https://www.facebook.com/vallury.sarma/posts/523191064384978
https://www.facebook.com/vallury.sarma/posts/523194111051340

20/05/2013
(భండారు వారి కరివేపాకు కథ పై స్పందన)
దొంగతనం పాపం. దొరికిన దొంగలు జైలుకు వెళ్తారు. ఇది మనందరం వినేదే. నాకైతే దొంగతనం మానవులకే కాక దేవతలకు కూడా సహజలక్షణం అనిపిస్తుంది. యజుర్వేదం చెబుతుంది దొంగలకు అధిపతియైన రుద్రునికి నమస్కారం అని. పైవాక్యం రుద్రమంత్రమే. హరి, హర రెండు నామాల్లోనూ హరించడం ఉంది. హరించడంనుంచి వచ్చిందే అపహరించడం. 64 కళల్లో చోరవిద్య కూడా ఒకటి. ఇక శ్రీకృష్ణుడి నైతే వెన్నదొంగ యని, మానినీ చిత్తచోరుడనీ అంటాం. క్షీర సాగర మధనంలో హరి జగన్మోహిని అవతారంలో చేసినది ఏమిటి? సాగర మథనానికి అసురుల సహాయంతీసుకొని, వారిని మోహింపచేసి అమృతాన్ని అపహరించి దేవతలకు ఇచ్చాడు. ప్రళయకాలంలో సోమకాసురుడు వేదాలను అపహరించి పట్టుకుపోయాడట. పాపం ఏంచేసుకుందామనుకున్నాడో? పాతకాలం రాక్షసుడు! మనవాళ్లు సినిమాల్లో నాలుగు తాళపత్రగ్రంధాలు చూపిస్తారు వాటికి ఒకటే కాపీ ఉన్నట్లు. పురాణకథ అలాగే ఉంటుంది మనవంటి వారికి (పామర జనరంజకంగా). దాని అంతరార్థం గ్రహించడమే విశేషం. పతంజలి యోగసూత్రాలలో అస్తేయం యమదమాది సంపత్తిలో చెప్ప బడుతుంది. అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము- వీటిని యమము అనిచెబుతారు. అస్తేయమంటే దొంగతనం చేయకపోవడము.

అన్ని మతాలూ దొంగ తనం చేయద్దని చెబుతాయి. అంటే అందరు మను ష్యులకు అది సహజగుణమన్న మాట.
పరిశుద్ధ సత్యవేద గ్రంధం (బైబిలు) రెండు ఆజ్ఞలు దొంగతనం గురించే ఇస్తుంది. Exodus (నిర్గమకాండము) 20:3-17 15 దొంగిలకూడదు. 17 నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు.నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని యెద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింప కూడదు.

దొంగతనం చేసిన పదార్థం పట్టి దొంగలలో భేదాలు ఉంటాయన్నమాట. దొంగలలో కూడా తరగతులు ఉంటాయి. పాపం ఏ సిటిబస్ లోనో ఒకరి పర్సు (బస్సులోవెళ్ళేవాడి పర్సులో ఏమంత ఉంటుంది?) దొంగతనం చేస్తూ పట్టుబడితే చేసిన వాడిని చావగొట్టి ఒకోసారి ప్రాణాలు పోయేటట్టు చేస్తారు మన పౌరులు. వాడిని పోలీస్ స్టేషన్ కు తీసుకొని వెళ్ళి అప్పచెప్పే ఓపిక, తీరిక ఎవరికుంటుంది? పురాణాల కాలంలోనూ, వంద సంవత్సరాల క్రితం వరకూ కూడా దొంగతనాన్ని సమాజంలో అడుగు వర్గాలతో గుర్తించేవారు. కష్టపడి పనిచేయనివాడికి దొంగతనం అడ్డదారియని ప్రజాసామాన్య అభిప్రాయం. మనదేశంలో బ్రిటిష్ పాలనలో కొన్ని సంచారకులాల వారిని (ఉదా: ఎరుకుల) దొంగల తెగలు (criminal tribes ) గా గుర్తించి వారికి ఒక నిర్దిష్ట నివాస స్థలం ఏర్పరచారు. మన రాష్ట్రంలో స్టువర్ట్ పురం, సీతానగరం లలో ఇలాంటి