https://www.facebook.com/vallury.sarma/posts/512032378834180
https://www.facebook.com/vallury.sarma/posts/512332198804198
https://www.facebook.com/vallury.sarma/posts/512625002108251
జాన్ మార్షల్ అనే బ్రిటిష్ పురాతత్త్వ శాస్త్రవేత్త ఉండేవారు. ఆయన 1902 నుండి 1928 వరకు భారతీయ పురావస్తు శాఖకు డైరెక్టర్ జనరల్ గాపనిచేశారు. హరప్పా వద్ద రైలు పట్టాలు వేస్తుండగా అనేక చక్కటి ఇటుకలు వేలకు వేలు దొరికాయి. ఇంత సరియైనకొలతలతో నేలలో ఇటుకలు ఎలా దొరుకుతున్నాయని అనుమానం వచ్చింది. పాపం అక్కడ కూలీలకు తెలియలేదు అవి 4000 సంవత్సరాలనాటివని. పై అధికారులకు తెలియజేయగా ఆసమాచారం వారి ద్వారా పురాతత్త్వ శాఖకుచేరింది. వారు త్రవ్వకాలు ప్రారంభించి అనేక నగరాలను కనుగొన్నారు. ఇది జరిగినది 100 ఏళ్ళ క్రితం. నేటి పాకిస్తాన్ లోని హరప్పా, మొహెంజొదారో ప్రాంతాలలో త్రవ్వకాలు జరిపించి ప్రపంచములోని ప్రాచీన నదీలోయ నాగరికతలలో అత్యంతవిశాలమైన ప్రదేశంపైవ్యాపించిన సింధునాగరికతను వెలికి తీసుకొని వచ్చినది ఆయనే. పద్మాసనంలోవలే కూర్చొని, కొమ్ముల కిరీటం పెట్టుకొని చుట్టు జంతువులతో కుర్చొని యున్న ఒక శిలా లేక లోహ ముద్రికను కనుగొన్నారు. కొన్ని సుమారు ఒక అంగుళం పొడవు, ఒక అంగుళం వెడల్పు ఉన్న రాగి నాణాల వంటివి. జంతువుల మధ్యకూర్చొన్న ఒక వ్యక్తి కనుక బహుశ పశుపతి అనిపేరున్న హిందూ దేవుని ప్రాచీన రూపమని ఆయన అభిప్రాయపడ్డారు. కొందరు అది ఒక యోగి చిత్రమన్నారు. చిత్రంపైవరుసలో ఉన్నవి వారిలిపిలోని వాక్యాలు. ఇది ఏభాషో ఇంతవరకు నిర్ధారణకాలేదు. (హరప్ప సమీపములోని లాహోరు లోని పంజాబ్ విశ్వవిద్యాలయములో ఆనాడు విఖ్యాతి గాంచిన సంస్కృతవిద్యాపీఠము ఉండేది. అక్కడనుండి వారికి ఆపేరు తెలిసిఉంటుంది. (నేటికీ అక్కడ గ్రంధాలయంలో ఉన్న ప్రాచీన సంస్కృత పుస్తకాల ప్రతులు భారతదేశంలో ఎక్కడా లేవు.) (తిరుమల రామచంద్ర గారి "హంపీనుండి హరప్ప దాకా" అనే ఆత్మకథ చదివితే ఆనాటి చరిత్ర అవగాహనకు వస్తుంది.) కొన్ని ముద్రికలమీద phallic symbols ఉన్నాయని చెప్పబడినది. కాని అలాంటి ముద్రికల చిత్రాలు నాకు ఇంటర్నెట్ లో కనపడలేదు.

Raviprem Jagannath C Western countries vallaki charitra importance mana vedhavala kante baaga telusu anduke Mohanjadharo / Harappa la daggara dorikina nagaralani thama swardhamu gurinchi alochichakunda (Railu margamu marcharu) edo oka history telusukune prayatnamu chesaru .... adhey manavallaki doriki vunte na .... gupta nidhulu vuntayemo ani motham thavvi charitrani anavallu doraka kunda naasanamu chesevaru .... .. western countries valla daggara kothaga emina dorikithe akkada gold silver articles vuntaye emito manamu prapanchaniki metallurgy nerpinavallamu, gold siver dimonds gurinchi prapanchaniki telipinavallamu mana daggara charitrika kattadala lo matti kundalu thapinchi aakala naati viluvaina vastuvulu assalu dorakavu ...ento e vichitramu .......
