https://www.facebook.com/vallury.sarma/posts/516565125047572
ఇస్లాం, క్రైస్తవ మతాలు భారతదేశంలోనికి వచ్చాక వారికి విపరీతముగా కనుపడినది మన మూర్తి పూజ. మహమ్మదు ప్రవక్త సా.శ. 610లో తనకు దేవుడైన అల్లా నుండి సందేశమువచ్చినదని, ఆయన ఒకడే దేవుడనీ, తాను దేవుని ఆఖరు ప్రవక్తననీ ప్రకటించాడు. అంతకు ముందు అరేబియాలో అనేక దేవతలకు మూర్తిపూజ జరుగుతూ ఉండేది. మహమ్మదు మొదట మక్కాలోనూ, తరువాత తూర్పు అరేబియాలోనూ గల అనేక దేవతా విగ్రహాలను ధ్వంసంచేయించాడు. తరువాత కాలంలో మనదేశంపై తురుష్కుల , మంగోలుల, అరబ్బుల దండయాత్రలు జరిగినపుడు, వారిదృష్టి మనమీద పడినప్పుడు, వారికి ప్రత్యేకంగా కనపడినవి మనదేవాలయాలు. మనము అసత్యమైన దేవతాపూజలు చేస్తున్నామని మనమతం మార్చి, మన విగ్రహాలను పగులగొట్టి మనకు, స్వర్గంలో ఉండే కనబడని, సత్యమైన దేవుడైన అల్లానో, యెహోవానో యజమానిగానో, కాపరిగానో చేయాలనీ ఆనాటినుండి ఈ నాటి వరకు వారిలోకొందరు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ ఆలయ విధ్వంస కార్యక్రమం సా. శ.1000 నుండి 1700 వరకు మహమ్మదీయ పాలనలోనూ, 1500 నుండి 1700 వరకు పోర్చుగీసు, ఫ్రెంచ్ క్రైస్తవులచేత కూడా గోవా, పుదుచ్చేరి ప్రాంతాలలో కొనసాగింపబడినది. తరువాత క్రైస్తవ ప్రచారకుల ప్రణాళికలు మారాయి. ఈ మధ్య "మతాంతర దేవాలయము", "ఆరోగ్యమాత దేవాలయము" అనే చర్చి పేర్లూ, "శ్రీ క్రీస్త ఏసవే నమః" అని మంత్రాలు, “సత్యవేదసంస్థ” వంటి అనువాదాలు కనబడుతున్నాయి. ఒక విధమైన శుభపరిణామమేమో?
వేదాలలో దేవాలయాల, మూర్తిపూజల ప్రసక్తి లేదు. అక్కడ దేవతా స్వరూపమూ మంత్రమే. మంత్రాలలో కొన్ని మంత్రగణాల అధిపతియే "గణానాంత్వా.." అనే ఋగ్వేదమంత్రములో వర్ణింపబడిన మహాగణపతి. వేదకర్మలైన యజ్ఞాలలో దేవతలను ఎలా పూజిస్తారు? అగ్నిలో వేసే ఆహూతులవలన. స్వాహాకారంతో "ఇంద్రాయ స్వాహా ఇంద్రాయ ఇదం నమః" అని ఆజ్యంతో అగ్నికి సమర్పించడమే ఇంద్రపూజ. ఈ యజ్ఞ కర్మలు సమాజములో అందరకు విధింపబడలేదు. కాలక్రమంలో దేవతార్చన, పూజలను సమాజం అందరిదగ్గరకు తీసుకువెళ్లినదే మూర్తి పూజ. ఆలయ నిర్మాణానికి, దేవతా విగ్రహాల తయారీకీ ఆధారం ఆగమాలు. ఇవికూడా చాలా ప్రాచీనమైనవి. వైష్ణవంలో వైఖానస, పాంచరాత్ర ఆగమాలు సుప్రసిద్ధం. అలాగే శైవంలో శైవ సిద్ధాంత, పాశుపత, కాలాముఖ, కాశ్మీర శైవ ఆగమాలు ఉన్నాయి. శాక్తేయులకు, గాణాపత్యానికి, కౌమారానికి కూడా ఆయా ఆగమాలు ఉన్నాయి. రుద్ర హోమంలో "నమః సోమాయ చ రుద్రాయ చ. స్వాహా" అంటూ రుద్రమంత్రంతో స్వాహాకారంచేస్తే, అదే మంత్రంతో స్వాహా కారంలేకుండా జలంతో శివలింగానికి అభిషేకం చేస్తారు. ఈ యజ్ఞం, ఈ అభిషేకం అందరూ దర్శిస్తారు. ఫలం అందరిదీ, యజ్ఞ కుండం నిర్మించిన వారికీ, స్రుక్, స్రువాలను చేసిన వడ్రంగులకి, మట్టిపాత్రలు చేసిన కుమ్మరులకు, సమాజంలో అందరికి. "ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్.." అని శివుని ధ్యానిస్తూ చిన్న పార్థివ లింగానికీ లేదా స్పటిక లింగానికీ, ప్రక్కనే ఉన్న సాలగ్రామానికో ఇతర దేవతా విగ్రహాలతో కలిపి అభిషేకం చేస్తారు. ఈ పంచాయతన పూజ శంకరాచార్యుల కాలంనుంచీ వస్తున్నదే. మూర్తి పూజ ఆలయంలోనైనా, ఇంటిలోనైనా, యోగ సాధనలో మూలధారములోని గణపతికైనా హిందువులకు సుపరిచితమే. దీని ప్రభావమే ఇళ్ళలో విగ్రహాలు, చిత్రపటాలతో పూజ గదులు గా, పూజా స్థలాలుగా పరిణామంచెందినది. ప్రతిహిందువుకు ఇంటిలో శాంతినీ తృప్తినీ ఇచ్చేస్థలం ఇది. ఇది కర్మలపై ఆధార పడిన వేదమతం, ధ్యాన సాధనాదులతో కూడిన జ్ఞాన మార్గములు కాక అందరికీ అర్థమయే, అందుబాటులో ఉండే తీరులోని, భక్తి సంప్రదాయ మార్గం.
