Monday, January 22, 2018

జంబు పురాణం

https://www.facebook.com/vallury.sarma/posts/523221401048611

https://www.facebook.com/vallury.sarma/posts/523263331044418

పద్మిని - ఒకావిడ ఇలా అడుగుతున్నారు... నాకయితే అరుంధతి మనవరాలి గురించి తెలియదు...అరుంధతి మనుమరాలు ఆరంజ్యోతి గురించి మీరు చెప్పగలరేమో చూడండి.
ఈ విషయాలు అష్టాదశ పురాణాలలో ఉండవు. కుల పురాణాలు, స్థల పురాణాలు అని ఉన్నాయి. ఉదాహరణకు జాంబ పురాణము, విశ్వకర్మ పురాణము వంటివి. ఇవి ఆయా కులాలలోనివారి వంశాలు, పూర్వీకులు పాటలుగాను కథలుగాను చెప్పేవారు. ఒకొక కులానికి ఇవి చెప్పడానికి ఒకొక శాఖ ఉండేది. విప్రులకు విప్రవినోదులు. ఇప్పుడు దళిత జాతులు అనిచెప్పబడే వారిలో మాదిగలు అని ఒక కులం ఉంది. మాదిగ అనే పదం మహా+ఆదిగా నుండి వచ్చియుండవచ్చును. ఆది ఆంధ్రులు అనే వ్యవహారం ఉంది. వారి కులానికి మూలపురుషుడు జాంబవంతుడు. రామాయణంలో పాత్ర. మనం భల్లూకం, వానరులు అని చెప్పుకున్నా వారు వనవాసీలు అనే సిద్దాంతం ఉంది. ఈ జాంబవంతుడే జంబూద్వీపానిక్ ఆదిమ పాలకుడనేవారు. జంబూ ఫలం, జంబుకేశ్వరం తత్సంబంధ పదజాలంలో ఈసంబంధాలు ఉండి ఉండవచ్చు. అలాగే విశ్వకర్మను విశ్వబ్రాహ్మణులు (కంసాలివారు) పూజిస్తారు. వారిది ఆగోత్రం. ఇవన్నీ పుస్తకాలు వచ్చాయేమో నాకు తెలియదు. ఇవి మౌఖికంగా తరతరాలుగా ఉంటూ వచ్చాయి. సోషియాలజీ లో భాగంగా వీటిపై కొంత పరిశొధన జరిగినది. అరుంధతి , అరుంధతీయులు, ఆరంజ్యోతి పదాలు జాంబపురాణంలో ఉండి ఉండాలి. కులాల మధ్య అప్పుడప్పుడు ఏర్పడిన వైవాహిక సంబంధాలపై గేయాలు పాటలు ఉన్నాయి. పురిటి గదిలో చెప్పబడే ఎన్నెమ్మ కథ దీనికి ఒక ఉదాహరణ. ఈ సందర్భములో "బ్రాహ్మణుని కూతురు, మాదిగవాని పెండ్లాము" అనే వాక్యం పలుకుతారు. అలాగే కుంతీదేవిపేరు గొంతెమ్మ.

జంబు పురాణం విశేషాలు కథలు ఈ క్రింద ఇచ్చిన వెబ్ రిఫరెన్స్ లో దొరుకుతాయి "While Sewing Sandals: or Tales of a Telugu Paraiah Tribe" Archived from Univ of California Library http://archive.org/…/wh…/whilesewingsanda00rausrich_djvu.txt
ఇది తెలుగు మాదిగలను గురించిన పుస్తకం. 1850 - 1900 మధ్యలో క్రైస్తవ మత ప్రచారకులు వారు మతమార్పిడులు చేయదలచుకున్న జనజాతులగురించి అధ్యయనం చేసేవారు. వారు మాదిగలతో సంచరించి వారి కథలు గాధలు సేకరించి వారిని క్రైస్తవమతంలోకి మారడానికి ఎలా ఒప్పించాలో విధాన నిర్ణయాలు చేసేవారు. ఒక కథలో అరుంధతి (ఆమెయే ఆరంజ్యోతి) ఒక బ్రాహ్మణయువకునికి భార్య అవుతుంది. ఆమె ఇసుకను నీటిలో ఉడికించి వరిఅన్నమును చేయగల సమర్థురాలు, పవిత్రురాలు బ్రాహ్మణుడు ఆమెను వివాహమాడటానికి నిశ్చయిస్తాడు. ఇంతలో ఆమె అన్నవచ్చి దానిని వ్యతిరేకిస్తాడు. ఆమె స్వర్గానికి వెళ్లి పోతుంది. (ఇది వశిష్ఠ అరుంధతుల గాధకు వారి వెర్షన్ .) అలాగే కోమట్లకు వారికులానికి సంబంధించిన కథ ఉంది. వైశ్యుల కన్యకా పరమేశ్వరియే వారి మాతంగి అని వారి నమ్మకం. పెద్దకులాల వారు పరమేశ్వరుడు ఒక్కడే అని భావిస్తుంటే మీరు అనేక దేవతలను పూజిస్తూ వారికంటే వెనుకబడి ఉన్నారు. ఈబోధ ఒక మెట్టు. ఏకేశ్వర ఆరాధనలో అత్యంత ప్రముఖము క్రైస్తవమతముఅనిచెప్పే వారు. ఈ మధ్య అర్జున్ ఆంథొనీ ఆరన్ అనే ఫేస్ బుక్ మిత్రుడు ఓంకారము గాడ్,జీసస్, హోలీఘోస్ట్ అనే త్రికమే నని ఒకపోస్ట్ పెట్టాడు. ఇది వారి ఇప్పటి వ్యూహము. కాని ప్రచారకుల విశ్వాసాన్ని, శ్రద్ధను, ఒకే ధ్యేయాన్ని అభినందించాలి.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...