Thursday, January 18, 2018

ఒక నాదం. ఒక ధ్వని, ఒక శబ్దం, ఒక వర్ణం, ఒక పదం, ఒక అర్థం, ఒక భావన, ఒక పదార్థం . ఇది భారతీయ ఆలోచనా విధానపు మార్గం. పాశ్చాత్య ఆలోచనా విధానం ఒక పదం, ఒక వాక్యం, దాని సత్యాసత్య విచారణ వద్ద ప్రారంభమవుతుంది. మనం నాద బ్రహ్మ అంటే వాళ్ళు దేవుని వాక్యము అంటూ మొదలుపెడతారు.

మనము ఆలోచనల గురించి మాట్లాడినప్పుడు "ఆలోచనల స్థానం ఏది?" అన్న ప్రశ్న వస్తుంది. మనస్సు, లేక ఇంగ్లీషులో Mind అని చెబుతాము. తెలుగు మనస్సు, ఇంగ్లీషు మైండ్ ఒకటికాదు. Mind ని తెలుగులో ఏమనిచెప్పాలి? సందర్భమును బట్టి తెలుగు పదం చెప్పాలి. కొన్ని అర్థాలు - మనస్సు, బుద్ధి, చిత్తం,కోరిక, ఇచ్ఛ, మతి, అభిప్రాయము, జ్ఞాపకము, స్మరణ. ఇంగ్లీషులో మైండ్ క్రియాపదం కూడా (నెవర్ మైండ్) ఇంగ్లీషులో ఇంకా సరిగా అర్థంచెప్పగలము - the element, part, substance, or process that reasons, thinks, feels, wills, perceives, judges మన మనస్సు మైండ్ లో ఒక భాగము,intellect or understanding, as distinguished from the faculties of feeling and willing; intelligence. In Psychology - Mind is the totality of conscious and unconscious mental processes and activities. ఇంగ్లీషులో Mental అంటే మైండ్ నుండి వచ్చిన విశేషణం. తెలుగు వాళ్ళ కి మెంటల్ - అంటే Mentally Sick అట! అది నామవాచకంకూడా as in "నువ్వొక మెంటల్". ఆధునిక తెలుగు వ్యాకరణం ఇంకా ఎవరూ వ్రాసినట్లు లేదు.
Nandiraju Radhakrishna "నా మనసు తెలంగాణ వైపు మొగ్గు చూపుతుంటే..నా అలోచన మాత్రం ఆంధ్రా వైపు వుంది.." డిల్లీలో ఒక పుస్తకావిష్కరణ సభలో ప్రధాని మీడియా మాజీ సలహాదారు సంజయ్ బారు నిన్న అన్నారు..

జిడ్డు క్రిష్ణమూర్తి తత్వం వివరిస్తూ శ్రీ శర్మగారు తెలుగు మనసు ఇంగ్లీష్ మైండ్ ఒకటి
కాదని తెలిపారు. ఆలొచన వేఉ మనసు వేరు అని స్పష్తం చేసారు..ఈ వాస్తవిక అంశం ఈ రోజు శర్మగారు ఎంత చక్కగా అరటిపందు వొలిచి నొటికి అందించారో గమనించారా మిత్రులారా..

" మనము ఆలోచనల గురించి మాట్లాడినప్పుడు "ఆలోచనల స్థానం ఏది?" అన్న ప్రశ్న వస్తుంది. మనస్సు, లేక ఇంగ్లీషులో మైండ్ అని చెబుతాము. తెలుగు మనస్సు, ఇంగ్లీషు మైండ్ ఒకటికాదు.మైండ్ ని తెలుగులో ఏమనిచెప్పాలి? సందర్భమును బట్టి తెలుగు పదం చెప్పాలి. కొన్ని అర్థాలు - మనస్సు, బుద్ధి, చిత్తం,కోరిక, ఇచ్ఛ, మతి, అభిప్రాయము, జ్ఞాపకము, స్మరణ. ఇంగ్లీషులో మైండ్ క్రియాపదం కూడా (నెవర్ మైండ్) ఇంగ్లీషులో ఇంకా సరిగా అర్థంచెప్పగలము" -

ఎంత సరళంగా వివరించారు. ధన్యులమండీ శర్మగారూ

మేము అచ్చంగా తెలుగు వాళ్ళము.మా పిల్లలు తెంగ్లీషు వాళ్ళు. మా మనుమలు ఆంగ్లోతెలుగులు. ఇది నగరవాసులందరి పరిస్థితి కూడా ఏమో.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...