Thursday, January 18, 2018

బారిక రాముణ్ణే

https://www.facebook.com/vallury.sarma/posts/601796409857776

Dear Friends
కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధాన్లులు నేను "బారిక రాముణ్ణే" అంటాడు. దాని అర్థమేమిటి? బారిక అనేపదాన్ని కారా మాస్టారు చావు అనే కథలో వాడారట మీకు తెలుసా? -- VVS Sarma
Reply 1. గ్రామాధికార సిబ్బందిలో బారిక ఒక హోదా. సాధారణంగా మనవైపు కరణం, మునసబు, బారిక ఉంటారు.
Reply 2. బారికవాళ్ళు సాధారణముగా మాదిగలు వాళ్ళు డప్పు తో దండోరా వేసేవాళ్ళు రాత్రిళ్ళు గస్తి తిరుగు తారు .నెరస్థులను కొరడాతో కొడతారు పూర్వం బహుశః ఉరి కూదా తీసేవారు వాళ్ళు ఒకరకం పోలీసులు కోత్వాలులు. కాటికాపరులు కుడానేమో . Brown says "he is a village watchman "

Suresh Kolichala ఇది ఒరియా/ఒడిశా భాషనుండి తెలుగు లోకి వచ్చింది. ఒరియా భాషలో బాడికి-/బారికి- అన్న పదానికి పేడ, అశుద్ధం, అంటరానివాడు అన్న అర్థాలు ఉన్నాయి. బారికి కులం ఒరిస్సాలో ఒక అంటరాని కులం పేరు. ఈ తక్కువ కులం వారు ఆంధ్ర దేశంలో కూడా తలారి వృత్తి, కావలి వృత్తి మొదలైన పనులు చేస్తూ ఉండేవారని నా ఊహ. ఒరిస్సాతోనూ, కళింగాంధ్ర తోనూ పరిచయం ఉన్న వారు మరింత సమాచారాన్ని అందజేస్తారని ఆశిస్తూ -- సురేశ్.Cheruku Ramamohanrao తలారి అన్న తెగ మా బాల్యములో వుండేది. కానీ వారిని చాతుర్వర్ణములొ ఒకరిగానే భావించి జనజీవన స్రవంతిలో నేడు కలిపివేసుకొన్నారు. కులజీవనము పోయిన తరువాత వారిలో కొందరు దొంగతనాలు చేయుట కూడా మా బాల్యములో చూసినాము. ఇది జమ్మలమడుగు(కడప జిల్లా) లో చూసిన విషయము .

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...