https://www.facebook.com/vallury.sarma/posts/527364520634299
జాజి శర్మ మీ ఆనందం మాతో పంచుకున్నందుకు ధన్యవాదములు. మా ప్రధమ మనుమని ఉపనయనము వైశాఖ మాస బహుళ షష్టి గురువారము శ్రవణ నక్షత్రయుక్త మిధున లగ్నపుష్కరాంశమునందు (30 వ మే) నిర్వహించినాము. వటువుకు మీ ఆశ్శీసులు అందచేయగలరు. చి.మహన్యాస భరద్వాజ (11 సం.) పునాలో చదువుకుంటున్నా, వేదోక్తమంత్రములు అతి స్పష్టముగా పలికి మమ్ములను ఆనందపరచినాడు. సంద్యావందనము ఒక నెలరోజులు దగ్గర ఉండి గాయత్రీ ముద్రలతో సహా సాధన చేయుంచుటకు పూనా వెడుతున్నాను. 3జి డాటా కార్దు వాడుతున్నాను.రొమింగ్ లో ఉన్నను. స్లోగా వస్తోంది. కాబట్టి ఫేస్ బుక్ నకు తరచు రాలేక పొతున్నాను.
ఈ రోజే ఆంధ్రదేశంనుండి బెంగుళూరు రాక. వెళ్ళిన ప్రదేశం భీమునిపట్నం లోని ఆనందవనం. అంతవరకూ ఉన్న 47 డిగ్రీలు ఉష్ణోగ్రత బంగాళాఖాతములోని అల్పపీడనము వలన బాగా తగ్గినది. ఉన్న మూడు నాలుగురోజులూ అప్పుడప్పుడు జల్లులతో ఆహ్లాదకరంగా గడిచింది. రెండురోజులు గురు సన్నిధిలో మా దౌహిత్రుని ఉపనయనం. మా ఇద్దరి తమ్ముల దౌహిత్రులతో సహా. వటువులు 9-11 సంవత్సరాల వయసులో పంచ శిఖలతో ముచ్చటగా ఉన్నారు. భరద్వాజ, వాథూల, శ్రీవత్స, లోహిత మొదలైన గోత్రాల ఋషులను తలచుకునే అవకాశం లభించింది. ఇంకో ముగ్గురు సన్నిహితుల పిల్లల ఉపనయనాలు కూడా జరిగినవి. వేడుకగాకాక వైదిక సంస్కారంగా జరిగిన కార్యక్రమము, హోమములు చక్కగా అన్నికార్యక్రమముల ప్రాముఖ్యతను వివరిస్తూ అద్భుతముగా నిర్వహించిన పురోహితులకు ఋణపడి ఉన్నాము. సంప్రదాయ వివాహాలు కూడా అలాజరిగితే ఎంతబాగుంటాయో అనిపించింది.
No comments:
Post a Comment