https://www.facebook.com/vallury.sarma/posts/471434249560660
వ్యక్తి - individual, వ్యవస్థ system, సమాజం society ఏది ముఖ్యం? అని అడిగితే ఎవరికి? అనే ప్రశ్న వస్తుంది.
వ్యక్తి-తనకి తాను ఎప్పుడూ ముఖ్యం. కుటుంబ వ్యవస్థలో కొంతకాలము తనకుటుంబానికి ముఖ్యం. వ్యవస్థలో తాను ఒక సూక్ష్మభాగం. వ్యవస్థలు పెరుగుతూ ఉంటాయి. మన రాజకీయ వ్యవస్థలో ఒక వ్యక్తి వోటు విలువ ఎంత? శూన్యం. ఒక గుంపు (కులం, మతం , ఏదో ఒక కార్మిక సంఘం) యొక్క ప్రవర్తన ముఖ్యం. వ్యక్తికి వ్యవస్థ ముఖ్యం. వ్యవస్థకి ఒక వ్యక్తి ప్రభావం అల్పం. ఆ వ్యక్తి యొక్క సంబంధాలు పెరిగినకొద్దీ ఒక గుంపుకు నాయకునిగా వ్యవస్థకు ముఖ్యం అవుతాడు.మనుష్యుడు ఎక్కడ ఉంటాడో అతని చుట్టూ అక్కడ ఒక సమాజం పెరుగుతుంది. వివాహ వ్యవస్థతో ఒక కుటుంబం ఏర్పడుతుంది.అనేక కుటుంబాలు కలిపి ఒక సమాజము, అది నడవడానికి వ్యవస్థలూ ఏర్పడతాయి. కాల క్రమేణా వ్యవస్థలు బల పడచ్చు. బలహీన పడచ్చు. కంపెనీ వ్యవస్థ బలపడుతోంది. కుల వ్యవస్థ బలహీన పడుతోది. కొన్ని మతాల వ్యవస్థలు బలపడుతున్నాయి. వ్యవస్థీకృతం కాని మతాల ప్రభావం తగ్గుతూంది. బుద్ధుడు సంఘం శరణం గచ్ఛామి - అన్నాడు. సంఘం సరీగా ఉన్నప్పుడూ వ్యాప్తి చెందింది, బలహీన పడినప్పుడు క్షీణ దశకు చేరుకున్నది. ఇక్కడ మతం యొక్క గొప్పతనంతో సంబంధంలేదు. ఒక గొప్ప ఆచార్యుడు నాయకుడు కాలేక పోవచ్చు. సమాజ బలం వలన ఒక బుద్ధిహీనుడు కులపతి కావచ్చు. ఈ మూడిటి లక్షణాలు తెలుసుకోవాలి. వాటి నడతను సరిదిద్దుకోవాలి.
Krishna Mohan - You are not the first to use dirty India epithet. Katherine Mayo wrote a book in 1927 entitled MOTHER INDIA whose conclusions are India and Hindus are dirty. Hinduism is a barbaric religion. Indians do not deserve independence. Gandhiji called it a drain inspector's report. I read this fully recently. I appreciate your viewpoint and it has truth though it may be unpleasant. This remained an influential book and many Americans still read it before visiting India.
వ్యక్తి - individual, వ్యవస్థ system, సమాజం society ఏది ముఖ్యం? అని అడిగితే ఎవరికి? అనే ప్రశ్న వస్తుంది.
