https://www.facebook.com/vallury.sarma/posts/518527561517995
నాటి మహాభారతము నేటికీ ఒకతరం భారతీయులకు ప్రియమైనదే. 20-40 మధ్యవయస్సు గల నేటిభారతీయ యువతకు ఎంతప్రియమైనదో ఆలోచించాలి. వ్యాస భారతం, కవిత్రయ భారతం ఎందరు చదువుతున్నారు? కనీసం విశ్వవిద్యాలయాలలో తెలుగు శాఖలలో పరిశోధకులైనా వాటి మీద దృష్టి పెడుతున్నారా? తెలుగు విశ్వవిద్యాలయం వారివెబ్‌సైట్ చూస్తే వారి ప్రస్తుత పరిస్థితి అర్థమౌతున్నది. భారతము వంటివి వారి పరిశోధనా విషయంలే కావు. వారు తెలుగు వాణి అని ఒక త్రైమాసిక పత్రికను ప్రచురిస్తున్నామని చెప్పుకున్నారు. దాని తాజా సంచికని చూడమని ముఖపత్రంపై క్లిక్ చేయమని సూచించారు. object not found అని వెంటనే వస్తుంది. తీరాచేసి ముఖపత్రం మళ్ళీ చూస్తే తాజా సంచిక తేదీ జూలై-సెప్టెంబర్ 2008. మన మౌన మోహన సింహమే కాదు, మన ఉపకులపతులు కూడా మునిపుంగవులే. ఉదాహరణకు ఒక మంచి విశ్వవిద్యాలయము Indian Institute of Science వెబ్‌సైట్ చూడంది, ఒక హార్వర్డ్ విశ్వవిద్యాలయం సైట్ చూడండి. మన ఉపకులపతులచేతులు కట్టివేసి ఉంటాయి. మన యువకిరణాలు విశ్వవిద్యాలయాలపై ప్రసరించవు. జీతాలివ్వడమే గగనం. పైన ఏమి ఇస్తారు?
భారత అంటే భరతుడనే రాజు పాలించాడని చెబుతారు. భరతుడు పుట్టకముందుకూడా మనది భారత దేశమే . భా అంటే కాంతి, జ్ఞానము, వెలుగు - జ్ఞానార్జన ధ్యేయంగా గల దేశం... ఇప్పుడు అక్రమార్జన ధ్యేయంగా గలదేశం. అందుకే India that was Bharat.

No comments:
Post a Comment