Vvs Sarma My exploration of history in these posts is because of a remark of Sri Nandiraju Radhakrishna about our cultural history and our present day debased condition. We are taken for a ride both by foreigners and our leaders
హరప్పా లిపి/సింధు లిపి
హరప్పావాసులు, లేదా సింధు/ సరస్వతి వాసులు 4000-5000 సం పూర్వం ఏ భాష మాట్లాడే వారు? లిపి ఏమిటి? వారి లోహ ముద్రికలపైన, శిలాఫలకాల పై ఉన్న గుర్తులు (symbols) అక్షరాలా లేక అర్థవంతమైన, సాంకేతికంగా వాడిన అంకెల, పదాల (?) @, $, &, ₹ వంటివా? ఎన్నో ఊహలు. ఇంతవరకు వచ్చిన ఏ ప్రతిపాదన బహుజన అంగీకారం పొందలేదు. వారు సత్యానికి ఎంత దూరంగా ఉన్నారోకూడా తెలియదు.
అసలు ఎన్ని ఈ ముద్రికలు, ఫలకాలు ఎన్ని దొరికాయి? సుమారు 4000. ఎక్కడ దొరికాయి? ఇండియా నుండి మెసొపొటేమియా (నేటి టర్కీ) వరకు. ఎన్ని గుర్తులున్నాయి? సుమారు 400. ఒక ఫలకంపై ఉన్న సందేశంలో ఎన్ని సంజ్ఞలున్నాయి? (5 నుండి 17 వరకు) ఇవన్నీ ఒకభాషయేనా? తెలియదు. లిపి ఒకటైతే భాష ఒకటవాలనిలేదు. ఇవన్నీ ఒకచోట చేర్చి పరిశీలించిన వ్యక్తి ఐరావతం మహదేవన్ (1930- ). ఆయన ఒక IAS అధికారి. తమిళనాడులోని ప్రాచీన శాసనాలలో వాడిన తమిళ-బ్రాహ్మీలిపి గురించి అధ్యయనం చేశారు.అంతే కాక సింధు-లిపికి బ్రాహ్మీ లిపికి ఉన్నసంబంధం గురించి కూడా పరిశోధనలు చేశారు. పూర్వం బ్రాహ్మీలిపి మధ్య ఆసియాలోని ప్రాచీన లిపియైన అరామిక్ లిపి నుండి వచ్చినదనుకునేవారు. మహదేవన్ గారి ఉద్దేశ్యం బ్రాహ్మీలిపికి మూలం సింధులిపి అని. భారత దేశంలోని అన్నిభాషల లిపులు సుమారు సా. శ.పూ 500 ప్రాంతంలో వాడుకలో ఉన్న బ్రాహ్మీలిపినుండే వచ్చాయి. బ్రాహ్మీలిపి సింధులిపికి అరామిక్ కంటె దగ్గరగా ఉన్నదని ఆయన తాత్కాలిక నిర్ణయం (tentative conclusion). సింధులిపిలో రెండు వర్ణములను గురించి ఆయన కొంత ముందుకు వేళ్ళారు . అవి తరచు వచ్చే గుర్తులే . ఒకటి బాణం లేదా శూలం గుర్తు , రెండవది ఘటం (కుండ, పాత్ర) U గుర్తు.

కనీసం రెండు, మూడూ లిపులలో అదే సందేశం ఉండి ఉంటే రోసెట్టా స్టోన్ సహాయంతో ఈజిప్టులోని ప్రాచీనలిపి అర్థంచేసుకున్నాట్లు ఇక్కడా అర్థం చేసుకునేవారు. ఉదాహరణకు കാലടി అనే బోర్డు ఉన్న బస్సు మీకు కొచ్చి బస్ స్టాండ్లో ఎదురైనదనుకోండి. మీకు మలయాళం రాదు.కానిని దానిని చూడగానే తెలుగువారికి ఆపదం మీదగ్గర ఉన్న సమాచారంతో కాలడి అని అర్థం ఐపోతుంది. కాని సింధులిపితో మీకు ఆ అవకాశంలేదు. గత కొన్ని సంవత్సరాలుగా కొందరు విదేశీయులు ఆ సంకేతాలు ఒకభాషలో అక్షరాలు పదాలు కానేకావు, అవి రేఖా చిత్రాలు, వేటికో సంకేతాలు అంతే అనికూడా చెబుతున్నారు. వారి లెక్కప్రకారము సింధు ప్రజలు నిరక్షర కుక్షులు. అది లిపికాదు అనిచెప్పే వ్యక్తులలో హార్వర్డ్ సంస్కృతం ఆచార్యుడు మైకేల్ విట్జెల్ కూడా ఉన్నాడు. ఈయన వేదాల వద్దమొదలు పెట్టి, ఇతిహాసాలు, పురాణాలు, భాషాశాస్త్రం, చరిత్ర, సామాజిక శాస్త్రం, పురావస్తుశాస్త్రం, సింధు లిపి, సామాజిక శాస్త్రము, కట్నాలు, వరకట్న హత్యలు,.. (నేను ఇంకా అనేకం వదలి ఉండవచ్చును.) భారతదేశం గురించి తాను మాట్లాడినదే వేదమంత ప్రామాణికమనుకుంటాడు. ఆయనతోనే నీకు హిందూమతద్వేషమని ఎవరో అనగా చరిత్రను అసత్యంచేసే వారంటే నాకు ద్వేషమని చెప్పాడు. చరిత్రను గురించి ఈయనకు ఏమీ తెలియదని ఈ ఒక్క వాక్యమే నిరూపిస్తుంది. ఈయనను అందలమెక్కించే, ఈయన వ్యాసాలు ప్రచురించే హిందూమత ద్వేషియైన భారతీయ వార్తా పత్రిక "ద హిందూ".
