Sunday, January 21, 2018

భారత చరిత్ర - మళ్ళీ మొదటికి

https://www.facebook.com/vallury.sarma/posts/511717338865684

నరసింహ శర్మ గారు నన్ను మళ్ళీ కలియుగాదికి పంపించారు, వారు ఒక FB మిత్రులు పంపించిన ఒక ప్రశ్న, దానికి వారే ఇచ్చిన సమాధానాన్ని పరిశీలించమని కోరినారు. ఆ ప్రశ్న - "శైవమతం ఎట్లా సింథు ప్రజల/ మూలవాసుల వారసత్వం అయింది? దీనికి సంబంధించిన మరియొక ప్రశ్న ఆ మిత్రుని టైమ్లైన్ పై ఉన్నదికూడా చూదాము. ఆ ప్రశ్న "సింథునాగరికతపై నిర్మించిన ఆర్య మతమెట్లానిర్మాణం జరిగింది?" నాకు ప్రశ్నలపైనే అనుమానాలు వచ్చాయి. నేను చరిత్రకారుణ్ణి కాని, పురాతత్త్వ శాస్త్రవేత్తని కాని కాదు. నేను రోజూ వ్రాసే వ్రాతలు చరిత్రపుస్తకాలూ కాదు. నా ఉద్దేశ్యం ఒక పాఠకునిగా, ఒక భారతపౌరునిగా, నాదైన కోణంలో భారతచరిత్రని, ముఖ్యంగా సనాతంధర్మంలోని పరిణామాలదృష్టిలో పునః పరిశీలన చేయడం. మన చరిత్రను చదువుతుంటే నాకు వచ్చిన నిశ్చితాభిప్రాయం - మన భారత దేశ చరిత్రకూడా, మన దేశంవలెనే, మన మతంవలెనే భయంకరమైన అయోమయస్థితిలో ఉన్నది. మన ICHR, Indian Council of Historical Research, (Estd 1972) ఒక లక్ష్యము, ఒక ప్రణాళిక లేని ప్రభుత్వ విభాగం ఈ అస్తవ్యస్త స్థితి సింధునాగరికత, ఆర్య నాగరికత, సంస్కృతులను గురించిన విభేదాలలో ఉన్నది. దీనిపై ఉన్న రచనలను చూస్తే "ఈ రెండూ వేరు వేరు దేశాలకు సంబంధించినవా?" అనే అనుమానం వస్తుంది. ముఖ్యంగా సింధునాగరికతను గురించిన పరిశోధనలలో మనదేశానికి పాత్రలేదు. మనకి చరిత్రలేదు,మనకి చరిత్రగ్రంధాలు లేవు, మన పురాణాలు అభూతకల్పనలు. అందుచేత విదేశీయులు మనకు వారి దృక్కోణంలో వ్రాసిన చరిత్ర ప్రసాదించారు. ఈప్పుడు ఆ History కూడా ముఖ్య విషయంకాదు. ఇప్పటి విషయం Historiography దీని నిర్వచనాలు -- 1. The principles, theories, or methodology of scholarly historical research and presentation. 2. The writing of history based on a critical analysis, evaluation, and selection of authentic source materials and composition of these materials into a narrative subject to scholarly methods of criticism. ఈ సంవత్సరం మన ICHR చెసిన ఘనకార్యం 1st Indo-German Workshop on Historiographyను ప్రపంచ తెలుగు సభలవలెనే నిర్వహించడం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎన్ని సంవత్సరాలలో తెలుగుకు పూర్వ వైభవం తెస్తుందో , అన్నే సంవత్సరాలలో ICHR మనకు ప్రామాణికమైన భారతదేశ చరిత్రను అందిస్తుంది.
సింధునాగరికత సా.శ.పూ 3300 - 1300 మధ్య భారత ఉపఖండంలో విరాజిల్లిన ప్రముఖ నాగరికత. Bronze age కి చెందినది. ఈజిప్టులోని నైల్ నదీ నాగరికత ఇంకా ప్రాచీనమైనదని సా.శ. పూ. 3600 కు వెనుక అని చెబుతారు. ప్రస్తుత పాకిస్తాన్ అంతా ఈ నాగరికత వ్యాపించింది. వారి పంజాబు లోని హరప్పా, సింధులోని మొహెంజొదారో. భారతదేశంలోని, భారత్ లోని సరిహద్దుభాగాలు సరస్వతీ నదీ (ఘగ్గర్- హక్రా)లోయ, కాలీబంగ (రాజస్థాన్), లోథాల్ (గుజరాత్) వరకు ఈ నాగరికత వ్యాపించి ఉన్నది. దీనిని గురించి పరిశోధించేవారందరూ విదేశీయులే (నాటికీ, నేటికీ) మన చరిత్రలో మహాభారత యుద్ధ కాలం సా. శ.పూ. 3137. కలియుగారంభం (సా.శ.పూ 3102). దీనికి ఖగోళ శాస్త్ర ఆధారాలున్నాయి.ములిగి పోయిన ద్వారకకూ Marine Archeology అధారాలున్నాయి.కాని విదేశీయులకు ఇవి పట్టవు. సింధువాసులు ద్రావిడులు అంటే మద్రాసులో రాజకీయం జరుగుతుంది. ద్రావిడులు, ఆర్యులు అనేజాతులు భారతదేశంలో లేవు. ఇది వైజ్ఞానికంగా నిరూపింపబడిన విషయం. మనది ఒకే మిశ్రమజాతి. సింధునాగరికతను , వాయువ్య దిశనుండి దండెత్తివచ్చిన సంచార ఆర్య జాతులు విధ్వంసంచేశారు అనేది ఇంకా కనుపించే వెబ్ సైట్లలో కనుపించే అసత్యం.ఆర్యులు విదేశీయులు కారు. ఆర్యదండయాత్రలు అనే పదానికి అర్థంలేదు.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...