సెటిల్మెంట్స్ ఉండేవి. సాల్వేషన్ ఆర్మీ అని ఒక క్రైస్తవ మిషనరీ సంస్థ ఆధ్వర్యంలో ఇవి నడిచేవి. వారికి బైబిల్ బోధిస్తే మారవచ్సునని వారిని మతం మార్చేవారట. ఇప్పటికి కూడా prison evangelism అని జైళ్ళలోని నేరస్థులను తమ మతంలోకి ఆకర్షించే ప్రయత్నం క్రైస్తవ మతబోధకులు చేస్తూనే ఉంటారు. ఇదీ చిత్తచౌర్యమే. స్వాతంత్ర్యము వచ్చాక పరిస్తితులు మారాయి. ఇప్పుడు సమాజములో అన్నివర్గాలు దొంగతనములో ఆరితేరాయి. స్విస్ బాంకులలో డబ్బుదాచినవారిని, ధన ప్రక్షాలన (మనీ లాండరింగ్) చేసేవారిని ఏమంటాము. కాబినెట్ మంత్రులనుండి, ఉన్నతాధి కారుల నుండి రైల్వే స్టేషనులో జేబులు. సంచులు, పెట్టెలు కొట్టేసేవారి వరకు అందరిలో దొం గతనం ప్రబలింది. కొందరి ఫొటోలు స్టేషన్ లో పెడతారు. కొందరివి TV లోవస్తాయి. అంతేతేడా.
Nandiraju Radhakrishna భగవంతుని కంటే దొంగలకు, మనీ లాండరర్లు..అందులోనూ అరాచకీయులకు ప్రసార మాధ్యమాలు, మహా పా[తకు][త్రికేయు]లు భుజకీర్తులు తొడిగి భజన చేస్తుంటాము. పాపం వెంకన్నకు ఒక్క పర్యాయమే స్వర్ణ కిరీటం "గాలి" సోకుతుంది. కాని "మా బోంట్లకు" నేరుగా శ్రీకృష్ణ జన్మాస్థానం నుంచేనిత్య "నైవేద్యాలు" వస్తుంటాయి. మరి 'ఋణం' తీర్చుకోవాలి కదా..క్విడ్ ప్రోకో ఇక్కడ మరీ ఎక్కువ. అందుకే ప్రసార మాధ్యమాలు ఎప్పుడూ జైళ్ళ వద్దనే పిశచాల్లా వేలాడుతుంటాయి. దేవుళ్ళను సయితం బెదిరించగల మాధ్యమ వ్యాపారులకు చివరకు రౌరవాది నరకాలా..రంభా పరిష్వంగాలా? (అక్కడ కూడా మేనేజ్ మెంటే!!)
తస్కరాణాం పతయేనమః
(భండారు వారి కరివేపాకు కథ పై స్పందన)
దొంగతనం పాపం. దొరికిన దొంగలు జైలుకు వెళ్తారు. ఇది మనందరం వినేదే. నాకైతే దొంగతనం మానవులకే కాక దేవతలకు కూడా సహజలక్షణం అనిపిస్తుంది. యజుర్వేదం చెబుతుంది దొంగలకు అధిపతియైన రుద్రునికి నమస్కారం అని. పైవాక్యం రుద్రమంత్రమే. హరి, హర రెండు నామాల్లోనూ హరించడం ఉంది. హరించడంనుంచి వచ్చిందే అపహరించడం. 64 కళల్లో చోరవిద్య కూడా ఒకటి. ఇక శ్రీకృష్ణుడి నైతే వెన్నదొంగ యని, మానినీ చిత్తచోరుడనీ అంటాం. క్షీర సాగర మధనంలో హరి జగన్మోహిని అవతారంలో చేసినది ఏమిటి? సాగర మథనానికి అసురుల సహాయంతీసుకొని, వారిని మోహింపచేసి అమృతాన్ని అపహరించి దేవతలకు ఇచ్చాడు. ప్రళయకాలంలో సోమకాసురుడు వేదాలను అపహరించి పట్టుకుపోయాడట. పాపం ఏంచేసుకుందామనుకున్నాడో? పాతకాలం రాక్షసుడు! మనవాళ్లు సినిమాల్లో నాలుగు తాళపత్రగ్రంధాలు చూపిస్తారు వాటికి ఒకటే కాపీ ఉన్నట్లు. పురాణకథ అలాగే ఉంటుంది మనవంటి వారికి (పామర జనరంజకంగా). దాని అంతరార్థం గ్రహించడమే విశేషం. పతంజలి యోగసూత్రాలలో అస్తేయం యమదమాది సంపత్తిలో చెప్ప బడుతుంది. అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము- వీటిని యమము అనిచెబుతారు. అస్తేయమంటే దొంగతనం చేయకపోవడము.
