Friday, January 19, 2018

భారత దేశం 5000 సంవత్సరాలలో ఇప్పటి దౌర్భాగ్య స్థితికి ఎందుకు చేరింది?

https://www.facebook.com/vallury.sarma/posts/497636596940425

https://www.facebook.com/vallury.sarma/posts/497715493599202

https://www.facebook.com/vallury.sarma/posts/498320773538674

https://www.facebook.com/vallury.sarma/posts/498501786853906


పంచమ వేదంగా భాసించిన మహాభారతము, సాక్షాత్ భగవంతుడే భూమిమీద అవతరించినట్లు వ్యాసునిచేత కీర్తించ బడ్డ శ్రీకృష్ణ భగవానుడు, సకల ఉపనిషద్సారము బోధించిన భగవద్గీత, పుట్టిన భారత దేశం 5000 సంవత్సరాలలో ఇప్పటి దౌర్భాగ్య స్థితికి ఎందుకు చేరింది? అవినీతి భారతమని, ప్రపంచంలో నవ్వులపాలు ఎందుకౌతోంది? 65 సంవత్సరాల స్వతంత్ర ప్రజాప్రభుత్వము ఎందుకు విఫలమైనది? 1000 సంవత్సరాల బానిసత్వము అని తేలికగా చెప్పుకోవచ్చును. కాని అది ఒక తప్పుదారి పట్టించే సమర్థన మాత్రమే. కాని గత 100 సంవత్సరముల చరిత్ర పరిస్థితిని ఇంకా పాడుచేసింది? దీనికి ఎవరు బాధ్యులు? మొగల్ పాదుషాలు కాదు. ఆంగ్లేయులు కూడా కాదు. మరి ఎవరు? భారత ప్రజలు. మొదట వీరిని నడిపించిన నాయకులు. తరువాత తమ వోటు అమ్ముకొని, వారు గెలిపించిన నాయకులు. ఈ పరిస్థితికి (భారతీయుల పతనానికి) కారణం 5000 సంవత్సరాల నాడే ప్రారంభమైన ధర్మ చ్యుతి. ఇది భారతీయుల ధర్మచ్యుతి. సనాతన ధర్మ అనుయాయులుగా చెప్పుకునే వారి ధర్మచ్యుతి. మొదటి నాలుగు వేల సంవత్సరాలు ఇతర మతస్థుల ప్రసక్తిలేదు. ఈ 5000 సంవత్సరాల భారత చరిత్ర, కార్ల్ మార్క్స్ చెప్పినట్లు విదేశీ దండయాత్రల చరిత్ర మాత్రమే కాదు. సనాతన ధర్మంలో వచ్చిన పరిణామాల చరిత్ర. ఈ కోణంలో చరిత్రను పరిశీలిద్దాం.
కర్ణుని సూతపుత్రుడు అనేవారు. సూతుడు అంటే ఏమిటి? మనుస్మృతి ప్రకారము వీరు మిశ్రమ వర్ణము వారు. క్షత్రియ భర్తకు బ్రాహ్మణ భార్య వలన పుట్టిన వారు. వీరి వృత్తి రథములు నడుపుట. క్షత్రియులకు రథములు తోలి, వారికి ఉత్సాహము, ధైర్యము కలిగించే సంభాషణలు చేసేవారు. క్షత్రియులు వారిని తమకంటే కొంత తక్కువ వారుగా చూసేవారు. కాని వారికి క్షత్రియులతో వివాహాది సంబంధాలు ఉండేవి. యాదవులను కూడా అందుకే కురువంశీయులు తక్కువగా పరిగణించేవారు. యదువు, పురుడు చంద్రవంశపు యయాతి కుమారులే.యదువు బ్రాహ్మణ భార్య దేవయానికి, పురుడు క్షత్రియ వనిత శర్మిష్ఠకు పుట్టినవారు.పురు వంశమే తరువాత కురు వంశం అయినది. కాని యాదవ వనిత కుంతిని, పాండురాజు , సూతవనిత సుధేష్ణను విరాట్రాజు పెళ్ళి చేసుకున్నారు. వీరు క్షాత్ర విద్యలు నేర్చుకున్నా అస్త్రాలకు అధికారం ఉండేది కాదు.కాని రాజు ఆవడానికి అభ్యంతరంలేదు. ఒక విధముగా కృష్ణుడు రథ సారథిగా ఉండడనికి కూడా ఇదే కారణం.కృష్ణుడు సాందీపని వద్ద వేదాధ్యయనం చేశాడు. కాని ఆయనకు అస్త్రగురువులేరు. స్వతస్సిద్ధం గా వచ్చిన సుదర్శనం తప్ప ఆయన వద్ద అస్త్రాలు లేవు.

