Sunday, January 21, 2018

మల్లికార్జున పండితారాధ్యుడు (క్రీ. శ. 1160 ప్రాంతాలు ) -- శైవం – బౌద్ధం


మల్లికార్జున పండితారాధ్యుడు (క్రీ. శ. 1160 ప్రాంతాలు ) -- శైవం – బౌద్ధం


మల్లికార్జున పండితారాధ్యుని తల్లి గౌరాంబ, తండ్రి భీమన్న, దక్షారామ భీమేశ్వరాలయం ప్రధాన అర్చకుడు. అప్పటికే చాళుక్యభీముడు దక్షారామ భీమేశ్వరాలయం కట్టించి 150 సం. పైన అయింది. మల్లికార్జున పండితారాధ్యుడు స్మార్తుల ఇంట పుట్టి, కోటిపల్లి ఆరాధ్యదేవునివద్ద శివదీక్షతీసుకున్నాడు. శైవ సాహిత్యమంతా ఆకళింపు చేసుకొని నకులీశ పాశుపత దర్శనాన్ని అధ్యయనంచేసి, మల్లికార్జున పండితారాధ్యుడు శతక రచనకు మార్గదర్శకుడై శివతత్త్వసారమనే శతకాన్ని రచించి ప్రథమాంధ్ర శతకకర్తయనే గౌరవము పొందియున్నాడు . ఈ శతకములో కొన్ని వందల పద్యములన్నాయి. ఇందు అజా, మహేశ, శివ, సర్వానంద అనే మకుటములు కానవస్తాయి. పరమేశ్వరుని నిజస్వరూపమును నారాయణుడు, బ్రహ్మ మొదలైనవారే వర్ణించలేనపుడు, నేనెట్లు నిరూపింతునని కవి ఈ విధంగా వచించినాడు.
శ్రీ పతి వాక్పతి ముఖ్య మ
హా పురుషులు నెఱుగ నోప రతి వాఙ్మానస
వ్యాపారమైన నీ నిజ
రూపము నేనెట్టిదని నిరూపింతు శివా.
వీర మహేశ్వర మార్గమును అనుసరిస్తూ శైవ మత ప్రచారానికి దేశ సంచారం ప్రారంభించాడు.
ఆయన దక్షారామం వదలి వెలనాడు ముఖ్య పట్టణం చందవోలుకు వచ్చాడు. అప్పుడు చందవోలు కవి పండితుల నిలయం. అక్కడ రాజ సభపేరు బ్రహ్మ సభ. అక్కడ ఆస్థానంలో ఉన్నది బౌద్ధపాదాచార్యుడని రాజగురువు. బహిరంగ వాదోపవాదాలతో బౌద్ధుని ఓడించారు. ఇంతవరకు ఇది సత్యం. ఈ సంఘటన జరిగినది ఆది శంకరుల అవిర్భావానికి శతాబ్దాల తరువాత. వాదంలో బౌద్ధులు గెలిచే అవకాశమేలేదు. హిందూ తర్కం బౌద్ధతర్కం స్థాయిని ఎప్పుడో మించింది.
కాని కొన్ని కథలు ప్రచారంలోకి వచ్చాయి. వాదంలో ఓడిన తరువాత బౌద్ధుని శిష్యులు ఈయన బృందాన్ని ఆవమానం చేసి, పూజా ద్రవ్యాలను అపహరించారనీ, ఈయన శిష్యులు వాళ్ళమీద తిరగబడి వారిని చంపారనీ, దానికి శిక్షగా ఈయన కన్నులు రాజు పెరికించివేశాడనీ కథలు ప్రచారమయ్యాయి. ఈ కథలను చెబుతూ శైవులు ఆరాజు బౌద్ధుల ప్రొత్సాహం వలననే మల్లికార్జున పండితుని శిక్షింఛాడనీ, దానికి ఆయన రాజుని శపించి అమరావతి వెళ్ళి అమరేశ్వరుని ప్రార్థిస్తే ఆయన కన్నులు తిరిగివచ్చాయనీ చెబుతారు. Miracles గురించిన సత్యాసత్యాలను చరిత్రపరంగా చెప్పలేము. ఇవి మహనీయుల సమక్షంలో జరుగుతాయన్నది సామాన్య విశ్వాసం, లేక కొద్దిమంది సమీపవర్తుల ప్రత్యక్షానుభవం. ఎందుకంటే ఈయన తరువాత చందవోలు వదలి అమరావతి, ఓరుగల్లు, శ్రీశైలం మీదుగా బసవేశ్వరుని కలుసుకోవడానికి కర్ణాటక రాజ్యం వెళ్ళిన సమాచారం సత్యం. ఆయన కర్ణాటక రాజ్యం చేరినప్పటికి బసవేశ్వరుని మరణ వార్త వస్తుంది.
ఈ కథలు ఇప్పుడుకూడా మత రాజకీయాలకు వాడబడుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రదేశంలో అంబేద్కర్ అనుయాయులైన కొందరు దళితుల వలన బౌద్ధం ప్రచారంలోనికి వస్తూంది. వారికి ఒక శ్రీలంక బౌద్ధబిక్షువు ఇచ్చే ఉపదేశమిది. మన దేశంలోని మతశక్తులన్నిటిలో విదేశీ శక్తుల హస్తం ఉంటుంది. Ven. Bhikkhu Vinayarakkhita of SRI LANKA writes in his website (BUDDHISM IN ANDHRA PRADESH)
http://www.metta.lk/english/buddhism-ap.htm while writing about the Buddha statue in Hussain Sagar, Hyderabad.
The aggressive and often violent campaign is exemplified by the conduct of the Veera Saiva proponent, Mallikarjuna Panditaradhya, who after losing a debate to Buddhist monk in the court of chandole conspired and got them killed and destroyed their places of worship. Panditaradhya's aggressive campaign almost wiped out Buddhism, in the Andhra country. Earlier Kumarila and Shankara carried on virulent crusade against Buddhism.
నలుగురు శిష్యులతో వాదానికి వెళ్ళిన పండితుడు, ఆస్థానంలోని బౌద్ధమతచార్యుల శిష్యులను చంపి పూజా స్థలాలను విధ్వంసంచేయడం ఊహింపలేని విషయం. ఆయన సేనతో చందవోలు దండయాత్రకు రాలేదు.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...