21 వ శతాబ్దంలో జిహాద్, క్రూసేడ్ information warfare గా కూడా పరిణామం చెందాయి. విగ్రహారాథనకు విరుద్ధంగా వచ్చే ప్రచారం Blogs, Facebook Statuses and Comments గా వస్తూంది. ఒక ఉదాహరణ - ఇది యజుర్వేదానికి సంబంధించిన ఉపనిషన్మంత్రం.
అంధం తమః ప్రవిశంతి యేఽసంభూతిముపాసతే ।
తతో భూయ ఇవ తే తమో య ఉ సంభూత్యాఁ రతాః ||
దీనికి అన్యమతస్థులు చెప్పే అర్థంఇది - పరమాత్మను విడిచి కంటికి కనపడే సృష్టి పదార్థములను పూజించువారు ఘోరనరకమున పడుదురు. - అందుచేత “ మీవేదం స్పష్టంగా చెప్పిన విషయాన్నే మీరు నమ్మటంలేదు మూర్తిపూజలు చేస్తున్నారు” అని వారి అవహేళన.
నిజానికి ఏమాత్రం సంస్కృత పరిజ్ఞానం ఉన్నవారైనా ఆ అనువాదాన్ని వక్రభాష్యమనీ గ్రహిస్తారు. అక్కడ ఉన్న శబ్దం అంధం. అంటే అంధకారం, చీకటి, తమస్సు, అజ్ఞానం. ఇక్కడ నరకం ప్రసక్తి లేనేలేదు. ఒక నగకో, ఒక రూపాయ నోటుకో పూజ చేస్తే పాపం రాదు. భగవంతుని పూజించిన ఫలం రాదు అంతే. అంటే విగ్రహంలో ఉన్న ప్రకృతిలోని వస్తువుకి, విగ్రహంచేసిన మట్టికి, బంగారానికి కాదు పూజ చేస్తున్నది. అలాగే విగ్రహంచెక్కిన శిల్పికి, లేదా కులాలునికి కాదు. (material and instrument causes) పూజ చేస్తున్నది దానిలోకి ఆవాహన లేదా ప్రాణప్రతిష్ఠ చేయబడిన భగవంతునికే. సర్వ దేవ నమస్కారం కేశవం ప్రతిగచ్ఛతి అంటే ఏదేవతకు పూజచేసినా అది నీహృదయంలోనున్న పరమేశ్వరునికే చెందుతుంది. మొదటిపాదానికి బాహ్యార్థం ఇది - ప్రకృతిని ఉపాసించేవారు గాఢాంధకారంలో ప్రవేశిస్తారు. మూర్తి లేదా ప్రతీకపూజ చేసేవారుకూడా ఆవాహన చేయబడ్డ భగవంతుణ్ణే ఆరాధిస్తారు కాని మాయా స్వరూపమైన ప్రకృతిని కాదు (మట్టినో, లోహాన్నోకాదు.)
వేదంలో సంహితాభాగం చెప్పేది కర్మ మార్గం. ఉపనిషత్తుచెప్పేది జ్ఞానమార్గం. మూర్తిపూజది ప్రధానంగా భక్తిమార్గం. ఈ వేర్వేరు మార్గాలని సర్వోపనిషత్సారముగా భగవద్గీతలో సమన్వయంచేసినవాడు శ్రీకృష్ణుడు.

జి శర్మ కేవలం కర్మ ఆచరించి లేదా కేవలం జ్ఞానాన్ని ఆర్జించి దివ్యతం పొందుట అనేది తప్పు
యజుర్వేదములో చెప్పిన ఉపనిషత్తు మంత్రం అసలు భావం ఇది.
