Thursday, January 18, 2018

ఆలోచనా విధానంలో ఇంగ్లీషు ఆలోచనా విధానం, తెలుగు ఆలోచనా విధానం, భారతీయ ఆలోచన విధానం,హిందూ ఆలోచనా విధానం, మహమ్మదీయ, క్రైస్తవ ఆలోచనా విధానాలు - ఇలా అనేక రకాలు ఉంటాయా? నిశ్చయంగా ఉంటాయి. నా వ్యాఖ్యలు అచ్చంగా తెలుగు ఆలోచనా విధానానికి కొంచెం భిన్నంగా ఉంటాయని గమనించారా? నిన్న ఇంజనీరింగ్ విద్యా విధానాలలో ఆవశ్యకమైన మార్పుల గురించి ఇంకొక ప్రొఫెసర్ తో చర్చిస్తోంటే పై విషయం చర్చ కు వచ్చింది. ఆస్ట్రేలియాలో మైకేల్ హెవిట్ గ్లీసన్ అనే Cognitive Science ప్రొఫెసర్, ఇంగ్లీషు ఆలోచనా విధానం మీద School of Thinking అని ప్రారంభించి అనేక వందలమందికి శిక్షణ ఇచ్చాడు. నా మిత్రుడు నన్ను ఇంగ్లీషు, ఇండియన్ విధానాలను విశ్లేషించగలరా? అని అడిగాడు.
Who is an atheist? He can understand digits one, two, three,.. by counting numbers on fingers but is afraid of conceiving the notion of real infinity. Complex numbers are beyond his reach.
భారతీయ (అంటే నిజంగా హిందూ) ఆలోచనావిధానానికి ఇంగ్లీషు (అంటే పాశ్చాత్య, క్రైస్తవ) ఆలోచనా విధానానికి ఎందులో వ్యత్యాసము ఉంది? అని ఆలోచిస్తే మనకు తెలియకుండా మన సంస్కారాలలో మనకు అంతర్గతంగా ఉన్న, వారి సంస్కారాలలో వారికి ఉన్న తర్కంలో తేడాలు అని అర్థం అవుతుంది.
వారి తర్కం చరిత్ర గ్రీకులైన ప్లేటో, సోక్రటీసు,అరిస్టాటిల్ - వీరి తత్త్వ శాస్త్రం మీద క్రైస్తవ మతం,చర్చి వ్యవస్థ, విజ్ఞాన శాస్త్రం, నాటినుండి నేటి వరకు ఆధార పడి ఉన్నది. మన తర్కానికి అంతకన్న ఎక్కువ చరిత్ర ఉంది. గౌతముడు, కణాదుడు, కపిలుడు, పతంజలిలతో మన తత్త్వ శాస్త్రం ముడిపడి ఉంది. తరువాత, బౌద్ధులు, జైనులు, అద్వైతులు, విశిష్టాద్వైతులు, ద్వైతులు తర్కాన్ని ఆధారంచేసుకునే తమ తమ మత సాంప్రదాయాలు నిర్మించుకున్నారు. దురదృష్టవశాత్తూ మన దేశం వేయి సంవత్సరాల బానిసత్వంలో మన ఆలోచనాసరళిని మరచిపోయి, ఇతరుల ఆలోచనలను అర్థంచేసుకోలేక దిక్కుతోచని స్థితిలో పడింది. మహమ్మదీయులు దేశాన్ని రెండుగా విభజిస్తే , మెకాలే తన విద్యా విధానం ద్వారా మన మస్తిష్క ప్రక్షాలన Brain Washing మొదలు పెట్టాడు. మన గ్లోబలైజేషన్ సమస్య, తరాల అంతరాలు ఇదే

జాజి శర్మ క్రైస్తు చరిత్రలో లిఖించని దాదాపు పదమూడు వత్సరాలు, ఆయన సనాతన హిందూ ధర్మము అధ్యయనము చేస్తూ హిందూ పుణ్య క్షేత్రములు సందర్శింస్తూ, గడిపాడని ఫిల్ముడివిజన్ వారి డాక్యుమెంటరీ తెలుపుతోంది. ఆ చరిత్రను క్రైస్తు జీవితములో నుండి తొలగించబడ్డాయి. వాటికన్, క్రీస్తు హిందు దేశము సందర్శించిన వాస్తవము ఒప్పుకుంది.

