వ్యక్తి - individual, వ్యవస్థ system, సమాజం society ఏది ముఖ్యం? అని అడిగితే ఎవరికి? అనే ప్రశ్న వస్తుంది
వ్యక్తి-తనకి తాను ఎప్పుడూ ముఖ్యం. కుటుంబ వ్యవస్థలో కొంతకాలము తనకుటుంబానికి ముఖ్యం. వ్యవస్థలో తాను ఒక సూక్ష్మభాగం. వ్యవస్థలు పెరుగుతూ ఉంటాయి. మన రాజకీయ వ్యవస్థలో ఒక వ్యక్తి వోటు విలువ ఎంత? శూన్యం. ఒక గుంపు (కులం, మతం , ఏదో ఒక కార్మిక సంఘం) యొక్క ప్రవర్తన ముఖ్యం. వ్యక్తికి వ్యవస్థ ముఖ్యం. వ్యవస్థకి ఒక వ్యక్తి ప్రభావం అల్పం. ఆ వ్యక్తి యొక్క సంబంధాలు పెరిగినకొద్దీ ఒక గుంపుకు నాయకునిగా వ్యవస్థకు ముఖ్యం అవుతాడు.మనుష్యుడు ఎక్కడ ఉంటాడో అతని చుట్టూ అక్కడ ఒక సమాజం పెరుగుతుంది. వివాహ వ్యవస్థతో ఒక కుటుంబం ఏర్పడుతుంది.అనేక కుటుంబాలు కలిపి ఒక సమాజము, అది నడవడానికి వ్యవస్థలూ ఏర్పడతాయి. కాల క్రమేణా వ్యవస్థలు బల పడచ్చు. బలహీన పడచ్చు. కంపెనీ వ్యవస్థ బలపడుతోంది. కుల వ్యవస్థ బలహీన పడుతోది. కొన్ని మతాల వ్యవస్థలు బలపడుతున్నాయి. వ్యవస్థీకృతం కాని మతాల ప్రభావం తగ్గుతూంది. బుద్ధుడు సంఘం శరణం గచ్ఛామి - అన్నాడు. సంఘం సరీగా ఉన్నప్పుడూ వ్యాప్తి చెందింది, బలహీన పడినప్పుడు క్షీణ దశకు చేరుకున్నది. ఇక్కడ మతం యొక్క గొప్పతనంతో సంబంధంలేదు. ఒక గొప్ప ఆచార్యుడు నాయకుడు కాలేక పోవచ్చు. సమాజ బలం వలన ఒక బుద్ధిహీనుడు కులపతి కావచ్చు. ఈ మూడిటి లక్షణాలు తెలుసుకోవాలి. వాటి నడతను సరిదిద్దుకోవాలి.
No comments:
Post a Comment