Thursday, January 18, 2018

శ్రీకృష్ణ, బాబా, అల్లా, God అందరూ ఒక్కరే అనేది తత్త్వతః సరికాదు


శ్రీకృష్ణ, బాబా, అల్లా, God అందరూ ఒక్కరే అనేది తత్త్వతః సరికాదు. ఇవి వేర్వేరు భాషలు వేర్వేరు మతాలకు సంబంధించిన మాటలు. వాటి అర్థాలు వేరు.వాటి వెనుకనున్న అవగాహన వేరు. ఆ మాటకు వస్తే శ్రీరాముడు , శ్రీ కృష్ణుడు కూడా ఒకటే అనడం కూడా సరికాదు. మరి వరమహాలక్ష్మి, రాధ, కృష్ణుడు కూడా ఒకటేనా? ఇవి అన్నీ దైవత్వాన్ని సూచిస్తాయి. కాని పూజా ఫలితాలు వేరు. గమ్యాలు వేరు. శివరాత్రి నాడు సత్యనారాయణ వ్రతం చేసుకోము.వరలక్ష్మీ వ్రతం నాడు ఆంజనేయుణ్ణి అర్చించం.ఆన్నీ దివ్యనామాలే.కాని మందులషాపుకు వెళ్ళి ఏదో ఒక మంచి మందు ఏదైనా సరే ఇవ్వండి అనము. దేని ఉపయోగం దానిది. తత్త్వం తెలుసుకుని ఆరాధిస్తే వచ్చే ఫలాలు వేరు. ప్రతి అక్షరమూ బీజాక్షరము. ప్రతి మాటా మంత్రము. మన కవులు, ముఖ్యంగా హిందూ కవులు గుర్తించాలి. గాంధీగారిలా ఈశ్వర అల్లా తెరే నాం అని పాడితే మలేసియాలో నేరం. అల్లా పదం ఇతర మతస్థులు వాడకూడదని అక్కడ చట్టం. వీటిని untranslatable words అంటారు.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...