మనం ఈ ఆలోచనా విధానంలో తేడాలు మనం ఉపయోగించే తర్కం Logic వలన అని గమనించాం. పాశ్చాత్య విధానంలో ఒకవాక్యం. అయితే సత్యం, లేకపోతే అసత్యం అవుతుంది. అయితే పుణ్యం కాక పోతే పాపం. అయితే శత్రువు కాకపోతే మిత్రుడు. శత్రువూ, మిత్రుడూ కూడా కాని వాడు ఒకడు ఉండవచ్చు అనే ఊహ పాశ్చాత్యులకు రాదు. దీని ఫలితమే మనం ఈరోజు ఆంధ్రలో చర్చిగోడలపై చూచే రాతలు. మాతాడేపల్లిగూడెం లో ఒక చర్చి ఈ బోర్డు పెట్టింది. "యేసు క్రీస్తు నమ్మినవారిని రక్షించును, నమ్మనివారిని శిక్షించును." వీళ్ళ దృష్టిలో కరుణామయుడైన యేసుకి, నన్ను నమ్మినవారినినేను రక్షించుకుంటాను నన్ను నమ్మని హిందువులను వారి శివుడో, రాముడో కృష్ణుడో రక్షింపకపోతాడా అన్న కనీస జ్ఞానం, సహనం ఉండదా? ఇది వాళ్ళ తర్కం తెచ్చిన ప్రమాదం. దీనిని Inside the square thinking అంటారు. నాదేవుడే సత్యం. నా ప్రవక్తదే అంతిమనిర్ణయం అనే తప్పుడు భావాలకు మూలం గ్రీక్ లాజిక్ లో కనపడుతుంది. మరి మన తర్క శాస్త్రం ఏం చెబుతుంది? ప్రతి వాక్యములోనూ సంశయం ఉంటుంది. దానియొక్క సత్యాసత్యాలను అనేక ప్రమాణాలతో నిరూపించుకోవాలి. ఈ ప్రమాణాలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యక్షం, అనుమానం, ఆప్తవాక్యం (శబ్దం), ఉపమానం, అర్థాపత్తి, అనుపలబ్ధి, అభావం, ఐతిహ్యము ఇలా. ఒక దానికంటె ఒకటి బలహీనమైనవి. మన పరమత సహనానికి మూలమిదే. మన ఋషులు ఇచ్చిన న్యాయ తర్క శాస్త్రాలు. మన విశాలహృదయం కాదు. మన ఆలోచనావిధానం.
Rallabhandy Ravindranath తనని నమ్మని వాళ్లని శిక్షిస్తాను అనేవాడు దేవుడు ఎలా అవుతాడు. అంటే క్షమించే గుణం లేనివాడు మనిషే కాదు. అందుచేత ఏసుక్రీస్తు ఆ బోర్డ్ మీద రాసిన దాని ప్రకారం ......... అవుతాడు. అంటే కదా.
No comments:
Post a Comment