https://www.facebook.com/vallury.sarma/posts/518086324895452
శక్తి సృష్టి అంతా వ్యాపించి ఉన్నది. ఇది సత్యం. యోగాభ్యాసం సాధకుని చిత్త-శక్తిని అధికంచేస్తుంది. ఆశక్తి అందరికీ మూలాధార చక్రంలో చుట్టలుచుట్టుకుని నిద్రించే పామువలె నిద్రించిఉంటుంది. ఆ శక్తిపేరే కుండలిని. మూలాధార స్థిత దేవతా శక్తియైన గణపతి ధ్యానం వలన ఆ శక్తి జాగ్రతమై ఊర్ధ్వముఖంగా పయనిస్తుంది. మూలా ధారంనుండి సహస్రారంవరకు అనేక చక్రాలు అనేస్థానాలు ఉంటాయి. ఒకో చక్రంలో ఒకో దేవతను ఆరాధించాలి. స్వాధిస్థాన చక్రం అగ్నిస్థానం.ఆపైన మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రాలు ఉంటాయి. హృదయంలో ఆంజనేయుడు రాముణ్ణీ ఆరాధిస్తాడంటే అనాహతంలో ధ్యానం చేసే యోగి అని అర్థం. ఒకొక చక్రాన్ని అధిగమించ గలిగితే యోగికి కొన్ని శక్తులు వస్తాయి. అన్ని చక్రాలు అధిగమించి సహస్రారం చేరుకున్న యోగికి అమృతతత్వం సిద్దిస్తుంది. భగవద్దర్శనం లభిస్తుంది. స్వచ్చంద మరణం వస్తుంది. భారతంలో భీష్మునికి తండ్రి ఇచ్చిన వరం ఈ యోగవిద్య. ఆధునిక యుగంలో ఈ యోగ శక్తితో దీర్ఘకాలం జీవించిన మహనీయులు తోతాపురి, త్రైలింగ స్వామి. ఇద్దరూ రామకృష్ణపరమహంసకు కనబడతారు.
సాధన మధ్యలో కొంత శక్తి వచ్చినవారు ఆశక్తి ప్రదర్శనలో నిమగ్నమై, దానిని ధనార్జనకు వినియోగిస్తే వారు భ్రష్టయోగులౌతారు. ఇలాంటి వారిని గురించిన ఉదాహరణలు పరమహంస యోగానంద Autobiography of a Yogiలో చదువవచ్చు. యోగసాధన ఫలాలు లౌకిక విద్యలవలె కాకుండా జన్మాంతరంలో కూడా నిలుస్తాయి. షిర్డీ సాయి, సత్య సాయి మహిమలు జన్మాంతర యోగ శక్తులే. బీజాక్షరాలు అన్ని చక్రాలలోనూ ఉంటాయి. ఉదాహరణకు హృదయంలోని అనాహత చక్రంలో ఉండే 12 అక్షరాలు క, ఖ, గ, ఘ, ఙ, చ, ఛ, జ, ఝ, ఞ, ట, ఠ. దీనినే Panini's string notationలో కఠ అనిచెబుతారు. ఆయోగ శాస్త్ర రహస్యాన్ని చెప్పేదే కఠోపనిషత్తు. పద్మిని ఇచ్చిన బొమ్మలో హ, య, వ, ర, ల అనే అక్షరాలు న్నాయి. ఇవి {హ,య,వ,ర, ట్} {ల,ణ్} అనే మహేశ్వర సూత్రాలను తెలియచేస్తాయి. మనం మామూలుగా దేవతలకు షోడశోపచార పూజ చేస్తాం. లం ఇత్యాది పంచోపచార పూజ చేయ వచ్చు

హం ఆకాశతత్త్వాత్మనే పుష్పం పరికల్పయామి
యం వాయుతత్త్వాత్మనే ధూపం పరికల్పయామి
రం అగ్నితత్త్వాత్మనే దీపం పరికల్పయామి
వం వరుణతత్త్వాత్మనే అమృతం పరికల్పయామి
లం పృథ్వీతత్త్వాత్మనే గంధం పరికల్పయామి
యం వాయుతత్త్వాత్మనే ధూపం పరికల్పయామి
రం అగ్నితత్త్వాత్మనే దీపం పరికల్పయామి
వం వరుణతత్త్వాత్మనే అమృతం పరికల్పయామి
లం పృథ్వీతత్త్వాత్మనే గంధం పరికల్పయామి
పాతం అంటే పడడం. జలపాతం వలెనే శక్తి పాతం. గురువు శిష్యుని తలపై చేయి ఉంచిగాని, చూపులతో గాని, మంత్రోపదేశంతోగాని శక్తి పాతం చేయగలడు.
గురువు శక్తి హీనుడు, మోసగాడు అయినట్లైతే వేమన పద్యం గుర్తుంచుకోవాలి.
ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుందు
చూడ చూడ రుచుల జాడవేరు
పురుషులందు పుణ్యపురుషులు వేరయా
విశ్వ...
కాషాయవస్త్రం కట్టుకునే కొందరిని గురించి శంకరులే చెప్పారు:
జటిలో ముణ్డీ లుఞ్ఛితకేశః కాషాయామ్బరబహుకృతవేషః .
పశ్యన్నపి చన పశ్యతి మూఢః ఉదరనిమిత్తం బహుకృతవేషః
ఇక టీవీ ప్రకటనలు, నేటి మార్కెటింగ్ విధానం. చైతన్య,నారాయణ, మేధా సంస్థలు చదువును అమ్ముకొన్నట్లే, పాపం స్వామీజీలు భక్తులను ఆకర్షిస్తున్నారు. ఒక గురువు ఒక శిష్యురాలిని మోసం చేసి ధనార్జన చేస్తే పాపం నమ్మకం ఉన్న అమాయకురాలిది కాదు, అదిచేసినవారి ఖాతాలోకి వస్తుంది. కొందరికి శక్తి పాతాలు పనిచేస్తాయేమో? Swaamiji’s Sakti patam versus Sachin’s endorsement of Boost. Which gives more energy? TVX can try an investigative report. The ones getting ads from Swamiji will not do it. ఒక్క గురువులు, బాబాలు ఏమిటి, అన్ని రంగాలలో ప్రజలు మోసపోతూనే ఉన్నారు. అదినేటి అవినీతి భారతం.

Suryanarayana Murthy Dharmala శక్తిపాతం vs సచిన్ బూస్ట్ చాలా అత్యంత సమీచీనంగా ఉంది.
ధనాగారవృద్ధిర్నిమిత్తం
బహుకృతవేషః. నేటి మోసపూరిత అవినీతి భారతాన్ని చక్కగా ఎండగట్టారు. ఆనందంగా ఉంది.
మూలాధారం నుంచి సహస్రారం వరకు జరిగే యోగ క్రియ వివరణ, ఫలం మొ।।నవి సుబోధంగా ఉన్నవి. ఇంతకంటె అందమైన వస్తువు, మూలానికి భావాత్మక అనువాదం ఇంకెక్కడ మనకు లభించగలదు? మీచింతన చిరంతనంగా సరాహనీయం. అభివందనాత్మక
ప్రశంసలు స్వీకరించండి
డా।ధర్మాల సూర్యనారాయణ మూర్తి

No comments:
Post a Comment