Tuesday, January 16, 2018

ఆలోచనలతో, బుద్ధితో సత్యాన్వేషణ చేయగలమా

ఆలోచనలతో, బుద్ధితో సత్యాన్వేషణ చేయగలమా? Can science ever discover ultimate truth? అసాధ్యం. ప్రతివ్యక్తి ఆలోచనా ఆకాశంలో ఒక కాంతి కిరణం. ప్రతి వ్యక్తి ఆలోచనా సరళి (line of thinking) ఒక సరళ రేఖ. ఎన్ని రేఖలు గీసినా అవి ఆకాశాన్ని ఎప్పటికీ నింపలేవు. గణితంలో ఇది ఎన్ని సంఖ్యలున్నాయనే ప్రశ్నకు వస్తుంది. 1,2, 3, ఇల్లా లెక్కపెడుతోనే ఉండవచ్చు, అప్పుడే అనంతం వస్తుంది.1, 2 మధ్య ఎన్ని ఉన్నాయి? 1, 1.1, 1.2, .. 1.01, 1.02, అనంతకోటి అనంతాలున్నయి. uncountably infinite ప్రతి శాస్త్రమూ కూడా అంతే. ఆలోచనలూ అంతే. విష్ణువు సహస్రనామాలు అంతే. సహస్రము అంటే అనంతమనే అర్థంలోనే మన వాళ్ళు వాడతారు. ప్రతినామమూ వేరు. సహస్రకోటి నామాలు చెప్పినా విష్ణుతత్త్వ వ్యాప్తికి సరిరావు. మన భాషలకు శక్తి చాలదు. మన బుద్ధికి పరిమితి చాలదు. ఆలోచన అంటే ప్రశ్నించే శక్తి. ప్రశ్నలే జ్ఞానం. సమాధానాలు అసత్యం.ఇది అవగతమైతే శాంతి. ఇదేధ్యానం.ఇదే చిత్తవృత్తి నిరోధం. దీనినే జిడ్డు కృష్ణమూర్తి "Truth is a pathless land" అన్నారు.





Thoughts have taken you into the world of Rats. నేను six Hat Thinking ఇంగ్లీషువాళ్ళ ఇప్పటి ఆలోచనగా వ్రాశాను. మన భారతీయ గృహిణులకు అంతకంటే ఎక్కువ విజ్ఞానం ఉంది. టోపీలు ఏంకర్మ? వాళ్ళు రోజులో ఆరు అవతారాలే ఎత్తుతారు.
కార్యేషు మంత్రీ , కరణేషు దాసీ ;భోజ్యేషు మాతా, క్షమయా ధరిత్రీ; రూపేషు లక్ష్మీ; శయనేషు రంభా;షట్కర్మయుక్తా, ఖలు ధర్మ ఫత్నీ; వాళ్ళు డిబోనో కి పాఠాలు నేర్పగలరు. కాని ఎలుకల దగ్గర ఈ ఆలోచనా విధానం అపజయం పాలైంది. ఎందుకో తెలుసా? మనకు ఎలుకల భాష,ఎలుకల ఆలోచనా విధానం అర్థం కాలేదు.పరిశొధనల ఆవశ్యకత ఉంది. తెల్లటోపీ రాజకీయనాయకులది.వాటికి కావలసినది పూజతో పాటు ఆహారం, లంచం.. దానిని భోక్తగా పిలవాలి. We are already in the rat race. Let us who will win.


మనం ఆలోచన గురించి ఆలోచిస్తున్నాం. నా ఆలోచనను మీతో పంచుకోవాలంటే భాష యొక్క పరిమితులు ఇక్కడే వస్తాయి. నాఇంగ్లీషు వ్యాసానికి Thoughts on Thinking అనే శీర్షిక పెట్టాను. అదే Thinking about Thoughts అంటే అర్థం తేడా వస్తుందా? అవును - Computer Science కి information technologyకి ఉన్నంత తేడా ఉంది. ఈ ప్రశ్న నేను ఇంటర్ వ్యూలలో ఆ సబ్జెక్టులతో బి. ఇ. చేసినవారిని అడిగేవాణ్ణి. ఒక్కరు చెబితే ఒట్టు.తెలుగులో నా వ్యాసాలకు మంచి శీర్షికలు తెలుగు మిత్రులు ఆలోచింపగలరా? .


పదాల ముచ్చట్లు
మన vocabulary శబ్దనిధి లేదా శబ్దకోశం సమృద్ధిగా ఉంటేనే మనం సందర్భోచితమైన పదం వాడగలము. Thoughta, Thinking అనే పదాలకు మనం - అంటే మిత్రులు, నేను కూడా వైవిధ్యభరితమైన తెలుగు లేదా, తత్సమ పదాలను గుర్తుచేసుకోలేకపోయాము.అందుచేత ఆలోచనలను గురించిన పదాలు ఇంకా తెలుసుకోవాలి. (సంస్కృతపదాలు) ఆలోచన, యోచన, చింత, వితర్కము, ధ్యానము (ధ్యాస),స్మరణ,విచారము, విమర్శ, అవలోకన,సమీక్ష,భావము, .. ఇన్నిపదాలు ఆలోచనను గురించినవి ఉన్నాయి. వీటికి క్రియారూపాలు ఆలోచించుట, చింతించుట, విచారించుట, తర్కించుట,యోచించుట విమర్శించుట, భావించుట ..ఇలా అనేకం)
(తెలుగు పదాలు) తలపు,ఎన్నిక(తలపోయుట, తలంచుట,ఎంచుట, అనుకొనుట,ఎన్నుకొనుట) పదాల వాడుకలో తేడాలు అర్థాలలో అనేకఛాయలు (shades of meaning). సరియైనపదాని వాడటం కంచిపట్టు చీరకు 2x2, matching blouse piece కు ఎన్నుకోవడమంత కష్టము,కొట్టులో చూడాలి, బయటి వెలుగులో చూడాలి, Tubelight వెలుగులో చూడకూడదు. ఇలా.
తెలుగుకు సంస్కృతం ఎంత అవసరమో గమనించండి.


No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...