ధేష్ణ సూతవనిత అని ఇప్పుడే తెలిసింది. ఈ సంగతి మహాభారతములో ప్రస్తావించబడినదా ?........ అని సత్యనారాయణ గారు
అడిగారు. దానికి నా ఆధారం
విరాట్ పర్వం , కీచక వధా ఉపపర్వం, 14 అధ్యాయం , 34 sloka
ద్రౌపద్యువాచ (కీచకునితో)
అప్రార్థనీయామిహమాం సూతపుత్రాభి మన్యసే
విహీన వర్ణాం సైరంధ్రీం బీభత్సాం కేశకారిణీం
సూత పుత్రా ! అని కీచకుని సంబోధించడము వలన సుధేష్ణ కూడా సూతవనిత
అనినా అనుమానం (logical inference) 

మహాభారత కథ ముఖ్యంగా మహాభారత యుద్ధానికి సంబంధించినది. ఆది పర్వం పూర్వరంగం. సభాపర్వం నుండి ఉద్యోగపర్వం వరకూ యుద్ధానికి బీజాలు పడ్డాయి. భీష్మపర్వం నుండి తరువాత ఆరు పర్వాల యుద్ధ షట్కం యుద్ధ వర్ణనయే. తరువాత శాంతి, అను శాసనిక పర్వాలు కూడా భీష్ముడు ధర్మరాజుకు యుద్ధరంగంలో చేసిన ధర్మ బోధయే. సనాతన ధర్మంలో ప్రథమ స్థానం, పురుషా ర్థాలలో మొదటిస్థానం ధర్మానికే. ఈ కథాకాలం ద్వాపర కలియుగాల సంధికాలమే. ద్వాపరుని అంశ శకుని. కలిపురుషుని అంశ దుర్యోధనుడు. వీరి కలయికయే మాయా ద్యూతం. నాటి ప్రభుత్వానికి రంగ స్థలం గుడ్డిరాజు ధృతరాష్ట్రుని గుడ్డి దర్బారు. హస్తినాపురంలో కౌరవ సామ్రాజ్యపు parliament. సాక్షాత్తూ ధర్మదేవత అంశలో జన్మించిన ధర్మరాజు ద్యూతవ్యసనానికి బానిసయై, మాయా ద్యూతమని తెలుసుకోలేక ఆఖరుకు తమ్ములను భార్యను జూదంలో పణంగా ఒడ్డుతాడు. ఇది మొదటి ధర్మచ్యుతి. రాజవంశపు స్త్రీ, అంతకు క్షణంక్రితం వరకు మహారాణి, సభామధ్యంలో అవమానింపబడింది. ఇది భారత చరిత్రలో జనక్షయానికి, రాజ వంశాల నాశనానికి కారణమయింది. ఇది రెండవ ధర్మ చ్యుతి. ధర్మాలు తెలిసిన భీష్మ ద్రోణాదులు నోరు మెదపలేదు. కనీసం నేటి వారివలె "వాక్ అవుట్" కూడా చేయలేదు. (serious acts of omission, deviation from path of dharma). ఇది మూడవ అధర్మం. ధర్మంలో భారత దేశపతనం ద్వాపరంలోనే మొదలైనది. నాటికీ నేటికీ హస్తినాపురమే భారతదేశ దౌర్భాగ్యానికి కేంద్రం. Compare with today’s rapes in Delhi.