వ్యక్తి-తనకి తాను ఎప్పుడూ ముఖ్యం. కుటుంబ వ్యవస్థలో కొంతకాలము తనకుటుంబానికి ముఖ్యం. వ్యవస్థలో తాను ఒక సూక్ష్మభాగం. వ్యవస్థలు పెరుగుతూ ఉంటాయి. మన రాజకీయ వ్యవస్థలో ఒక వ్యక్తి వోటు విలువ ఎంత? శూన్యం. ఒక గుంపు (కులం, మతం , ఏదో ఒక కార్మిక సంఘం) యొక్క ప్రవర్తన ముఖ్యం. వ్యక్తికి వ్యవస్థ ముఖ్యం. వ్యవస్థకి ఒక వ్యక్తి ప్రభావం అల్పం. ఆ వ్యక్తి యొక్క సంబంధాలు పెరిగినకొద్దీ ఒక గుంపుకు నాయకునిగా వ్యవస్థకు ముఖ్యం అవుతాడు.మనుష్యుడు ఎక్కడ ఉంటాడో అతని చుట్టూ అక్కడ ఒక సమాజం పెరుగుతుంది. వివాహ వ్యవస్థతో ఒక కుటుంబం ఏర్పడుతుంది.అనేక కుటుంబాలు కలిపి ఒక సమాజము, అది నడవడానికి వ్యవస్థలూ ఏర్పడతాయి. కాల క్రమేణా వ్యవస్థలు బల పడచ్చు. బలహీన పడచ్చు. కంపెనీ వ్యవస్థ బలపడుతోంది. కుల వ్యవస్థ బలహీన పడుతోది. కొన్ని మతాల వ్యవస్థలు బలపడుతున్నాయి. వ్యవస్థీకృతం కాని మతాల ప్రభావం తగ్గుతూంది. బుద్ధుడు సంఘం శరణం గచ్ఛామి - అన్నాడు. సంఘం సరీగా ఉన్నప్పుడూ వ్యాప్తి చెందింది, బలహీన పడినప్పుడు క్షీణ దశకు చేరుకున్నది. ఇక్కడ మతం యొక్క గొప్పతనంతో సంబంధంలేదు. ఒక గొప్ప ఆచార్యుడు నాయకుడు కాలేక పోవచ్చు. సమాజ బలం వలన ఒక బుద్ధిహీనుడు కులపతి కావచ్చు. ఈ మూడిటి లక్షణాలు తెలుసుకోవాలి. వాటి నడతను సరిదిద్దుకోవాలి.
122 కోట్ల భారతీయులలో సమాజాన్ని ప్రభావితంచేయగల వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఎందరు ఉంటారు? వాళ్ళ వలనే ఉపయోగం. కాని వాళ్ళు సమాజానికి పునాదులు కారు, సమాజంలో సజ్జనులకు మార్గ దర్శకులౌతారు. సాక్షాత్తూ కృష్ణుడు తన అవతార కాలంలో 75 శాతం ప్రజలను ప్రభావితంచేయలేకపోయాడు. తనకుటుంబంలో కూడా. ఆయన సంకల్పం వల్లే వాళందరూ కూడా నశించారు.
మన సనాతన ధర్మమునకు (నేడు హిందూమతమని వ్యవహరించబడుతున్నదేకాక బౌద్ధ, జైన, సిఖ్ఖు, చార్వాక, లోకాయత వాదాలను కలుపుకోవాలి) ఎవరు స్థాపకులు, వ్యవస్థాపకులు? ఎవరూలేరని మామూలుగా చెబుతారు. కాని ఉన్నారు. వారే మహర్షులు. వారి చరిత్రలు తెలుసుకోడానికి ఆధారాలు పురాణేతిహాసాలు. వారి వలననే వేదాలు, ఉపనిషత్తులు మన మత, తత్త్వ శాస్త్ర గ్రంధాలన్నీ లభించాయి.వారు ఒకనాడు జీవించిన వ్యక్తులు. అందుచేత పురాణాలు కల్పితగాధలని అనరాదు. శ్రీరాముడు 10000సం పరిపాలించాడంటే అది అతిశయోక్తి. రాముడు 60-70 సం కంటె జీవించలేదు. కృష్ణుడు యోగి. కాని ఆయన జీవించినది 125 సం. ఇవి మనకు పురాణాల వలననే తెలుస్తాయి. పురాణాలలోని జ్యోతిష అంశాలవలన కూడా తెలుస్తాయి. రామునికి కృష్ణునికి మధ్యకాలం సుమారు 1400 సం కి అటూఇటూ.
No comments:
Post a Comment