అంధం తమః ప్రవిశంతి యే విద్యాముపాసతే |
తతో భూయ ఇవతే తమో య ఉ విద్యాయాం రతాః || (9)
చాలా మంది వారి విధులని చక్కగానే నిర్వహించుకుంటారు, కానీ సరియైన జ్ఞానం అంటే ఏమిటో తెలియదు వారికి. సరియైన జ్ఞానం అంటే ప్రాపంచిక విషయముల యందు ఉన్న జ్ఞానం కాదు. ప్రాపంచిక జ్ఞానం అనేది తిండి నీడ సంపధల వరకే పనికి వచ్చేది. ఈ జ్ఞానం జంతువులలో కూడా ఉంటుంది. మరి మనిషికి వాటికి తేడా ఏముంది ? మనిషి జ్ఞానాన్ని ఆర్జించి దానికి అనుగుణంగా తన ఆచరణని మార్చుకోగలడు. ఎవడి జ్ఞానం అయితే ఆచరణకు పనికి రాదో అది వృదా, అట్లాంటి వాడిని జ్ఞానవంతుడు అని అనరు. జ్ఞాని అనేవాడు ఆలోచనలని మాటలని ఆచరణని ఒకే దిషలో నడపగలిగేవాడు. ఇలా సరియైన జ్ఞానంతో మనసా వాచా కర్మనా బ్రతకగలిగితే దాన్ని విద్య , ఉపాసన, ధ్యానం లేదా భక్తి అని అంటారు. ఇవన్నీ పర్యాయ పదాలే. అయితే ఆ జ్ఞానమనేది ప్రాపంచిక విషయాల యందు ఉండే జ్ఞానానికన్నా గొప్పదైనది. అట్లాంటి గొప్ప జ్ఞానంతో బ్రతకడాన్నే "కర్మాచరణ" అని అంటారు.
ముందు కర్మ అంటే ఏమిటో తెలియాలి. కర్మలు అనేవి మూడు రకాలు. నిత్య, నైమిత్తిక మరియూ కామ్య కర్మలు అని మూడు రకాలు. నిత్యకర్మలు అంటే రోజూ చేసుకొనే సంధ్యావందనం, అగ్నికార్యం వంటివి. కొన్ని కర్మలు అప్పుడప్పుడు ఆచరించాల్సిన వాటిని నైమిత్తిక కర్మలు అని అంటారు, అంటే గ్రహణం వంటివి ఏర్పడ్డప్పుడు చేయాల్సినవి. ఇవికాక మనకు ఏదో అవసరం ఏర్పడ్డప్పుడు ఆరోగ్యం కొరకో, సంపధల కొరకో లేదా సంతానం కోసమో చేసేవి, వాటిని కామ్య కర్మలు అని అంటారు. వీటన్నింటిని ఆచరించేప్పుడు ఫలితం ఆశించక చేస్తే అవి మోక్షాన్ని ఇస్తాయి. వాటినే ఫలితం ఆలోచించి చేస్తే అవి తాత్కాలిక ప్రయోజనం లభిస్తుంది, పైగా కర్మ బంధం అనేది తొలగదు. ఇది గుర్తించి బ్రతికేవాడు జ్ఞాని. చాలా మంది కర్మని జ్ఞానాన్ని వేరుగా చూస్తారు. కర్మ బంధం తొలగటం అనేది కర్మని జ్ఞానంతో కలిపి ఆచరిస్తేనే కర్మ బంధం తొలగుతుంది, మోక్షం లభిస్తుంది. అట్లా మోక్షాన్ని కాంక్షించు వాడిని ముముక్షువు అని అంటారు, ముముక్షువుకు కర్మ జ్ఞానం అనేవి విడదీయలేనివి.
చాలా మంది మోక్షాన్ని పొందలేక పోవడానికి కారణం ఈ విషయం తెలియకనే. ఈ మంత్రం ఎవడైతే కేవలం కర్మను మాత్రమే ఆచరించి లేదా కేవలం జ్ఞానాన్ని మాత్రమే ఆర్జించి దివ్యత్వం పొందుట అనేవి రెండూ తప్పు. ఈ రెండూ తిరిగి కర్మ బంధంలోకి నెట్టేవే తప్ప విడుదల చేసే మార్గాలు కావు.

వేదంలో సంహితాభాగం చెప్పేది కర్మ మార్గం. ఉపనిషత్తుచెప్పేది జ్ఞానమార్గం. మూర్తిపూజది ప్రధానంగా భక్తిమార్గం. ఈ వేర్వేరు మార్గాలని సర్వోపనిషత్సారముగా భగవద్గీతలో సమన్వయంచేసినవాడు శ్రీకృష్ణుడు" This excellent commentary has to be noted by every Hindu and should put before those who quote the captioned sloka in a wrong context and way. .

No comments:
Post a Comment