Friday, January 19, 2018

నాటి మహాభారతం - నేటి అవినీతి భారతం అన్న శీర్షికలో

https://www.facebook.com/vallury.sarma/posts/504722689565149

https://www.facebook.com/vallury.sarma/posts/505032042867547


నాటి మహాభారతం - నేటి అవినీతి భారతం అన్న శీర్షికలో, నేను వేసిన ప్రశ్నలను విశదీకరించమని మిత్రులు ఆచార్య కవన శర్మ గారి సలహా.
మొదటి ప్రశ్న - ఆనాడు ఎందుకు ఉన్నత వర్గాల ప్రజలు జైన, బౌద్ధ మతాల వైపు ఆకర్షితులయ్యారు?
రెండవ ప్రశ్న- నేటి క్రైస్తవ మతం సమాజంలో అట్టడుగు వర్గాలను మొదట ఆకర్షించింది. దీనికి, దానికి భేదమేమిటి?
వారు ఒక మూడవ ప్రశ్నను కూడా వేశారు. ఇప్పుడు బౌద్ధం ఉన్నతవర్గాల కంటె దళిత వర్గాల ప్రజలను ఎందుకు ఆకర్షిస్తూంది? బౌద్ధ మతం, కొందరు ఆధునిక చరిత్ర కారులు చెప్పినట్లు, బలహీన వర్గాలను ఆకర్షించే లక్షణములు కలిగి ఉందా?
నేటి భారతదేశంలో 20వ శతాబ్దపు మొదటిభాగములో అస్పృశ్యతనుగురించి ప్రజలలో చైతన్యము వచ్చినది. మహాత్మా గాంధీ అస్పృశ్యతను రాజకీయాలలోనికి తెచ్చిన మొదటినాయకుడు. ఆయన హిందూ మతస్తుడే అయినా జైన, వైష్ణవ సాంప్రదాయములో ఉన్నవాడు. ఈరెండు శాఖలు అస్పృశ్యతనుగురించి వర్ణాభేదాలనుగురించి ఆలోచించినవే. తరువాత కాలంలో అస్పృశ్యులుగా పరిగణించే మహార్ కులములో జన్మించిన భారతరత్న భీమరావు అంబేద్కర్ బౌద్ధమతము గురించి లోతుగా అధ్యయనం చేశారు. ఆయన చాలా రోజులు హిందూమతాన్ని వదలాలని ఆలోచించి ఇతరమతాలను అధ్యయనం చేసారు. విద్యాధికుడు, హేతుబద్ధముగా ఆలోచించగలవాడు ఐన ఆయన సహజంగా ఆనాడు మేధావి వర్గం ఆకర్షితులైనట్లే బౌద్ధమతమే, భారతీయము, తర్కానికి నిలిచేదీ ఐన మతమని నిర్ణయానికి వచ్చారు. 1956లో తన మరణానికి రెండు నెలల ముందు 1956లో 5 లక్షల దళిత అనుయాయులతో పాటు బౌద్ధమతము స్వీకరించారు. ఆయన "Who were the Shudras? - How they came to be the Fourth Varna in the Indo-Aryan Society" "శూద్రులు ఎవరు? ఎందుకు వారు భారతీయ ఆర్యసమాజములో నాలుగవ వర్ణముగా ఎందుకు పరిగణింపబడ్డారు?" అనే తన 1946లో ప్రచురింపబడిన పుస్తకములో తన కులమైన మహర్లు పూర్వము బౌద్ధులనీ, ఆమతమును వదలుకొనుటకు ఇష్టములేక హిందూ సమాజమునకు విడిగా జీవించారనే వాదనను ప్రతిపాదించారు. నాకు anthropological studies తో పరిచయంలేదు. అందుచేత ఆయన ప్రమేయాన్ని స్వీకరిస్తాను. (నిజానికి ఆయన కులస్తులు అంత వెనుకబడినవారు కాదు. శివాజీ సైన్యములో సిపాయిలుగా పనిచేసినవారు. భారత సైన్యములోకూడా మహర్ రెజిమెంట్ ఉంది. మధ్య యుగాలలో మహర్లలో హిందూ స్వాములు ఉన్నారు. 