Vvs Sarma I have seen what is said to be Christ's tomb near Srinagar, J and K with Hebrew markings under Muslim control. Resurrection is a myth. He did not die on cross. He was saved by his followers and he ran away to Kashmir. A story was cooked up to explain his disappearance from the cross.

ఇంగ్లీష్ ఆలోచనకు, తెలుగు ఆలోచనలకు భాష, దానికి సంబంధించిన సంస్కృతికి దగ్గర సంబంధం ఉంటుంది. "నాయనా నీకు తెలిసిన ఋషుల పేర్లు చెప్పు" అని ఒక కాలేజి విద్యార్థి నడిగితే వ్యాసుడు, విశ్వామిత్రుడు, అగస్త్యుడు ఇలాంటి పేర్లు చెప్పే అవకాశ మైనా ఉంది.ఇదే ఇంగ్లీష్ మీడియం లో కాన్వెంట్ లొ చదివిన ఒక విద్యార్థిని "Tell me names some Hindu saints", అతడు సమాధానం గా "Hinduism has no saints. I know several however,St Joseph, St Thomas, St. John, Santa Claus, St Valentine" అని వాడి వూళ్ళో స్కూళ్ళ పేర్లు, వాడికి తెలిసిన ఆధునిక పండుగల పేర్లు చెబితే ఆశ్చర్య పడక్కరలేదు. ఇది ఈనాటి చదువు, మాధ్యమములు ఆలోచనా విధానంలో తెచ్చే మార్పులు.
https://www.facebook.com/vallury.sarma/posts/472095836161168________________________________________https://www.facebook.com/vallury.sarma/posts/472777769426308
అసలు thinking అనే ఆంగ్లపదానికి, ఆలోచన అనేది సరియైన అనువాదమేనా? ఈ ప్రశ్న వచ్చింది.సమాధానం దొరికింది. ఈరెండిటికీ ఉపకరణాలు ఏమిటి? thinking మనస్సుతో చేస్తాము. ఆలోచనకు కావలసినవి కన్ను, మనస్సు. లోచన అంటే కన్ను.దానికి సంబంధించినదే ఆలోచన (looking at). కన్నుతో చూసినతరువాత దానిని అర్థంచేసుకునే ప్రయత్నం ఆలోచన. లోకన అంటే చూడటం. ఉపసర్గలతో అనేకపదాలు వచ్చాయి. సులోచన,విలోచన, సమాలోచన, ఆలోకన, అవలోకన వంటివి. ఇదే మన తర్కానికి, వారి తర్కానికీ తేడా, మన తత్త్వశాస్త్రానికీ, వారి philosophyకీ ఉన్న తేడా. మనది ప్రత్యక్ష ప్రమాణముతో కూడినది. వివేచన అంటే వివేకం తో కూడిన ఆలోచన thinking with discrimination.
