https://www.facebook.com/vallury.sarma/posts/516971425006942
వాయువ్యభారతంలో మొఘలాయి సామ్రాజ్యానికి, సనాతన ధర్మంతో సంఘర్షణ సిఖ్ఖులతో మొదలైనది. గురునానక్ (1469-1539) జీవితకాలంలోనే 1526లో బాబర్ ఢిల్లీ సింహాసనంపైకూర్చున్నాడు. గురు నానక్ చిన్నతనంలోనే అక్షరాలు నేర్చుకునే సమయంలో అరబిక్ మొదటి అక్షరం ఆలిఫ్ (మన 1 వలె నిలువుగీత) నుచూచి దేవుడు ఒక్కడే అన్నాడట. ఏది ఏమైనా చిన్నతనంనుండీ ఒక ఆధ్యాత్మికతను ప్రదర్శించాడని చెబుతారు. అతడికి హిందూ, ఇస్లాం మతాల మధ్య పెద్ద తేడాలు కనిపించలేదు. అందుకని రెండు మతాలనూ ఒక తాటి క్రిందకు తేవాలనుకున్నాడు. కర్మ కాండకు, కులవ్యవస్థకు, మత మౌడ్యానికీ వ్యతిరేకంగా బోధిస్తూ ఇండియా అంతటా తిరిగాడు. మక్క - మదీనా ల దాకా యాత్రలు చేశాడు. 30 సం వయసులో కొన్ని ఆధ్యాత్మిక అనుభవాల తరువాత తన మొదటిబోధను వినిపించాడు. “నాదృష్టిలో హిందువూలేడు.ముసల్మానూ లేడు. దేవుడు హిందువూకాదు, ముసల్మానుకాదు. భగవంతుడు ఒక్కడే. నేను భగవంతుని మార్గాన్ని అనుసరిస్తాను.నేను దేవుని దర్శనమనే అనుభవాన్ని పొందాను. అక్కడ నాకు అమృతంఈయబడినది. భగవన్నామాన్ని ప్రచారం చేయమని నాకు ఆదేశందొరికినది.” అప్పటినుండి ఆయన గురువుగా పిలువబడ్డాడు. ఇది నామ రూప రహితమైన భగవత్ సంకీర్తనము. ఆ కాలంలోని భక్తి మార్గాలలో ఒకటియే. కబీర్ పంథా వలె సిఖ్ఖ్ పంథా అనవచ్చును. ఈయన శిష్యులలో అధిక సంఖ్యాకులు హిందువులైనా, కొందరు మహమ్మదీయులు కూడా ఈయన బోధలకు ఆకర్షితులై శిష్యవర్గంలోచేరారు. ఆయనకి ఎంతో మంది శిష్యులు ఏర్పడ్డారు. అందులో అంగదుడనేవాడిని తన వారసుని గావించుకున్నాడు. అంగదుడు రెండవ గురువయ్యాడు. ఇతడు నానక్ రచనలన్నింటినీ ప్రోగుచేసి క్రమబద్ధం చేశాడు. నానక్ వలె ఇతడూ తన వారసుని ఎంపిక చేశాడు. శిఖ్ఖులు (అంటే శిష్యులు). వీరి నాలుగవ గురువు రామదాసు. అమృత్ సర్ దేవాలయానికి పునాదులు వేశాడు. అతని కొడుకు, వారసుడూ అయిన ఐదవ గురువు అర్జున్ దేవ్ ఈ దేవాలయానికి చాలా ప్రశస్తి కల్పించాడు. ఈనాడు శిక్కులకది ఎంత పవిత్రమైనదో, అంత పవిత్రత సంతరించుకోవడానికి అర్జునదేవ్ కారకుడు. ఇతడు చేసిన మరో గొప్ప పని "గ్రంథసాహిబ్" ను నిర్మించటం. అంతకు ముందరి గురువులందరి రచనలను, హిందూ ముస్లిం రచనలను, వీటికి తోడు తన రచనలనూ కలిపి గ్రంథ సాహిబ్ ను కూర్చాడు. గురు గ్రంధ సాహెబ్ జీలో సంస్కృతరచనలు, వ్రజభాషలోని సంత్ సూరదాస్ వంటి వారి రచనలు, మొదటి ముగ్గురు గురువుల బోధలు, కొన్ని పెర్షియన్ రచనలు పంజాబీగురుముఖి లిపిలో వ్రాయబద్దాయి.
