాష్ట్ర గవర్నరుగా ఉన్నప్పుడు ఆమె అక్కడ దాసిగా పనిచేసేది. ఆమెని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడని చరిత్రలు తెలియజేస్తున్నాయి. కృష్ణదేవరాయలు కన్నడకవుల్ని పోషించినట్లు ఆధారాలు లేవు. ఆయన స్వయంగా కన్నడంలో ఏమీ రాయలేదు. తెలుగులోనే రాశాడు. పైగా విజయనగరసామ్రాజ్యానికి తెలుగుని అధికారభాషగా ప్రకటించాడు. కనుక ఆయన పుట్టుకతో ఎవఱైనప్పటికీ మన తెలుగువాడుగానే, మనవాడుగానే మనం భావించాల్సి ఉంటుంది


Vvs Sarma I agree. This concept Telugu vaaDu is a political one. Many Telugus long settled in Karnataka, though they speak Telugu at home, give their mother tongue as Kannada. Same is true in Tamilnadu. This is to avoid controversies later, I suppose.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...