https://www.facebook.com/vallury.sarma/posts/521914334512651
పవనః పవతామస్మి రామ శస్త్రభృతామహం
ఝషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవీ
పావనముచేసేవానిలో నేను వాయువును. శస్త్రధారులలో నేను రాముడను. జలచరములలో నేను మొసలిని ప్రవాహములలో నేను జాహ్నవిని. జాహ్నవిని అన్నపదానికి గంగను అని అర్థంచెప్పి వదిలేస్తాం. భగవంతుడు నేను జాహ్నవిని అనిచెప్పడంలో ఏమన్నా విశేషం ఉన్నదా? శివుని జటాజూటమునుంది వెలువడిన గంగ భగీరథ ప్రయత్నం వలన భూమికి వచ్చినది. హిమవత్పర్వతమునుండి జాలువారి గంగాద్వారం వద్ద మైదానానికి వచ్చినది. ఉప్పొంగుతూ భగీరథుని రథాన్ని అనుసరించి ప్రవహిస్తూంది. ఇక ఆనదీ ప్రవాహానికి ఊరని, అడవి అని, ఆశ్రమమనీ విచక్షణ ఉండదు. ప్రకృతిలో భాగంగా స్వేచ్చగా ప్రవహించింది. జహ్నుడనే ముని తపస్సుచేస్తుంటే ఆయన ఆశ్రమమూ , యజ్ఞశాల కొట్టుకు పోయాయి. ఆయన చేతిలోనికి ప్రవాహాన్ని స్వీకరించి పూర్తిగా తన లోనికి గ్రహిస్తాడు. భగీరథుడూ తాను అతి కష్టముచేత గంగను భూలోకానికి తీసుకువచ్చానని దానిని వదలిపెట్టమనీ జహ్నుని ప్రార్థిస్తాడు. తపశ్శక్తి అటువంటిది. అగస్త్యుడు సముద్రాన్ని పానం చేసినట్లే జహ్నుడు గంగను పానం చేశాడు. వాతాపిలాగే శరీరంలో కలసిపోయినది. ఆయన దయ తలచి వదలినది మొదట వచ్చిన గంగ కాదు. ఆయన ఉచ్చిష్టముగా వదిలినది కావున ఆయన కుమార్తెతో సమము అయింది. జాహ్నవి పేరు అందుకే వచ్చినది. జాహ్నవి అనేదే సరియైన నామము. అందుకే భగవంతుడు ఆపేరు వాడాడు. ఆయుర్వేదంలో "ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిః" అంటాం. ఆయనే వైద్యుడు. ఆయనయే ఔషధము. వేదాంత పరముగా భవరోగాన్ని హరించేవాడు. భవరోగ హరణ అనేవిశేషణాన్ని దీక్షితర్ శివునికి, త్యాగరాజు విష్ణువుకు వాడారు. వైద్యుడన్న పదం ఇద్దరికీ వాడుతారు. రోగం నుండి విముక్తియైనా, దేహమునుండి విముక్తి అయినా వారే చేయాలి. వారి అంశలుగా మన వైద్యులూ అదేచేస్తారు.

No comments:
Post a Comment