https://www.facebook.com/vallury.sarma/posts/498868870150531
ఇది ఆధునిక యుగానికి కూడా సంబంధించిన ప్రశ్న. దీనికి సంబంధించిన ఇప్పటి ప్రశ్నలు - బాబ్రీ మసీదు అని ఇప్పుడు పిలవబడే మస్జిద్-ఎ-జన్మస్థాన్, దానిని కలిగిఉన్న రామ జన్మభూమి, అనే అయోధ్యలో స్థలం హిందువులదా. లేక ముస్లిములదా ? మొదటి మహాభారత ప్రశ్న వివాద రహితం, ఏదో కొందరు మిత్రుల కుతూహలం, లేదా సందేహం. రెండవది, చాలా ముఖ్యమైనదే, ఇంతవరకు పరిష్కరింపబడనిది. ఇది ఆధునిక భారత చరిత్ర. దీనిని గురించి అప్పుడు చూద్దాం. కాని అభిప్రాయాలను నిర్భయంగా చెప్పడానికి కూడా సంకోచింప వలసిన ప్రశ్న. మనకు అంతగా సంబంధం లేని ఇలాంటి ప్రశ్నలు - ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం -ఎవరిది ఆ ప్రాంతం? టిబెట్ ఎవరిది, చైనీయులదా, టిబెటనులదా?
మొదట భారతకథ. కురు సింహాసనం శంతనునిది. తరువాత న్యాయబద్ధంగా గాంగేయునిది. తండ్రికి సత్యవతి పై గల వ్యామోహంకోసం, తన హక్కును వదులుకుని సమర్థుడు రాజ్యాన్ని వదలుకున్నాడు. ఏమాత్రం అర్హుడు కాని విచిత్రవీర్యుడికి సింహాసనం దఖలు పడింది. అంబికా, అంబాలికలు కన్నపిల్లలు ధృతరాష్ట్రుడు, పాండురాజు. పెద్దవాడు అంధుడవడం వలన రాజ్యపాలనకు అనర్హుడు. రాజు అయినవాడు పాండు రాజు. తానే సామ్రాజ్యాన్ని విస్తరింపచేసి సార్వభౌముడు అయినవాడు. ముని శాపం ఇచ్చాక పాండురాజు భార్యలతో కలసి వానప్రస్థానికి వెళ్ళిపోతాడు. అప్పుడు ధృతరాష్త్రుడిని సింహాసనం మీద కూర్చోబెట్టారు. పాండురాజు ప్రథమ పుత్రుడు ధర్మరాజు. తరువాత పుట్టినవాడు దుర్యోధనుడు. పాండు రాజు మరణానంతరం కుంతి, పాండవులు హస్తినాపురం వస్తారు. పాండవులు కౌరవులు కలసి పెరుగుతారు. అందరూ ధర్మరాజే తరువాత రాజు కావడానికి అర్హుడని అభిప్రాయ పడ్డారు. అందుకు ధర్మరాజుకే యువరాజ పట్టాభిషేకం చేశాడు అంధరాజు. ఇది దుర్యోధనునికి మొదటినుండీ గల అసూయాగ్నికి ఆజ్యంపోసింది. లాక్షాగృహంలో పాండవులను సజీవదహనం చేయడానికి వ్యూహం సిద్ధంచేశాడు దుర్యోధనుడు. పాండవులు బ్రతికి బయట పడి బ్రాహ్మణ వేష ధారులై బ్రతుకు తున్నారు. వారు ద్రౌపదీ స్వయంవరం సమయంలో బయట పడ్డారు. కృష్ణుడు కూడా అక్కడే వారికి సన్నిహితుడయ్యాడు. పాండవులు, శ్రీకృష్ణుడు, ద్రుపదరాజు సన్నిహితులు కావడంతో కౌరవులు భయపడ్డారు. పాండవులను పిలిచి వారికి సగం రాజ్యం పంచి ఇచ్చారు, వారికి ఖాండవ ప్రస్థం రాజధానిగా ఇచ్చారు. విశ్వకర్మ సాయంతో వారు ఇంద్రప్రస్థం నిర్మించుకున్నారు. రాజసూయ యాగం చేశారు. తమ రాజ్యభాగాన్ని జూదంలో పోగొట్టుకొని అరణ్య. అజ్ఞా త వాసాలు చేసి వచ్చారు
No comments:
Post a Comment