Friday, January 19, 2018

మనము భారతదేశ చరిత్ర, సనాతన ధర్మ చరిత్ర, శ్రీకృష్ణుని పా



https://www.facebook.com/vallury.sarma/posts/499180500119368

https://www.facebook.com/vallury.sarma/posts/499502216753863

మనము భారతదేశ చరిత్ర, సనాతన ధర్మ చరిత్ర, శ్రీకృష్ణుని పాత్ర - ఇవి ముఖ్యముగా ముచ్చటించుకుంటున్నాము. మిగతా మూడుయుగాలకంటె విభిన్నంగా కలియుగంలో భారత దేశంలోని సనాతన ధర్మం అనేక శాఖలుగా, ఒకోసారి పరస్పర విరుద్ధమైన మార్గాలలో, అనేక పాయలుగా ప్రవహించినది. ద్వాపరానికి ముందు యుగాలలో అనేక వైదిక ఋషులు వేదమంత్రాలకు ద్రష్టలై వేదరాశిని భద్రపరిచారు. వందలాది ఋషులు వేదాన్ని వినిపించినా, అది వేర్వేరు మతాలుగా ఏర్పడలేదు. ద్వాపరాంతానికి వ్యాసుడు వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించి ఒకొకవేదాన్ని ఒకొకశిష్యునికి ఇచ్చాడు. వైశంపాయనునికి యజుర్వేదం ఇచ్చాడు. ఇది ముఖ్యంగా వేదకర్మలకు సంబంధించినది. కృష్ణుడు దీనినే అభ్యసించుటచేత, కృష్ణయజుర్వేదమని వాడుక వచ్చియుండవచ్చును. వైశంపాయనుడి శిష్యుడు యాజ్ఞవల్క్యుడు. ఇతడు చాలా మేధావి, ఏకసంథాగ్రాహి. దానితో అతడికి అహంకారం, ఇతరులను తేలికచేయడం వంటి గుణాలు వచ్చాయి. గురువు గమనించి అతడిని తన గురుకులం నుండి బహిష్కరించాడు. తననుండి నేర్చుకొన్న విద్యను అక్కడే వదలమని ఆజ్ఞాపించాడు. అతడు ఆవిద్యను వమనం చేసుకున్నట్లు, దానిని తిత్తిరి పక్షులు తినినట్లూ వాడుక. ఇదే తైత్తిరీయ సంహిత. మనం అభిషేకానికి వాడే రుద్ర నమక చమకాలు దీనిలోనివే. యాజ్ఞవల్కుడు తరువాత సూర్యుడిని ఆరాధించి కొంత భిన్నమైన యజుర్వేదాన్ని సంపాదించుకున్నాడు. ఇది శుక్లయజుర్వేదం. తరువాతకాలంలో ఇది ఉత్తరభారతంలో ప్రచారమైనది. దాక్షిణాత్యులు కృష్ణయజుర్వేదాన్ని సంరక్ష్సించారు. దీనితో వేదంలోనే తేడాలు వచ్చాయి. తండ్రి పరీక్షిత్తు తక్షకుని కాటుచేత మరణించడం వలన అతని పుత్రుడు జనమేజయుడు సర్ప యాగం చేశాడు. నిజానికి తక్షకుడు పరీక్షిత్తు మృతికి నిమిత్తకారణమే. అతడి తప్పులేదు. అందుచేత సర్ప వంశ వినాశకమైన సర్పయాగం చేయడం కూడా ధర్మచ్యుతియే. జనమేజయుడు శుక్లయజుర్వేదాన్ని ఉపయోగించి యజ్ఞాలు చేశాడు. దీనికి సమాన ఫలం వస్తుందా? అని ప్రశ్న వచ్చింది. దీని సమాధానం యాజ్ఞవల్క్యుని ప్రతిభనుసూచించే బృహదారణ్యకోపనిష త్తులో వస్తుంది. కృష్ణుని తరువాత కాలంలోనే వేదప్రమాణాన్ని తిరస్కరించే జైన, బౌద్ధాలు వచ్చి సనాతన ధర్మంలో కలకలం సృష్టింఛాయి.
Vvs Sarma మీరు అలా అంటే నాకు అవును అనిపిస్తుంది. వేదాలు ప్రకృతి, పరమేశ్వర జన్యాలు. అవి శృతులుగా మహర్షులు విన్నారు. వేద నాదం ప్రకృతి అంతా వ్యాపించి ఉన్నది. సర్వవ్యాపి అయిన విష్ణువుకు వాహనం గరుడుడు. లక్ష్మీదేవికి ఉలూకం. ఉపనిషత్తులలో జీవాత్మ, పరామాత్మలను రెండు పక్షులతో పోల్చారు - ఒకటి కర్మఫలాలకు భోక్త . రెండవది సాక్షి. రామాయణానికి క్రౌంచ మిధునానికీ సంబంధం తెలిసినదే. భాగవతం శుక ముఖమునుండి వచ్చినది. యాజ్న్య వల్క్కుని నుంది వచ్చిన వేదమును తిరిగి ప్రకృతియే స్వీకరించినదేమో?
శ్రీకృష్ణ నిర్యాణానంతరం భారత వర్షంలో ఒకరకమైన శూన్యం ఏర్పడినది. వాయువ్యదిశన, గాంధార, మద్ర మొదలైన దేశాలనుండి, దక్షిణ దిశన, ఆంధ్ర, చోళ, చేర, పాండ్యుల వరకు, ఈశాన్యాన, విదేహ మొదలైన దేశములవరకు ఒక చీకటి యుగం నడిచింది. 54 దేశాల రాజులు తమ తమ సైన్యాలతో కౌరవ పాండవ యుద్దములో పాల్గోవడానికి వెళ్లి తిరిగి రాలేదు. హస్తినాపురానికి ప్రభుత్వం ఏర్పడినా కురు భూములుతప్ప మిగిలిన దేశాలన్నిటిలో అరాజకం ప్రబలింది. కొన్నిచోట్ల దోపిడీ దొంగలు చెలరేగారు. కొన్నిచోట్ల సింహాసనం కై కుట్రలు జరిగాయి. మరికొన్ని చోట్ల అనుభవశూన్యులైన పిల్లలను గద్దె పై ఎక్కించి వెనుకనుండి ఎవరో నడిపారు. అధర్మము, అన్యాయము, దోపిడీ యథేచ్చగా సాగాయి. కాని వ్యక్తిగతమైన ధర్మం అవడం వలన కొంతవరకు వైదిక మతం, సంస్కృతి రక్షింపబడ్డాయి. కాని యజ్ఞము, మంత్రము మొదలైనవి వ్యక్తుల స్వార్థము కొరకు ఉపయోగింపబడడం మొదలైనాయి. కాని ఆ భారత యుద్ధము వలన కలిగి అశాంతి ప్రజలనుండి పోలేదు. తర తరాలుగా ఆవిద్వేషాలు రగులుతోనే ఉన్నాయి.. వైదిక కర్మకాండలను సద్వినియోగ పరచుకోలేదు. ఒక రకమైన దృక్పథం ప్రజలకు వచ్చినది. భగవంతుని ఉనికి, వర్ణ వ్యవస్థ, యజ్ఞాది కర్మల ఉపయోగం ఇలాటి వాటి మీద ప్రశ్నలు బయలుదేరాయి. భాగవత, భారతాలు కొంతవరకు ప్రచారంలోనికి రావడం వలన చరిత్ర తెలిసింది. ఇంకా భక్తి మార్గానికి అంత ప్రచారం రాలేదు. ఆనాటి ప్రజలకు అప్పటిభాషలో ధర్మ బోధ చేయగలిగిన బోధకులు అవసరమైనారు. తపస్సు మీద ఇంకా నమ్మకం ఉన్నది. నన్నయ చెప్పినట్లు "గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్" అనే నిరాశ ప్రబలింది. అప్పుడు తాపోపశమనానికి అహింసను, శాంతినీ, సత్ప్రవర్తననీ బోధించే మతాల అవసరం కలిగినది. పరం కంటే ఇహం పైనే వారు ఎక్కువ దృష్టి పెట్టారు. బోధిసత్త్వులు, బుద్ధుడు, తీర్థంకరులు, మహావీరుడు, బౌద్ధ, జైన మతాలను స్థాపించారు. భాగవతం వీరు విష్ణువు అవతారాలేనని చెప్పినది.
(భాగవతం - 1.3.24)
తతః కలౌ సంప్రవృత్తే సమ్మోహాయ సురాద్విషామ్
బుద్దో నామ్నా జినసుతా కీకటేషు భవిష్యతి
తరువాత కలియుగంలో సురద్వేషులైన నాస్తికులను సమ్మోహన పరచుటకు కీకట దేశంలో బుద్ధుడనే పేరుతొ జినసుతుడుగా ప్రభవిస్తాడు.
ఇదంతా కలియుగంకొరకు ఉద్దేశింపబడిన శ్రీకృష్ణుని గురుతత్త్వ ప్రభావమే!