1900 ఇంపీరీల్ గెజెటీర్ లో గ్రామీణ ప్రాంతాలలో కొంత అస్పృశ్యత ఉన్నా, నగర ప్రాంతాలలో వారు భాగ్యవంతులైనారని ఉన్నది.) ఇండియాలో బౌద్ధమతము పునరుజ్జీవనానికి ఆద్యుడు అంబేద్కర్ కాదు. ఆనాడు అశోకుడు తన పిల్లలను సింహళానికి పంపి బౌద్ధ మతాన్ని వ్యాప్తిచేస్తే 1891లో అనాగరిక ధర్మపాల అనే సింహళమునుండి వచ్చిన బౌద్ధ సన్యాసి మహాబోధి సొసైటీ ని స్థాపించాడు. ఇక్కడ కూడా కొందరు అగ్రవర్ణాలవారే మళ్ళీ బౌద్ధాన్ని స్వీకరించారు. 1890 ప్రాంతాలలోనె పండిత అయోధ్యదాస అనే తమిళదేశ సిద్ధవైద్యుడు Indian Buddhist Associationను స్థాపించాడు. అతడే తమిళదేశములోని వెనుకబడిన వర్ణాలవారు మొదట బౌద్ధులనీ, శైవ, వైష్ణవాలు తిరిగి ప్రాముఖ్యత పొందడంతో బౌద్ధులను అస్పృశ్యులుగా చేశారని వాదించాడు. సింహళానికే వెళ్ళి బౌద్ధం స్వీకరించాడు. ఇక్కడ ఇంకా గమనించవలసిన విశేషాలున్నాయి. రేపు చూద్దాం. ముఖ్యంగా ఆర్య ద్రావిడ వాదం, మత మార్పిడులు, బౌద్ధ క్రైస్తవ మత ప్రచారం, దళితవాదం ఇవన్నీ 20వ శతాబ్దములో సామాజిక రాజకీయ వ్యవస్థలలో పాలు పంచుకున్నాయి.


20వ శతాబ్దంలో భారతదేశంలో ముఖ్యంగా బౌద్ధమతము గురించి చర్చించాలంటే కొందరు ముఖ్య వ్యక్తులను గురించి మాట్లాడుకోవాలి. రాజకీయ నాయకులలో దలైలామా, అంబేద్కర్, నెహ్రూ, చరిత్రకారులలో కోశాంబి, విశ్వవిద్యాలయ ఆచార్యులలో ఐలయ్య ప్రసక్తి వస్తుంది.
1. దలైలామా టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు, పాలకుడు కూడా. కరుణామయుడైన బోధిసత్త్వుడు, అవలోకితేశ్వరుని అవతారమని టిబెటన్లు భావిస్తారు. ప్రస్తుత 14వ దలైలామా 1950లో పదవినిచేపట్టారు. 1951లో చైనా టిబెట్ పై దాడిచేసి సంపూర్ణ సార్వభౌమ అధికారం పొంది ఒక ఒడంబడికకు వచ్చింది. 1959 వరకు చైనాతో ఒకలాగ నెట్టుకు వచ్చినా 1959లో ప్రాణభయంతో తన అనుయాయులతో భారత్ కు శరణార్థిగా వచ్చి హిమాచల్ ప్రదేశ్ లో స్థానం ఏర్పరచుకొన్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన టిబెటన్ బౌద్ధ మతగురువుగా ఆయన మాటలు బౌద్ధానికి ప్రమాణంగా తీసుకోవచ్చును. అహింస, మధ్యేమార్గము ప్రధానంగా కల ఆయన బౌద్ధమార్గము, మార్క్సిస్టు, మావోయిస్టు, హింసాకాండల ప్రతినిధియైన చైనాతో తలపడి తన ఆశయాలు సాధించుకునే అవకాశం కనపడదు. ఇది బౌద్ధం బలహీనత. హిందూమతమున్నంతవరకే బౌద్ధం భారత దేశంలో కూడా మనగలదు. దక్షిణకొరియాలో 1960-1990 మధ్యకాలంలో క్రైస్తవమతం బౌద్ధాన్ని తుడిచిపెట్టి వేసింది.
