Sunday, January 21, 2018

చందోలు శాస్త్రి గారు

https://www.facebook.com/vallury.sarma/posts/508526335851451

చందోలు శాస్త్రి గారు 
నరసింహ శర్మగారికి కృతజ్ఞతలు.
ఈ కాలంలో చందవోలును గురించి మాటలాడితే చందోలు శాస్త్రిగారిని తప్పక స్మరించుకోవాలి. ఆయన చరిత్ర భారత చరిత్రలో ఇంకొక ప్రత్యేకలోకానికి (a different plane) సంబంధించినది.దానికి ఒకవాక్యం చాలదు. కలియుగంలో కృష్ణుడు మైత్రేయ మహర్షిద్వారా ధర్మసంరక్షణార్థం ఏర్పాటుచేసిన ఒక సద్గురువ్యవస్థ కొంత అజ్ఞాతంగా పనిచేస్తునే ఉంటుంది. మహాత్ములు త్రైలింగ స్వామి, లాహిరి మహాశయులు,రామకృష్ణ పరమ హంస, రమణ మహర్షి, జిల్లేళ్ళమూడి అమ్మ - ఇలాంటి వారి సరసకు చేరే వ్యక్తి చందోలు శాస్త్రిగారుగా పిలువబడే సిద్ధ యోగి పుంగవులు, బాలా త్రిపుర సుందరీ మంత్ర మహాయోగి, శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు (1896-1990). ’నాకోసం మీరు కంచి కి ఇంత దూరం రావలసిన పని లేదు .చందోలు లో లలితా త్రిపుర సుందరీ ఉపాసకులు తాడే పల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారున్నారు కదా !ప్రతి గురువారం వారిని దర్శించండి ‘’అని కంచి కామకోటిపీఠ పరమాచార్యులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరయతీంద్రుల వారు చెప్పారు అంటే శాస్త్రి గారి యోగ సిద్ధి మహిమ ఎంతటిదో మనకు అర్ధమవుతుంది. ఆలాంటి యోగిపుంగవులు మన నేలమీద నడవటమే నేటి భారతదేశపు రక్షణ కవచం. మన అదృష్టం

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...