(భండారు వారి కరివేపాకు కథ పై స్పందన)
దొంగతనం పాపం. దొరికిన దొంగలు జైలుకు వెళ్తారు. ఇది మనందరం వినేదే. నాకైతే దొంగతనం మానవులకే కాక దేవతలకు కూడా సహజలక్షణం అనిపిస్తుంది. యజుర్వేదం చెబుతుంది దొంగలకు అధిపతియైన రుద్రునికి నమస్కారం అని. పైవాక్యం రుద్రమంత్రమే. హరి, హర రెండు నామాల్లోనూ హరించడం ఉంది. హరించడంనుంచి వచ్చిందే అపహరించడం. 64 కళల్లో చోరవిద్య కూడా ఒకటి. ఇక శ్రీకృష్ణుడి నైతే వెన్నదొంగ యని, మానినీ చిత్తచోరుడనీ అంటాం. క్షీర సాగర మధనంలో హరి జగన్మోహిని అవతారంలో చేసినది ఏమిటి? సాగర మథనానికి అసురుల సహాయంతీసుకొని, వారిని మోహింపచేసి అమృతాన్ని అపహరించి దేవతలకు ఇచ్చాడు. ప్రళయకాలంలో సోమకాసురుడు వేదాలను అపహరించి పట్టుకుపోయాడట. పాపం ఏంచేసుకుందామనుకున్నాడో? పాతకాలం రాక్షసుడు! మనవాళ్లు సినిమాల్లో నాలుగు తాళపత్రగ్రంధాలు చూపిస్తారు వాటికి ఒకటే కాపీ ఉన్నట్లు. పురాణకథ అలాగే ఉంటుంది మనవంటి వారికి (పామర జనరంజకంగా). దాని అంతరార్థం గ్రహించడమే విశేషం. పతంజలి యోగసూత్రాలలో అస్తేయం యమదమాది సంపత్తిలో చెప్ప బడుతుంది. అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము- వీటిని యమము అనిచెబుతారు. అస్తేయమంటే దొంగతనం చేయకపోవడము.
అన్ని మతాలూ దొంగ తనం చేయద్దని చెబుతాయి. అంటే అందరు మను ష్యులకు అది సహజగుణమన్న మాట.
పరిశుద్ధ సత్యవేద గ్రంధం (బైబిలు) రెండు ఆజ్ఞలు దొంగతనం గురించే ఇస్తుంది. Exodus (నిర్గమకాండము) 20:3-17 15 దొంగిలకూడదు. 17 నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు.నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని యెద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింప కూడదు.
పరిశుద్ధ సత్యవేద గ్రంధం (బైబిలు) రెండు ఆజ్ఞలు దొంగతనం గురించే ఇస్తుంది. Exodus (నిర్గమకాండము) 20:3-17 15 దొంగిలకూడదు. 17 నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు.నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని యెద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింప కూడదు.