2. ప్రతిభ, పాండిత్యము, Scholarship, తార్కిక శక్తి ఈ విషయాలలో పోలిస్తే అంబేద్కర్ - గాంధీ, నెహ్రూలకంటె ఎన్నోరెట్లు ప్రతిభావంతుడు. అందుకే బహుశా అంబేద్కర్ వాళ్ళతో పడలేకపోయాడు. నా మూల్యాంకనం వారి గ్రంధాల పరిశీలన పై ఆధారపడింది. అవి గాంధీ - The story of my experiments with truth నెహ్రూ - Autobiography, Discovery of India అంబేద్కర్ - Buddha and his Dhamma. నెహ్రూ తనని గురించి తాను ఇలా చెప్పుకుంటాడు – “English by education, Muslim by culture and Hindu by birth. .. I have become a queer mixture of the East and the West, out of place everywhere, at home nowhere.” All roads led him to Rome.
3. దామోదర్ ధర్మానంద్ కోశాంబి (1907-1966) బహుముఖ ప్రజ్ఞావంతుడు. ఆయన పేరు గల గణిత శాస్త్రవేత్త, సంఖ్యా శాస్త్రవేత్త, మార్క్స్ వాది, చరిత్రకారుడు, సంస్కృత, పాలీ భాషలు తెలిసినవాడు.ఆయన తండ్రికూడా ప్రాచీన బౌద్ధ సాహిత్యము అభ్యసించినవాడు. ఈయన దృష్టిలో బౌద్ధమతము సమాజ రాజకీయ పరముగా కూడా విలువైన మార్గము. Buddha is a social reformer rather than a prophet or incarnation of God.
4. కంచె ఐలయ్య (1952-) ఉస్మానియాలో రాజకీయ శాస్త్ర ఆచార్యుడుగా పదవీవిరమణ చేశాడు. ఈయన పుస్తకం ఆయన సిద్ధాంతవ్యాసం పై ఆధార పడినది. దాని శీర్షిక God as political philosopher: Buddha's Challenge to Brahmanism. ఆయన ధ్యేయం హిందూమతానంతర భారతదేశం. శత్రువులు హిందూమతము, బ్రాహ్మణ కులము. ఆయన పాండిత్య ప్రకర్ష ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రస్తుత స్థాయికి సూచిక.
రాజకీయాల పైన సమాజముపైన బౌద్ధమతం దృష్టికోణం తెలుసుకోవాలంటే దలైలామా అభిప్రాయాలను ప్రమాణంగా స్వీకరించ వచ్చును. ఆయన దృష్టిలో అందరుప్రజలను సమానముగా చూచే మతప్రసక్తి రహిత ప్రజాప్రభుత్వమే శ్రేష్ఠమైనది. ప్రపంచముతో సంబంధములేకుండా, ప్రపంచంలో వస్తున్న పరిణామాలను గుర్తించకుండా, తమ ధర్మా చరణంలో తాము నిమగ్నులై ఉండటంవలననే టిబెట్ కు ప్రస్తుత దయనీయ పరిస్థితి వచ్చినదని ఆయన చెబుతారు. బుద్ధుడు చూపిన మార్గము ఇప్పటి వైవిధ్యముగల ప్రపంచములో శాంతి సాధనకు ఉపకరిస్తుందని, అది అందరు ప్రజలకు, దేశాలకు వర్తిస్తుందని ఆయన బోధ.
మార్క్స్ వాదులైన చరిత్రకారుల రచనలను నేను గుర్తించను. అందులో మార్క్స్ వాదము, బౌద్ధమతానికి అసలు పనికిరాదు. నా సిద్ధాంతం బౌద్ధ జైనాలు హిందువుల కంటె ప్రభావము కలిగిన తర్కము చేయడం వలననే గౌతమ న్యాయంపై ఆధార పడిన వైదికధర్మం పై విజయం సాధించి, పండితవర్గాన్ని, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులను ఆకర్షించ గలిగారు. శబ్దము వైదిక మతానికి ప్రమాణము. కాని బౌద్ధులకు కాదు. ఋషిప్రోక్తములైన వేదములు ప్రమాణము కాకపోతే, మార్క్స్ ప్రోక్తమైన డాస్ కాపిటల్ ఎలా ప్రమాణమౌతున్నది? “మార్క్స్ ఇలా అన్నాడు” అని ఒక మాట అంటే వారు వాదంలో ఓడిపోయినట్లే. నిజానికి ఇది గ్రీక్ లాజిక్ లోకూడా హేత్వాభాసయే (Fallacy called argumentum ad verecundiam, argument quoting authority). గణిత శాస్త్రజ్ఞులు మతములకు అవసరమైన తర్కం చేయలేరు ఎందుకంటే అక్కడ ఉపయోగించేది Deductive Logic. అది భౌతిక ప్రపంచానికి సరిపోదు. కోశాంబి, మార్క్స్ వాదులను అనుసరించిన ఐలయ్య వంటివారి వాదనలు హేతుబద్ధం కాదు.