Nandiraju Radhakrishna నేటి అవినీతి భారతానికి ధర్మచ్యుతులుగా ఆనాడే బీజలు పడ్డాయని అద్భుత ఉదాహరణలు ఇచ్చారు. దృతరాష్ట్రుని గుడ్డిదర్బారు నేటికీ అదే హస్తినలో కొనసాగుతున్నది. ఆనాడు నిండు సభలో జ్యూతక్రీదను, స్త్రీకి జరిగిన అవమానాన్ని అందరూ అప్పుడు కూడా భీష్మాదులు మౌనమోహనులుగానే కళ్లప్పగించి చూశారు. అదే కురు వంశ పతనానికి దారితీసింది. నేడు దేశం మొత్తం దుశ్శాసన , కీచక పర్వాలే.. అద్భుత పోలిక.. ఈ యదార్ధ చరిత పదిమందికీ తెలియాలనేదే ఆశయం.
మనం భారతదేశంలో ధర్మచ్యుతి ద్వాపరయుగాంతంలోనే ప్రారంభం అయినది అని చెప్పుకొన్నాం. అప్పుడే ధర్మ సంస్థాపనకు శ్రీకృష్ణా వతారం వచ్చినది కదా! దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరిగినది కదా; ఇంకా కలియుగ ప్రారంభంలోనే ఇంత అధర్మము ఎందుకు చోటు చేసుకొన్నది? ఈ ప్రశ్న సహజం. దేశము, కాలము, భగవంతుడు - ఈ తత్త్వాలను సరిగా అర్థంచేసుకుంటే ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. పాలక వర్గాలలోనే చోటుచేసుకొన్న అధర్మానికి మహాభారత యుద్ధం సమాధానం. అది శీకృష్ణుని పర్యవేక్షణలోనే జరిగినది. అనేక దుష్టులు, అధర్మాన్ని ఆచరించినవారు భూమినుండి తాత్కాలికంగా తొలగింపబడ్డారు. ధర్మాత్ములైన పాండవుల రాజ్యము స్థాపించబడినది. ఒక 30-40 సంవత్సరాలు ఇలాగే జరిగినది. శ్రీకృష్ణుడు భారత యుద్ధం తరువాత సుమారు 40 సం. జీవించాడు. ధర్మ చ్యుతి ఆయన బ్రతికి ఉండగానే ప్రారంభం అయింది. అవతారపురుషుడైన బలరామునికే మదిరావ్యసనం ఉన్నది. శ్రీకృష్ణుని చివరిరోజులలోనే యాదవులు ధర్మ భ్రష్టులయ్యారు. దూర్వాసాది మునులను గేలిచేసి, అవమానించి శాపగ్రస్తులయ్యారు. ఆఖరుకు ఒకరినొకరు చంపుకుని నశించారు. భారత, భాగవతాల రచన పూర్తి కాలేదు. కృష్ణుని గురించి మంచీ, చెడూ కూడా జనశ్రుతిలో ప్రచారమయ్యాయి. స్వాతంత్ర్యము వచ్చిన కొన్ని దశాబ్దాలకే జాతిపిత యైన మహాత్ముణ్ణి మరచినట్లే, కృష్ణుని కూడా విస్మరించడం మొదలుపెట్టారు. అందుకే యాదవ వినాశాన్ని కృష్ణుడు పట్టించుకోలేదు. కృష్ణ నిర్యాణంతరువాత కలి ప్రవేశించగానే పరీక్షిత్ రాజయ్యాడు. ఆయన కలిని తన జీవితకాలంలో అదుపుచేయగలిగాడు. కాని అతడి మరణమే కాల ప్రభావాన్ని చూపించింది. అంతటి మహారాజు శమీక మహర్షి మెడలో మృత సర్పాని అనాలోచితంగా వేసి శాపగ్రస్తుడై పాముకాటుతో మరణించాడు. రాజు చేసినది అధర్మం. దానికి ముని కుమారుడు శృంగి ఇచ్చిన శాపం అనాలోచితంగా చేసిన అధర్మమే. పాము విషాన్ని తొలగించగల సమర్థుడు. మంత్రశాస్త్ర ప్రవీణుడు కశ్యపుడు తక్షకుడు ఇచ్చిన ధనానికి ఆశపడి వెను తిరగడం అధర్మమే. విద్యను ధనానికి అమ్ముకోవడం ఆనాడే మొదలైనది. విశృంఖలముగా విద్యావ్యాపారం ఈదేశంలో నేడు జరుగుతున్నది. .

జాజి శర్మ ధర్మచ్యుతిలోనే ఇంకా ఉన్నాము అనుకుంటాను. "ఆయన" ధర్మగ్లాని సంభవిస్తేనే కాని రాడేమో!Vvs Sarma కృష్ణావతారంలో రెండు తత్త్వములు ఉన్నాయి - జగద్గురు తత్త్వము , రాక్షస సంహారం చేసే విష్ణు తత్త్వము. మొదటిది తరచుగా వస్తూనే ఉన్నది. - బుద్ధుడు, దత్తాత్రేయ సాంప్రదాయములోని, గురుమూర్తులు, త్రిమతాచార్యులు,చైతన్యాదులు, యోగులు, రమణ మహర్షి వంటి గురువులు, జన్మిస్తూనే ఉన్నారు. కల్కి అవతారానికి ఇంకా సమయమున్నట్లుంది.



No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...