సింధు నాగరికత
మనం సింధు నాగరికత, ఆర్య (సనాత ధర్మ) నాగరికతలను, సంస్కృతులను గురించి పరిశీలనగా చూస్తున్నాం. ప్రాచీన చరిత్ర ఎలా తెలుస్తుంది? భవిష్యత్తు తెలియనట్లే, భూతకాలం కూడా పూర్తిగా తెలియదు. అనంత కాలచక్రంలో ఒక వ్యక్తి, ఒక రాజ్యం, ఒక దేశం, ఒక నాగరికత ఇవన్నీ అశాశ్వతాలే. నాలుగు, ఐదు వేలఏళ్ళ నాటి సింధు నాగరికత ను గురించి నూరేళ్ళ క్రితం వరకు మనకు ఏమీ తెలియదు. పురాతత్త్వ శాఖ త్రవ్వకాల, మరియు పరిశోధన వలన అవి ఉన్నట్లు తెలిశాయి, కొన్ని ప్రాచీన వస్తువులు బైట పడ్డాయి. వాటిని గురించిన మన ఊహాపోహలే చరిత్ర. "శైవమతం ఎట్లా సింథు ప్రజల/ మూలవాసుల వారసత్వం అయింది?" అనే ప్రశ్న అర్థంలేని ప్రశ్న. వేదాలలోకూడా శైవ, వైష్ణవ మతాల ప్రసక్తి లేదు. ఇవి తక్కువ చరిత్రగల మతాలు. తరువాత ఎప్పుడో మనం సృష్టించుకున్నవి. అసలు సింధు ప్రజలకు మతమనేది ఉన్నదా? ఆ మతం యొక్క భావాలు ఏమిటి? మనకు తెలియదు. దేవుడు ఉన్నాడా? దేవుని గురించిన ఊహలు ఉన్నాయా? కావచ్చు. వాళ్ళ ఫలకాలలో చిత్రించినవి వారిదేవుని ఆకారాల గురించిన ఊహలు కావచ్చు. లేదా వారు అడవులలో చూచిన జంతువులు కావచ్చు. వారు చూచిన జంతువులకు ఊహలుజోడించిన ఏకశృంగ అశ్వము (unicorn) వంటివి కావచ్చును. లిపిని, భాషని అర్థం చేసుకోగలిగితే కొంత విషయం తెలుస్తుంది. సింధు లిపిని, చైనా లిపితో కూడా పోల్చి కొన్ని పోలికలున్నాయని అన్నారు. సింధు ప్రజలని మూల వాసులు అనడంలో ఉద్దేశ్యం ఏమిటి?
మరి వారిని గురించి మనకు రూఢిగా తెలిసినవి యేమిటి? - ప్రత్యక్షంగా కనపడేవి వారి గృహనిర్మాణం, వారి పట్టణ నిర్మాణ ప్రణాళిక (Town Planning), వారి మురుగు కాలువల పద్ధతి (drainage), నిర్మాణంలో సరియైన కొలతలుగల, కాల్చిన ఇటుకలు ఉపయోగించడం వంటివి. వారి వ్యవసాయ ఉపకరణాలు, ఆయుధాలు కనబడ్డాయి. పాలనా విధానం తెలియదు. అనేక శతాబ్దాల శాంతియే ఉండి ఉండవచ్చు. ఉన్నట్లుండి ఒక వంద సంవత్సరాలలో ఆ నాగరికత ఎలా నశించి పోయింది? సింధు నాగరికత పై పరిశోధించే నిపుణులందరిదృష్టిలో అప్పటికి ఆర్యులు భారతదేశం రాలేదు. వాళ్ళు ఇండో-ఇరానియనులు. (ఈ రెండూ చరిత్రకారుల పద ప్రయోగాలు).