అందుచేత నిమ్నకులాల ప్రజలు బౌద్ధానికి ఆకర్షితులయ్యారు, అవుతున్నారు అనే వాదనకు మనం అంబేద్కర్ రచననే ప్రమాణంగా స్వీకరించాలి. ఆయన పుస్తకం "బుద్ధుడు ఆయన ధర్మము" అద్భుతమైన పుస్తకం. అంబేద్కర్ తనపుస్తకమును సామాన్య ప్రజలకు అర్థమయ్యేభాషలో,వారికి వచ్చే అనుమానాలను నివృత్తిచేసే విధంగా, తత్త్వశాస్త్ర పరిభాషలేకుండా వ్రాశారు.ఆ పుస్తకములోని విషయాలు ఇవి - 1. సిద్ధార్థ గౌతముని ప్రయాణం - బోధిసత్త్వుని నుంది బుద్ధుని వరకు, జ్ఞానోదయం 2. మార్గము బోధిస్తూ తన మార్గములోనికి తెచ్చుకోనుట (Campaign of Conversion)- బ్రాహ్మణులు, క్షత్రియులు, ధనవంతులు, సన్యాసులు, సామాన్యులు, నిమ్న వర్గాలు, స్త్రీలు, దోపిడిదొంగల వంటి వారు - ఆయన మార్గమునకు అందరూ అర్హులే 3. బోధలు 4. ధర్మము, సద్ధర్మము, మతము 5. సంఘము 6. సమకాలికులు మిత్రులు, శత్రువులు, విమర్శకులు, సమర్ధకులు 7. నిర్వాణము 8. బుద్ధుని వ్యక్తిత్వము. అంబేద్కర్ బౌద్ధమతముతో ఆకర్షితుడైనది బుద్ధుని హేతుబద్ధమైన వాదనలు, బోధలకే. ఆయన అనుయాయులైన నిమ్న జాతులు అంబేద్కరుయొక్క మార్గమును అనుసరించారు అంతే. బౌద్ధమతములో వారిశాఖ హీన యానమా, మహా యానమా, వజ్ర యానమా అంటే ఇప్పటికి రాజకీయాలకు సరిపోయిన నవ యానము అని చెప్పాలి.

P Mallikarjuna Rao Sir the dalits join Buddhism today not because they find Buddha's philosophy more sound than Hinduism. The only fact that lures them is that the Buddha does not accept caste. They join Buddhism because Dr. Ambedkar did. They hardly know anything about Buddhist philosophy or thought. This is what I have learned from my interaction with them. In fact many Buddhist monks are not happy with them.
Vijayalakshmi Mandalaparthy Another important thing is Buddhism is for total abstinence from non-veg! Something which these neo-Buddhists don't care to follow! If Buddhism achieves even that one thing then it is worth it, but no!
Vvs Sarma Most Dalit Buddhists do not know anything about Buddhism They joined following Dr Ambedkar My point is he analysed the options available to him and joined Buddhism. In fact he did not study Hinduism that deeply. He only had opinions about the society and the treatment his community has got in Indian, majority Hindu society even compared to Muslims and Christians.
P Mallikarjuna Rao Not all Buddhists are meat-eaters. Many South-East Asians are vegetarians. Buddhists advance two reasons for eating meat. 1. A bikshu has no choice regarding his biksha. He should accept whatever food he is offered. He can not demand a house holder only for vegetarian food. 2. Where there is no food other than meat available, a bikshu can eat non-vegetarian food. That's the reason for the Tibetans eating meat.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...