Nandiraju Radhakrishna గురువులకు, ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు మధ్య వ్యత్యాసం తెలుసుకోవాలంటే మిమ్ములను అధ్యయనం చెయ్యాలి. వృత్తి రీత్యా మీరు అధ్యాపకులు కావచ్చు. ప్రవృత్తి రీత్యా మీరు నూరుపాళ్ళు గురువులు. గురువులు జ్ఞాన జ్యోతులు ప్రజ్వలింప జేస్తారు. కేవలం ఉపన్యసించరు.ధన్యులం మిమ్ము అర్ధం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం.https://www.facebook.com/vallury.sarma/posts/472677619436323ఇంగ్లీషు ఆలోచనా విధానానికీ, తెలుగు ఆలోచనా విధానానికి భేదం ఉండడానికి రెండవ ముఖ్య కారణం భాష. భాషకు ఆలోచనకు సంబంధం ఉన్నదా? ఇది ఆలోచింపదగిన విషయం. ఉదాహరణకు నేను తెలుగులో ఆలోచిస్తానా, ఇంగ్లీషులోఆలోచిస్తానా? కాకపోతే నేను ఇంగ్లీషుతో ఆలోచిస్తానా? తెలుగుతో ఆలోచిస్తానా? Do I think in English? Do I think with English? Is my thinking independent of any language? ఇవి చాలా ముఖ్యమైన ప్రశ్నలు. తెలుగు నా ఆలోచనకు మాధ్యమమా? లేక ఉపకరణమా? కొంతవరకు ఇది మనము చేసే పని మీద ఆధారపడి ఉంటుంది. ఇంజనీరింగ్ పరిశోధనలో తెలుగుకు ఉపయోగం తక్కువ. తెలుగు భాష భవిష్యత్తు గురించి వ్యాసం వ్రాస్తూంటే పూర్తిగా తెలుగులోనే ఆలోచన ఊంటుంది. తెలుగు పుస్తకాన్ని ఇంగ్లీషులోనికి అనువదిస్తుంటే రెండు భాషలు కావాలి. కాని అవి చాలవు.అదేమిటి అంటారా? నేను గత 4 నెలల నుండి "శ్రీకృష్ణ తత్త్వము" అనే తెలుగు పుస్తకాన్ని ఇంగ్లీషులోనికి అనువదిస్తున్నాను. ఆన్ లైన్ మీద ఇంగ్లీషు-తెలుగు-సంస్కృతం నిఘంటువులు తరచు వాడవలసి వచ్చింది. కృష్ణ పుస్తకంలో ఒక వాక్యం ఇలా ఉన్నది. "యజ్ఞములోవాడే స్రుక్స్రువములకు కర్మఫలం వస్తుందా?" దీనిని ఇంగ్లీషులోకి ఎలా అనువదించాలి? అసలు మాటలు అర్థం అయితే కదా అనువాదం. ఏ నిఘంటువులోనూ దొరకలేదు. స్రుక్, స్రువము విడిగా చూస్తే అర్థాలు దొరికాయి.https://www.facebook.com/vallury.sarma/posts/473091326061619రాధాకృష్ణగారు జిడ్డు కృష్ణమూర్తి గారిని గుర్తుచేశారు. మనము పరిశీలిస్తున్న భారతీయ ఆలోచన విధానానికి, ఇంగ్లీషు ఆలోచనావిధానానికి ఆయనకు సన్నిహిత సంబంధం ఉంది. ఆలోచనకు భాషకూ సంబంధం ఉన్నదా? అని నిన్న అనుకున్నాం. ఇంగ్లీషులో, ఇంగ్లీషుతో ఆలోచించి ఇంగ్లీషులో సంభాషించి, భారతీయతకు అతీతంగా, విశ్వాత్మభావమునకు దగ్గరగా ఎదిగిన భారతీయ తత్త్వవేత్త ఆయన. ఆయన బోధనా విధానానికి మూలాలను మన సనాతన ధర్మంతో సమన్వయం చేసుకోవాలి. దార్శనికులైన మహర్షులు, శ్రీకృష్ణుడు, అరిష్టనేమి,మైత్రేయ మహర్షి, గౌతమ బుద్ధుడు,ఆదిశంకరులు, రమణ మహర్షి ఈ పరంపరలోని అవతారమూర్తి ఆయన.ఆయన ముఖ్య బోధ "You Have to Find Out Yourself." ఇది భారతీయ తత్త్వ శాస్త్రానికి పరాకాష్ఠ. కృష్ణుడు ఉపనిషత్తుల సారాన్ని సమన్వయం చేసి, అనేక యోగాలను గురించి బోధించి, నీ దారి నీవు ఎన్నుకో అన్నాడు.