మహమ్మదు ప్రవక్త ఎన్ని కట్టుదిట్టాలుచేసినా, అంతర్గత విభేదాలన్నవి మహమ్మదీ
యమతానికీ తప్పలేదు. ముఖ్యంగా అధిక సంఖ్యాకులైన సున్నీ లతోబాటుగా షియాలు, సూఫీలు అనేవిభేదాలు వచ్చాయి.ఇంకా అహ్మదీలు, బహాయీలు కూడా ఇస్లాంనుండి వచ్చినవారే. ఇవి శాఖోపశాఖలై ఇప్పుడు సుమారు 150 శాఖలున్నాయని అంటారు. భారతదేశం, పాకిస్తాన్, ముస్లిం సముదాయాలలో ఇంకా కులవ్యవస్థకూడా కొనసాగుతోందనీ సమాచారం ఉన్నది. సూఫీ సాంప్రదాయం మన హిందూమతంలో వేదాంత సాంప్రదాయం వంటిది.ఈ తత్వం ప్రకారం స్వీయ ఆధ్యాత్మిక మార్గాన ఈశ్వర ప్రేమను పొందడం ధ్యేయం. సంప్రదాయ వాదుల ప్రకారము నిజమైన సూఫీ సున్నీ, లేక షియా ముస్లిం అయిఉండాలి. హిందూ ముస్లిం బోధలను సమన్వయ పరుస్తున్న హిందూ మతస్తుడైన శిఖ్ఖు గురువు అర్జునదేవ్ సరియైన సూఫీ కాదు. అతడు ఇస్లాం మతం స్వీకరించి తీరవలసినదే. ఇది బాబర్ కుమారుడు, అప్పటి మొఘల్ బాద్షా ఐన జహంగీర్ ఆజ్ఞ. సహజంగా అర్జన్ దేవ్ తిరస్కరించాడు. ఇది రెండవ మొఘల్ బాద్షా చరిత్రలోనూ, శిఖ్ఖుల చరిత్రలోనూ ఒక మలుపు. మనము వేదాంతులను గౌరవిస్తాము. అనేక మంది సూఫీ సంత్ లు, హిందువులచేత కూడా గౌరవింపబడుతున్నారు. కాని సూఫీలు సంప్రదాయ ముస్లిముల చేత ఎప్పుడూ గౌరవింపబడలేదు. ఇరాన్ , పాకిస్తాన్, వంటి దేశాలలో వారి పూజనీయుల సమాధులు విధ్వంసానికి గురి ఔతున్నాయి.
The Mughal Emperor Jahangir wrote in his memoirs: “At Goindwal on the banks of the river Beas lived a Hindu, Arjan by name, in the garb of a Pir or Sheikh (sufi word for Guru) . Thus, many innocent Hindus and even…Muslims he brought into his fold who beat the drum noisily of his self-appointed prophet-hood. He was called Guru. From all sides, worshippers came to offer their homage to him and put full trust in his word…For a long time I had harboured the wish that I should… bring him into the fold of Islam.”
జహంగీర్ అర్జన్ దేవ్ ను గ్రంధసాహెబ్ ను సవరించి హిందూ భజనలు తీసివేయమని,ఇస్లాం మతం స్వీకరించమనీ అజ్ఞాపిస్తే అర్జన్ నిరాకరించాడు. జహంగీర్ అతడిని బందీ చేయించి ఐదు రోజులు చిత్రహింసలు పెట్టి కాల్చిన ఇసుక వంటిపై పోయించి అతడి మరణానికి కారకుడయ్యాడు. ఆ రోజు 30మే 1606. అప్పటినుండి శిఖ్ఖులు ప్రతిసంవత్సరమూ జూన్ 15న ఆయన సంస్మరణ దినం జరుపుకుంటారు.

No comments:
Post a Comment