మోనియర్ విలియంస్ సంస్కృత నిఘంటువు చూస్తే పాశ్ఛాత్యుల అయోమయ స్థితి ప్రత్యక్షంగా కనుపిస్తుంది. ఆర్యుడు = 1. శ్రేష్ఠుడు, మాననీయుడు. 2. స్వధర్మాన్ని పాటించేవాడు. 3.మధ్య ఆసియా నుండి ఆర్యావర్తానికి వలస వచ్చిన జాతి ( of the race which immigrated from Central Asia into आर्यावर्त ) ఈ మూడో అర్థం ఎలా వచ్చింది? ఈయనకు చరిత్ర ఎందుకు కావలసి వచ్చినది? ఈయనే ఆర్యావర్తానికి ఏమి అర్థం వ్రాశాడో చూద్దాం. Aryaavarta = abode of the noble or excellent ones, the sacred land of the Aryans (N. of Northern and Central India) . చరిత్రకారులకు ఈ ఆర్యులు ఎందరు, ఎప్పుడు, ఎక్కడనుండి, ఋగ్వేదం పట్టుకొని వలస వచ్చారో తెలియదు. తిండిలేక పొరుగుదేశానికి వలసపొయే సంచారజాతి, సంస్కృతంలో ప్రకృతి శక్తులను గురించి కవిత్వాలు ఎందుకు వ్రాస్తున్నారో తెలియదు. ఇది మన చరిత్ర స్వరూపం.
మరి సింధునాగరికత చరిత్ర ఎప్పటికీ తెలియదా? బ్రహ్మ జ్ఞానము అన్న మాట వింటాము. మరి విష్ణుజ్ఞానము ఉండదా? నాకు తెలిసి ఇంతవరకు భూమిమీద విష్ణుజ్ఞాని ఒక్కరే పుట్టారు. భగవదవతారమూర్తియైన శ్రీకృష్ణుడు. విష్ణువు అంటే సృష్టికర్త, సృష్టిలో ప్రతి అణువులోనూ వ్యాపించి ఉన్నాడు. ఆయన జ్ఞానమంటే సంపూర్ణ ప్రపంచజ్ఞానము. ఒక శాస్త్రములో Ph.D.చేసినవారికి అది ఉండదనే చెప్పాలి. అందుచేత చరిత్రలో ఎం.ఏ. చదివి రోమిలా థాపర్ వంటి వాళ్ళదగ్గర Ph.D. చేస్తే సింధునాగరికత అ,ఆ,ఇ,ఈ ..లు తెలియవు. సింధు నాగరికత కాలం సా.శ.పూ. 3000-1500 పూర్తిగా మహాభారత యుద్ధం తరువాత కాలం. “ఋగ్వేదం సా.శ.పూ. 1800 లో నాగరికులుకాని ఆర్యులనే సంచారజాతులు తెచ్చారు. 200 ఏళ్ళకు ఒకవేదంచొప్పున మెల్లిగా బుద్ధుడు పుట్టే ముందు అన్నివేదాలు వ్రాశారు. రామాయణం, మహాభారతం, పురాణాలు ఇంకా తరువాతవే” అన్న మాక్స్ ముల్లర్ వంటి క్రైస్తవ మిషనరీల ఊహలు నమ్మితే సింధునాగరికత గురించి అర్థం కాదు. కృష్ణుడు గోపాలురతో జీవించాడు. బలరాముడు నాగలి, రోకలి పట్టుకుని వ్యవసాయం చేశాడు. మథురలోని యమున నుండి పంజాబులోని సింధు/ సరస్వతి వరకు కాలువల నిర్మాణం చేశాడు. పురాణాలు రాముని నుండి కృష్ణుని వరకు, అక్కడినుండి మౌర్యుల వరకూ రాజవంశాల చరిత్రను గుర్తించాయి. వీనిలో అతిశయోక్తులు, అసంబద్ధాలు ఉండవచ్చును. కాని సాహిత్యమును వదిలేస్తే చరిత్రకు ఆధారాలే ఉండవు. భాషా శాస్త్రము (Linguistics) కావాలి. కంప్యూటర్స్ కావాలి. కంప్యూటర్స్ సహాయంతోటే భారతయుద్ధ కాలం తెలిసినది. సరస్వతీ నది ఉనికిని ఒప్పుకోవాలి. ఇది ఉపగ్రహ చిత్రాలతో సాధ్యం. ఆ ప్రయత్నాలు ఇప్పుడు అమెరికాలో మొదలయ్యాయి. 2010 లో కంప్యూటర్ జర్నల్ లో సింధులిపి ని గురించిన పరిశోధనలు ఉన్నాయంటే నమ్మగలరా? వెబ్ లో దొరుకుతుంది చూడండి. ఇది ఒక ప్రయత్నం. ఇంకా ఎన్నోకావాలి. (Probabilistic Analysis of an Ancient Undeciphered Script (Indus Script) Invited Paper by Rajesh P.N. Rao, University of Washington, IEEE Computer April 2010).

No comments:
Post a Comment