Friday, January 19, 2018




Yesterday I was reading a column in DAWN daily from Islamabad, in which a columnist was remembering Gorakhnath and his tradition. I thought I should recapitulate the Nath tradition to which he belongs. I shall do it tomorrow. Till then this prayer.


మధ్య యుగంలోనే భారతదేశంలో ప్రచారం పొందిన నాథ సంప్రదాయం గురించి రేపు చెప్పుకుందాము. ఇది అప్పుడు భరతదేశమంతా బహుళ ప్రచారం చెందినది. అంతవరకు ఇది.
గోరక్షనాథ స్తోత్రం - సద్గురు శివానందమూర్తి
జగదేక రక్షం, జగదేక బంధుం
శివస్వరూపం, శివావతారం,
ఇంద్రాదివంద్యం, ముముక్షుకల్పం
గోరక్షనాథం శిరసానమామి 1
హిమవన్నివాసం, హేమాద్రితుల్యం
ప్రసన్నరూపం, ధ్యానస్య ధేయం
సంసార తారం, అభయప్రదాతం
గోరక్షనాథం శిరసానమామి 2
యోగేశ్వరేశం, యోగావతారం
నిర్వాణదాతం, మోక్షస్యమార్గం
సంకల్ప సిద్ధం, మోక్షప్రదాతం
గోరక్షనాథం శిరసానమామి 3
పద్మాసనస్థం, శాంతస్వరూపం
అంతర్నివాసం, నివృత్తిదాతం
సత్యస్వరూపం, ఆనందమూర్తిం
గోరక్షనాథం శిరసానమామి 4
మత్స్యేంద్ర పుత్రం, జ్ఞానావతారం
సిద్ధస్య సాధ్యస్య, ఆరాధ్యదైవం
సన్మార్గ దర్శిం, మోక్షప్రదాతం
గోరక్షనాథం శిరసానమామి 5
యుగదోషనాశం, ధర్మస్యరక్షం
అజ్ఞాననాశం, సదసద్వివేచం
శివస్వరూపం, శివావతారం
గోరక్షనాథం శిరసానమామి 6
కామాదిరోగాని సర్వానిరోధ్య
శాంతించదాంతించ, జ్ఞానప్రదాతం
శివ స్వరూపం శివావతారం
గోరక్షనాథం శిరసానమామి 7
ఇదంస్తోత్రం సద్గురు శ్రీశివానంద ప్రణీతం
గోరక్షనాథ స్తోత్రం నామం సంపూర్ణం.


మధ్య యుగం లోని అవతార పురుషులలో మత్స్యేంద్రనాథ, గోరక్షనాథులు (గోరఖ్ నాథ్)ప్రముఖులు. వీరు యోగులు. మత్స్యేంద్రనాథుని గురించే తెలుగులో మాయా మచ్చీంద్ర అనే పేరుతో తెలుగు చిత్రాలు 1945, 1975 లలో తీశారు. మత్స్యేంద్రనాథుడు విష్ణువు అవతారమనీ, ఆయన శిష్యుడు (పుత్రుడు కూడా కావచ్చు) గోరక్షనాథుడు శివావతారమనీ భావిస్తారు. వారి మత సాంప్రదాయాన్నే నాథసాంప్రదాయమనీ, ఆ సాధువులను కాన్ ఫటా యోగులనీ పిలుస్తారు. (చెవులు కుట్టించుకోవడం వారి నుండి వచ్చిఉండవచ్చు.) వారికేంద్రస్థానము గోరఖ్ పూర్. హరిద్వారంలోకూడా వారి శాఖ ఉన్నది. నేను దానిని దర్శించాను. అక్కడ భర్తృహరి తపస్సుచేసిన కొండ గుహలో ఒక శివలింగం ఉంటుంది. గోర్ఖా అన్న పదం కూడా దానినుండే వచ్చినది. నవ నాథులు, 84 సిద్ధులు వారిలో ఉన్నారు. భర్తృహరి వారిలో ఒకరు. తెలుగు సాహిత్యములో నవనాథ చరిత్ర అనే కావ్యము ఉన్నది. దీని రచయిత గౌరన. తెలుగు అకాడమీ ఈ పుస్తకమును ప్రచురించినది. ఆంధ్రదేశములో ఉన్న నాథయోగి సిద్ధ నాగార్జునుడు. బౌద్ధనాగార్జునుడు ఈయన ఒకరేనా? అనే సందేహం ఉండేది నా ఉద్దేశ్యం వీరు వేరు వేరు, ఈయన తపోస్థానము శ్రీశైలము. ఇద్దరూ కృష్ణాతీర నివాసులే. ఈ సంప్రదాయానికి ఆదిపురుషుడు మనం చెప్పుకున్న జైన తీర్థంకరుడు ఆదినాథుడు. నాథ సాంప్రదాయము ఈ విధముగా శైవ, బౌద్ధ, జైన చరిత్రలతో కలసి ఉంది. రాజమండ్రీలో జరిగినట్లుచెప్పబడే సారంగధరుని కథ ప్రసిద్ధము. అదీ తెలుగులో చలనచిత్రంగా నిర్మించారు. రాజ రాజ నరేంద్రుడు చిత్రాంగి కథ బహుశా అక్కడి కథ కాదు. అది మాళవ దేశానికి సంబంధించినది. కాళ్ళు చేతులు పోగొట్టుకున్న సారంగ ధరుడు శివుని కరుణతో అవితిరిగి తెచ్చుకుంటాడు. నాథగురువుగా అతడిపేరు చౌరంగినాథుడు. గోరక్షనాథుడు బెలూచిస్తాన్ (పాకిస్తాన్ ) లో గొప్ప అమ్మవారి ఆలయం కట్టించాడు. ఇది కరాచీకి 250 కి.మీ. దూరంలో ఉంది. ఇది శక్తి స్థానము. దాక్షాయణి, సతీదేవి శిరస్సు పడిన స్థానము. ఈ దేవిని హిఙ్గలాజ దేవి అంటారు. ఈ ఆలయం సురక్షితంగా ఉన్నది. కాని ఇప్పుడది ముస్లిముల అధీనంలో ఉన్నది. దానిని వారు నానీ కీ మందిర్ అంటూ ఆమెకు ఎరుపురంగు వస్త్రం, సమర్పిస్తారు. హిందువులు కూడా వస్తారు. సింధురాష్ట్రంలో గోరఖ్ అనే పర్వత ప్రాంతం ఉంది. ఇది ఎడారి సమీపంలోని hill station. దీనిని గురించే పాకిస్తానీ జర్నలిస్ట్ ఒకరు తన ప్రయాణాన్ని వర్ణిస్తూ గోరక్షనాథుణ్ణి తలచుకున్నాడు. మహారాష్ట్రలొ భగవద్గీతకు యోగపరమైన వ్యాఖ్యను వ్రాసిన సంత్ జ్ఞానేశ్వర్ , అతడి అన్నగారు నివృత్తినాథ్ కూడా ఈ సంప్రదాయము వారే. షిర్దీలో సద్గురు సాయినాథుడుకూడా నాథయోగి కావచ్చును. ముస్లిములలో కొందరు సూఫీ సంప్రదాయంలోని ఫకీర్లు నాథ యోగులుగా చెప్పబడ్డారు. కర్ణాటక మంగళూరులో ఒక శివాలయం వీరిది ఉన్నది. ఇప్పటి ఆలయాలలో దక్షిణామూర్తి, కుమారస్వామి ఉండే స్థానంలో మత్స్యేంద్ర, గోరక్షనాథుల విగ్రహాలున్నాయి. ఇది కూడా నేను దర్శించినదే.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...