రాజకీయనేతలకు దశ దిశానాథులిచ్చిన ఆదేశములు
1. ప్రాచీదిశ -ఇంద్రుడు - నీ వర్గమునకు ఒకడే దైవముండవలెను. వేరెవరు కూడదు.
2. దక్షిణదిశ -యముడు- నీదేవుని విగ్రహములు తప్ప ఇతరవిగ్రహా రాదనను సహింపకుము.
3. ప్రతీచీదిశ - వరుణుడు - నీదేవుని నామమునే సదా ఉచ్చరింపుము.
4.ఉదీచీదిశ - కుబేరుడు - నీకు పదవి లభించువరకు విశ్రాంతిలేదు.
5. ఈశాన్యము - ఈశానుడు - నీకు దీర్ఘకాలము పదవి లభించుటకు పితృ దేవతలను పూజింపుము.
6. ఆగ్నేయము - అనలుడు - నీచేతులతో హత్యలు చేయకూడదు.
7 నైరుతి - నిరుతి - నాతిచరాసి
8. వాయువ్యము - అనిలుడు - అవినీతి నిషిద్ధము. నీ వ్యాపారమునకు పెట్టుబడులు స్వీకరింపవచ్చును.
9. ఊర్ధ్వదిశ - చతుర్ముఖ బ్రహ్మ - అన్ని ప్రశ్నలకు మౌనమే సమాధానము.
10. అధో దిశ - విష్ణువు - ఇతరుల ఆస్తులు కోరకుము. నీవి అనంతములగును

శర్మిల అన్నపేరుకు అర్థం తెలుసా? ఒక క్రింది తరం సిని నాయిక ఆమె హిందువుగా ఉన్నప్పటి పేరు. తరువాత ఆవిడపేరు అయేషా సుల్తానా అది వేరే విషయం. మన ఆంధ్ర రాజకీయ నాయకురాలి పేరు కూడా అదే. తెలుగు వాళ్ళ సామాన్యమైన తప్పుతో షర్మిలా అనివ్రాస్తారు. అది ద్రౌపదీ దేవి పేర్లలో ఒకటి.


No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...