అరిష్టనేమి చెప్పిన నిర్గుణ ఉపాసనను కు మార్గంగా తన సగుణమార్గాన్ని ప్రతిపాదించాడు. అరిష్టనేమి నిర్వాణ సమయములో ఆయన తేజస్సు కృష్ణునిలో చేరింది. కలియుగంలో ప్రజలకు యజ్ఞాలు, తపస్సులు చేసే శక్తి ఉండదని గ్రహించి, ఈ వైదిక మార్గాల ప్రాముఖ్యతను తగ్గించాడు. భక్తిని ప్రతిపాదించాడు. మళ్ళీ ఆయనె బుద్ధుడుగా వచ్చి, వేదకర్మలను నిరసించి హేతువాదాన్ని ప్రోత్సహించాడు. శంకరులు దానిని తన అద్వైతంతో సనాతన ధర్మంలో కలిపి వేశారు. కృష్ణమూర్తిగారి పేరులో కృష్ణ ఉన్నది. ఆయనను మైత్రేయ మహర్షి అవతారంగా భావించి దివ్యజ్ఞాన సమాజం వారు ఆయననును జగద్గురువుగా ఛేయడానికి ఇంగ్లాండు తీసుకు వెళ్ళారు. ఆయన అదితిరస్కరించి, తనదైన పద్ధతిలో తన అలోచనలను వ్యక్తం చేశారు.ఆయన ఇంకొక ముఖ్యబోధ "Truth is a pathless land. ఆయన చెప్పినవిద్యావిధానం. పిల్లలకు నేర్పవలసినదిపి ప్రశ్నలకు సమాధానాలు వ్రాయడం కాదు, సరిగా ప్రశ్నించడం. ఇది రమణ మహర్షి బొధను "నేనెవరిని? అని నీకు నువ్వు సమాధానం వెతుక్కో" గుర్తుచేస్తుంది.https://www.facebook.com/vallury.sarma/posts/473402166030535ప్రథమేహి విద్వాంసో వైయాకరణః - ఏ శాస్త్రంలో విద్వాంసుడైనా మొదట వ్యాకరణం నేర్చుకోవాలని ఆర్యోక్తి. వ్యాకరణం వస్తే భాష మీద అధికారం వస్తుంది. ఆలోచించడానికైనా, ఆలోచన తరువాత నిర్ణయాలను సరిగా వ్యక్తం చేయడానికైనా వీలు పడుతుంది. మనం తెలుగులో వ్యాకరణాన్నిపూర్తిగా గాలికి వదిలేశాం. దీనితో మనం ఎవరో చెప్పిన మాటలను చిలుకపలుకులలా ఒప్పజెప్పడానికి అలవాటు పడ్డాం, మన చదువు కూడా మనని దీనితో ఆలోచనలకు దూరంగా , సమాచారాన్ని గుర్తుంచుకునే యంత్రాలుగా మార్చివేసింది. Teaching degrading to coaching మన దౌర్భాగ్యం.
ప్రశ్నలూ సమాధానాలు, పాత ప్రశ్న పత్రాలు, ప్రశ్నల కోశాగారాలు, ప్రవేశ పరీక్షలు,శిక్షణ కేంద్రాలు - ఇవన్నీ ఆలోచనా శక్తికి ప్రతిబంధకాలు. సమాచార సేకరణ చదువుకాదు, పనికిమాలిన పరిజ్ఞానం. అదే మాదిరి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం, మాదిరి ప్రశ్నలకు సమాధానాలను చెప్పడం వీటి వలన ఆలోచించే శక్తి పెరగదు. పాఠం అయ్యాక విద్యార్థి ఉపాధ్యాయునికి ప్రశ్నలు వేయ గలగాలి. ఉదాహరణకు మెదడు పనిని గురించి చిన్నప్పుడు reflex action కి అసంకల్పిత ప్రతీకార చర్య అనిచెప్పేవారు. మంచి పారిభాషిక పదం. దానిని అర్థంచేసుకోగల శక్తి ఉపాధ్యాయుడికైనా ఉన్నదా? అలాగే కృష్ణదేవరాయలకు "మూరు రాయర గండ" అనేబిరుదు ఉందని చెప్పేవారు. అది కన్నడ పదమనీ, రాయ అంటే రాజు అని, ముగ్గురురాజులను జయించిన ధీరుడనీ చెప్పరు. ఆ పేరు ఎందుకు వచ్చినది? అని మాస్టారిని అడగ గలగాలి. విద్యార్థి నేర్చుకోవలసినది సరీగా ప్రశ్నించడం.



No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...