దొంగతనం చేసిన పదార్థం పట్టి దొంగలలో భేదాలు ఉంటాయన్నమాట. దొంగలలో కూడా తరగతులు ఉంటాయి. పాపం ఏ సిటిబస్ లోనో ఒకరి పర్సు (బస్సులోవెళ్ళేవాడి పర్సులో ఏమంత ఉంటుంది?) దొంగతనం చేస్తూ పట్టుబడితే చేసిన వాడిని చావగొట్టి ఒకోసారి ప్రాణాలు పోయేటట్టు చేస్తారు మన పౌరులు. వాడిని పోలీస్ స్టేషన్ కు తీసుకొని వెళ్ళి అప్పచెప్పే ఓపిక, తీరిక ఎవరికుంటుంది? పురాణాల కాలంలోనూ, వంద సంవత్సరాల క్రితం వరకూ కూడా దొంగతనాన్ని సమాజంలో అడుగు వర్గాలతో గుర్తించేవారు. కష్టపడి పనిచేయనివాడికి దొంగతనం అడ్డదారియని ప్రజాసామాన్య అభిప్రాయం. మనదేశంలో బ్రిటిష్ పాలనలో కొన్ని సంచారకులాల వారిని (ఉదా: ఎరుకుల) దొంగల తెగలు (criminal tribes ) గా గుర్తించి వారికి ఒక నిర్దిష్ట నివాస స్థలం ఏర్పరచారు. మన రాష్ట్రంలో స్టువర్ట్ పురం, సీతానగరం లలో ఇలాంటి సెటిల్మెంట్స్ ఉండేవి. సాల్వేషన్ ఆర్మీ అని ఒక క్రైస్తవ మిషనరీ సంస్థ ఆధ్వర్యంలో ఇవి నడిచేవి. వారికి బైబిల్ బోధిస్తే మారవచ్సునని వారిని మతం మార్చేవారట. ఇప్పటికి కూడా prison evangelism అని జైళ్ళలోని నేరస్థులను తమ మతంలోకి ఆకర్షించే ప్రయత్నం క్రైస్తవ మతబోధకులు చేస్తూనే ఉంటారు. ఇదీ చిత్తచౌర్యమే. స్వాతంత్ర్యము వచ్చాక పరిస్తితులు మారాయి. ఇప్పుడు సమాజములో అన్నివర్గాలు దొంగతనములో ఆరితేరాయి. స్విస్ బాంకులలో డబ్బుదాచినవారిని, ధన ప్రక్షాలన (మనీ లాండరింగ్) చేసేవారిని ఏమంటాము. కాబినెట్ మంత్రులనుండి, ఉన్నతాధి కారుల నుండి రైల్వే స్టేషనులో జేబులు. సంచులు, పెట్టెలు కొట్టేసేవారి వరకు అందరిలో దొం గతనం ప్రబలింది. కొందరి ఫొటోలు స్టేషన్ లో పెడతారు. కొందరివి TV లోవస్తాయి. అంతేతేడా.
కనిమొళి, రాజా, జగన్ వంటి వారిని కొందరిని కొన్నిరోజులు జైలులో ఉంచి తరువాత వదిలేస్తారు. జైలు దేముంది? పరమ పావన మైన ప్రదేశం. రామ జన్మస్థానం సమస్యకాని, కృష్ణ జన్మస్థానాలకి,(మథురలోనిది తప్ప) ముఖ్యంగా టిహార్ , చంచల్ గూడా వంటి వాటికి రాజకీయ పుణ్యక్షేత్రాల స్థాయి వచ్చేసింది. జైలు శిక్ష లభించినవారు ఎక్కువ పుణ్యాత్ములు. వారికి కర్మక్షయం అయింది కాబట్టి.

మన పురాణాలలో దొంగతనం దాని వలన వచ్చే నరకబాధలు గురించిన ఆఖ్యానాలు ఉన్నాయా? బ్రహ్మాండ పురాణంలో వజ్రుడనే దొంగ కథ ఉన్నది. దొంగతనం చేసిన వారు భూలోకంలో శిక్ష అనుభవించకపోతే, వారు ఎవరి ఇంటిలో దొంగతనం చేశారో ఆ ధనముపోగొట్టుకునేవారు మరణించినంతవరకు పిశాచరూపంలో ఉంటారట. ప్రజా ధనం అపహరించి స్విస్ బాంకులలో దాచుకున్నవారు ఇప్పుడు జీవించియున్న భారతపౌరులందరూ మరణించేవరకు (వందేళ్ళు) పిశాచాలలాఉంటారట. కథ మరోసారి చెప్పుకుందాం. మన నేతాశ్రీల ఉజ్వల భవిష్యత్తు ఊహించుకుని తృప్తిపడదాం. గాలి వారు అమాయకంగా వెంకన్నతో స్వర్ణ కిరీటం ఇచ్చి క్విడ్ ప్రో కో చేయబోయారు. ఆయన ఒప్పుకోడు పాపానికి కొన్నాళ్ళు నరకం, పూజకు, పుణ్యానికి కొన్నాళ్ళు స్వర్గం ఇస్తాడు. ఇది మన రాజకీయ జీవులకు, మేధావులకు అర్థం కాదు.
No comments:
Post a Comment