Sunday, January 21, 2018

విదురుడు, యుధిష్ఠిరుడు


వీరి జన్మవృత్తాంత్తాలను పరిశీలిద్దాం. నన్నయ ఆది పర్వములో విదురుని జన్మ విషయం చూడండి.
చండకోపుడైన మాండవ్యముని వరు
శాపమున జముండు సంభవిల్లె
విదురుడైన ధర్మ విదుండు పారాశర్యు
వీర్యమున నవార్యవీరబలుడు.
వ్యాసుడు పరాశరుని పుత్రుడు. ఋషి.మానవుడు. అంబిక పంపిన దాసీ యందు స్త్రీ-పురుష సంబంధము ద్వారా విదురుణ్ణి కన్నాడు. యముని అంశ అతడి జీవాత్మను ఆవరించి యుంటుంది.
పాండురాజు మునిశాపకారణమున ఉత్తమగతులకై తనకు సంతానము కావలెనని కుంతిని ప్రార్థిస్తాడు. తమ తల్లులకు తాము వ్యాసుని నియోగము వలన ఎలా జన్మించారో సూచిస్తాడు.కుంతి పాండురాజుకు దూర్వాస ముని ఇచ్చిన మంత్రంగురించిచెబుతుంది. ఏవేల్పును ఆరాధించమంటారని పతిని అడుగుతుంది.
లలితాంగి ఎల్లలోకంబులు ధర్మువు నందనిలిచె బొలుపుగ ధర్ముం
దలపుము మఱియాతడె వేల్పుల లోపలబెద్ద ధర్మువనసత్యమునన్
కుంతి పతికి ప్రదక్షిణము చేసి ధర్ముని మంత్రపూర్వకముగా ఆరాధిస్తుంది. ఆ ధర్ముండును యోగమూర్తి ధరుడై వరంబిచ్చిన గుంతియు తత్ప్రసాదంబున గర్భంబుదాల్చి సంవత్సర పరిపూర్ణమైన
శాత్త్రవ దైత్య తేజమున సర్వదిశల్ వెలుగంగ నైంద్ర
నక్షత్రయుతుండగా శశిప్రకాశ జయోన్నతమైన యష్టమిన్
మిత్రముఖగ్రహ ప్రతతి మేలగు నాభిజితోదయంబున
బుత్రుడు ధరమునంశమున బుట్టె ధర్మ మూర్తియై.
ఇక్కడ యముని ప్రసక్తి లేదు. ధర్మువు ధర్మ దేవత. వీరిద్దరూ వేరని మహామహోపాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు తమ ‘మహాభారత సారసంగ్రహము’ లో వివరిస్తారు. ఆయన వివరణ చూడండి. " యుధిష్ఠిరుడు ధర్మదేవుడి అనుగ్రహంవలన పుట్టాడు, యమధర్మరాజువలన కాదు అని పుచెప్పారు. అయితే యముడే ధర్మదేవుడు కావచ్చుకదా అని సందేహం. దానికి పుల్లెలవారు ఎక్కడికక్కడ ప్రమాణం చూపిస్తూ సమాధానం యిచ్చారు.
ధర్మదేవుడు బ్రహ్మ వక్షఃస్థలంలో కుడిభాగం నుంచి పుట్టాడు. బ్రహ్మకు మొదటితరం వాడు.
యముడు వివస్వంతుడి కొడుకు. వివస్వంతుడు కశ్యపుడి కుమారుడు. కశ్యపుడు మరీచికి పుట్టాడు. మరీచి బ్రహ్మమానస పుత్రుడు. అంటే యముడు బ్రహ్మకి నాలుగవతరంవాడు.
విదురుని జన్మ స్త్రీ పురుష సంయోగమున జరుగుతుంది. పారాశరుని వీర్యము వలన అని స్పష్టంగా చెప్పబడినది. వ్యాసుడు మానవుడైన ఋషి. సూర్యుడు, ధర్మువు, వాయువు, ఇంద్రుడు, అశ్వినులు దేవతలు. వారివి తేజో శరీరములు. వారు భూమిమీద మంత్రప్రభావమున ప్రత్యక్షమైనది యోగశరీరములతో,మానవ దేహములతో కాదు. వారు పాండురాజుకు కూడా కనుపింపరు. సంయోగం ప్రసక్తే లేదు. యోగము మాత్రమే. భాగవతములో దేవకి అష్టమ గర్భం ఎలా తాలుస్తుందో చూడంది. మొదటి పిల్లలు సంయోగం వలన పుడతారు. కృష్ణుని విషయంలో యోగమే.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...